జాతీయ వార్తలు

‘ఈవిఎం చాలెంజ్’పై నేడు షెడ్యూల్ విడుదల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: దమ్ముంటే ఈవిఎంలను ట్యాంపర్ చేసి చూపించాలంటూ సవాల్ విసిరిన కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఇందుకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ విలేఖరుల సమావేశంలో ‘ఈవిఎంల ట్యాంపరింగ్’ షెడ్యూలును ప్రకటించనున్నారు. విజ్ఞాన్‌భవన్‌లో శనివారం గంటన్నర పాటు ఈవిఎంలు, వివిపిఏటిలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రదర్శించబోతోంది. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఈవిఎంలను పలువురు ప్రముఖుల సమక్షంలో ట్యాంపర్ చేసి చూపించవలసి ఉంటుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కోసం ఉపయోగించిన ఈవిఎంలను ట్యాంపర్ సవాల్‌లో ఉపయోగించనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవిఎంలను) ట్యాంపర్ చేయవచ్చునంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ, కాంగ్రెస్ తదితర పార్టీలు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమ్‌ఆద్మీ పార్టీ ఒక అడుగు ముందుకేసి దీని కోసం శాసన సభను ప్రత్యేకంగా సమావేశపరచి ఈవిఎంలను ట్యాంపర్ చేయవచ్చునంటూ ప్రదర్శన చేసి చూపించింది. అయితే తమ ఈవిఎంలను ట్యాంపర్ చేయటం అసాధ్యమని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతూ వస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ ఇటీవల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తమ ఈవిఎంలను ట్యాంపర్ చేయటం అసాధ్యమని స్పష్టం చేశారు. అలాగే దీన్ని రుజువు చేసేందుకు త్వరలోనే ఇందుకు సంబంధించి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించటం తెలిసిందే. అఖిలపక్ష సమావేశంలో ఇచ్చిన హామీ మేరకే కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ట్యాంపర్ సవాల్ షెడ్యూలను ప్రకటించనుంది. ట్యాంపర్ షెడ్యూలు సమయంలో రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు ఈవిఎంలను ట్యాంపర్ చేసి చూపించవలసి ఉంటుంది. ఈవిఎంలు ట్యాంపరింగ్ సాధ్యమేనని పార్టీలు రుజువుచేయగలిగిన పక్షంలో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించే పాత విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టేందుకు వీలుంటుందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కాగా బిజెపి, సిపిఐ, సిపిఎం, అన్నాడిఎంకె, డిఎంకె, ఎన్‌సిపి, జెడి(యు) ఈవిఎంల వినియోగాన్ని సమర్ధిస్తున్నాయి. అయితే ఈవిఎంలకు పేపర్ బ్యాలెట్ సిస్టం అనుసంధానం చేస్తే పారదర్శకత ఉంటుందని ఆమ్‌ఆద్మీ పార్టీ, బిఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,మణిపూర్, గోవా, పంజాబ్ ఎన్నికల్లో బిజెపికే ఓట్లుపడేలా ఈవిఎంలు ట్యాంపరింగ్ చేశారని ఆప్,బిఎస్పీ ఆరోపించాయి. దీంతో మిగతా పార్టీలు వాటితో గొంతుకలిపాయి. పేపర్ బ్యాలెట్ విధానమే మంచిదని వారు చెబుతున్నారు.