ఉత్తరాయణం

సెల్‌తో పెరుగుతున్న ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడటం తరచూ ప్రమాద హేతువులవుతున్నాయి. ద్విచక్రవాహనాలు మొదలుకొని భారీ వాహనాలవరకూ డ్రైవింగ్ చేసే వారు డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం వల్ల పరధ్యానంతో ఎదురుగా వస్తున్న వాహనాలను, పాదచారులను గమనించక ఢీ కొడుతున్నారు. ఫలితంగా వారికివారే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే గాక అమాయకులనూ బలి తీసుకుంటున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్‌శాఖవారు లైసెన్స్‌లను తనిఖీ చేయడమే కాదు సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
బెల్ట్‌షాపులను అరికట్టాలి
అధికారంలోకి రాగానే బెల్టు షాపులు తొలగిస్తామన్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ హామీని తుంగలోనికి తొక్కి వీధి వీధికి బెల్టు షాపులను ఏర్పాటుచేసినా పట్టించుకోవడం లేదు. రాత్రయ్యేసరికి నగరాల, గ్రామాలనే తేడా లేకుండా ప్రజలు మద్యం సీసాలతో సహజీవనం చేస్తూ మత్తులో ఊగుతున్నారు. హఐవేలపై మద్యం దుకాణాలు బాగా ఎక్కువైపోవడంతో డ్రైవర్లు ఫుల్‌గా లాగించి వాహనాలు యమస్పీడుతో నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక టీషాపులు, రెస్టారెంట్లు, దాబాలు, రెస్ట్‌హౌస్‌లలో భోజనంతోపాటు మద్యం, మగువ యధేచ్ఛగా దొరుకుతోంది. హైవేలపై జరిగే ప్రమాదాలలో 90 శాతం స్పీడ్ డ్రైవింగ్, మందు సేవించడంవలనే జరుగుతున్నాయని జాతీయ రహదారి భద్రతా సమాఖ్య తేల్చి చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో ఆ భగవంతునికే ఎరుక!
- ఎం.కనకదుర్గ, తెనాలి
మంచి అలవాట్లను అనుసరించాలి
మన మతంలో పెద్దలు, మహానుభావులు కట్టుబాట్లు కల్పించారు. అది కేవలం నాగరికత అభివృద్ధి చెందడంకోసమే. కాలం మారినపుడు అలవాట్లలో మంచిని తీసుకొని చెడేమైనా ఉంటే వదిలి వెయ్యాలి. న్యాయవ్యవస్థ, హిందూ మతంపై గురిపెట్టి కుసంస్కర్తలు హిందూ మతంపై వేటు వేద్దామని చూడడం మనకి మంచిది కాదు. ఇప్పటికైనా మన హిందూ మతంలో ప్రముఖులు మేల్కొని మంచిచెడుగుల్ని పరిగణనలోకి తీసుకొని చర్యలు చేబట్టి హిందూమతం నుండి వలసలు ఆపి ప్రలోభాలకి లొంగి పైకి వెళ్తున్న వెళ్ళిన వారిని వెనక్కి తెచ్చుకొంటూ హిందూ మత అభివృద్ధికి పాటుపడాలని వినయ పూర్వకంగా మనవి. దీటుగా అన్యమత ప్రచారాన్ని నిరోధించాలి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
బాపూజీ కలలు నిజం కావాలంటే..?
ప్రగతికి పల్లెసీమలు పట్టుకొమ్మలు. నేటి భారతదేశంలో గ్రామాలు ఎంత అధ్వాన్నస్థితిలో వున్నాయో ఊహించలేని స్థితి. బాపూజీ గ్రామ సీమల అభివృద్ధికి ఎన్నో పథకాలు సూచనలు ఇచ్చాడు. కానీ అవి అమలులో లేవు. ముఖ్యంగా కుటీర పరిశ్రమలు, ఖద్దరు దుస్తులు ధరించడం విదేశీ వస్తు బహిష్కరణ బాపూజీ సిద్ధాంతాలు. బాపూజీ ఆశయాల మేరకు గ్రామసీమలను అభివృద్ధిచేయడం ఎంతో ఆవశ్యకం. వ్యవసాయ రంగం పాడిపరిశ్రమ అభివృద్ధికి ఇతోధిక సేవలు అందించి గ్రామసీమల పటిష్టతను అభివృద్ధిపరచాలి. నిరక్షరాస్యులకు అక్షరాస్యులని చేయడం ముఖ్యమైన విషయం. స్వచ్ఛ్భారత్‌లో ప్రధానమంత్రి మోదీ ‘బాపూజీ సుమార్గకిరణం’ విధానం అమలుపరచాలి.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
అనవసర ఖర్చు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న దేశంలోకెల్లా ఎత్తయిన జండాను, సంజీవయ్యపార్కులో 303 అడుగల ఎత్తయిన జాతీయ జండాను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1.96 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ జండాను నిర్మించే బాధ్యతను కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీకి అప్పగించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్లవారు తన మనసులోనికి ఏది వస్తే దాన్ని చేయడానికి స్వంత నిర్ణ యం తీసుకొంటారు. దానికోసం ప్రభుత్వ (ప్రజల) డబ్బు కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చుచేస్తున్నారు. అంత పెద్ద జండాను నిర్మించవలసిన అవసరమేముంది? దానివల్ల ప్రయోజనమేంటి? రాష్ట్రంలో ఎన్నో రకాల ప్రజోపయోగ పనులకు డబ్బు లేదంటూ వాయిదాలు వేస్తూ, ఈ విధంగా ఖర్చుచేయడం ఏమాత్రం సమంజసం కాదు..
- బి.సత్యప్రకాశ్, సూర్యాపేట