మెయిన్ ఫీచర్

‘అది’ తెలిస్తే సంతోషతరంగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎరుక’ అను మాట వినగానే వేమన యోగి వంటి మహనీయులెందరో మనకు గుర్తుకొస్తారు. అసలు ఆ మాటకు గల శబ్దార్థములు తెలివి, జ్ఞానము, మెలకువ, పరిచయము, సోదె, గుర్తు, జోస్యము, Knowledge, understandind అన్నీ మనకు తెలిసినవే. ఎరుకను వ్యవహారిక ఫదముగా ఆలోచించినప్పుడు, ఎరుక మనకు రావాలంటే మనము ముందుగా సంపాదించుకోవలసిన విషయము ఓ అవగాహన మనకు తప్పక ఉండి తీరాలి. ఎందుకంటే ఓ అవగాహనపుటెరుక మనకు ఉండకపోతే, ఆ విషయము లేదా వస్తువు అక్కడ ఉందని, దాని ఉనికినే మనము గ్రహించలేము. అంతేకాక, మనవద్ద ఒక విధమైన సహజ అవగాహనాతత్వము ఉన్నది. అదే మనకు కనపడుతున్న విషయముల మూలములలో ఏమి ఉంటోందన్నతత్వాన్ని మనము గ్రహించడానికి ఉపకరణముగా ఉపయోగపడుతున్నది. ఈ సహజ అవగాహనాతత్వము ద్వారానే మనకు లభ్యమవుతున్న ఎరుకను ఎరుకగా గమనిస్తున్నాము. ఐతే, పూర్తి ఎరుకతో యోగంలో, ఎరుకను అణచివేస్తాము. తంత్రంలో ఎరుకతో అందులో మునిగిపోతాము.
2. సాధారణముగా నీ తెలీవే నీవు-నేనుఅంటూ జాగ్రద స్వప్నములలో శాశ్వత ఆనందములకై అనే్వషిస్తున్నది. ఈ తెలివే తననుతానే విశ్రాంతి నిమిత్తమై, లయ స్వరూపమై గాఢ నిద్రను సుషుప్తిగా వ్యవహరిస్తున్నది. అసలు ఈ తెలివే జాగ్రదాది సర్వఅవస్థల స్వరూపము. కనుక ఈ తెలివిని సహజముగా అవగాహన చేసుకొని గమనించినంతనే మనందరికీ ఆనందమే అవుతుంది.
3. ఈ తెలివి తనకుతానే అహంకారాదులుగా భావించి, ఉద్భవించి స్వీయ ఆనందమునకై నానా అగచాట్లుపడుతూ, అప్రసక్త యుక్తి తర్కవిశ్వాసములలో, భాషాపాండిత్యములలో ఎప్పుడో ఎచ్చటో కలుగునని ప్రయత్నించుచున్నది. ఈ విధముగా తెలివి అనేక బంధముల సుడిలో పడుతున్నది.
4. గమనాగమనములు, రాకపోకలు, ఆవిర్భావ తిరోభావములు, జన్మలయాదులు కలదే ఈ తెలివి స్వరూపము. నిజానికి జ్ఞప్తి స్వరూపమైన తెలివి తాను మరుచుట చేత సహజానందమును పొందలేకున్నది. కనుకనే ఈ తెలివి అనేక మార్గముల, పద్ధతుల ద్వారా తను సహజానందమును పొందుటకై సాధనాదులతో శ్రమపడుతున్నది. కారణము, ఈ తెలివియే పొట్టకూటికై అనేక విద్యలకు, ఆహారమునకు, ఆపైన ఆరోగ్యమునకై ఆహార నియమాది యోగాభ్యాసములను జనులు అభ్యసించునట్లు చేస్తున్నది.
5. మొట్టమొదటగా పరిపూర్ణమునందు ఎరుక తనకుతానే తోచి తానే పరిచయాదులు చేసుకున్నది. ఈ తెలివిని తెలివిగా స్వీయస్మృతిని అవగాహన పొందినంతనే స్వానందము సహజమవుతుంది. పిమ్మట స్వానంద స్వీయ గమనికలో తెలివి వౌనమవుతుంది అంతేకాక, తెలివి రాకపోకలు, గమనాగమనములు, ఆవిర్భావ తిరోభావములు ఉత్తవైపరిపూర్ణమైన తెలివి ఎరుకగా స్వతఃసిద్ధమగును.
6. వాస్తవముగా జనన మరణములు, గమనాగమనములు, రాకపోకలు, ఆవిర్భావతిరోభావములు పరిపూర్ణమునకు ఎన్నడూ లేవు. పరిపూర్ణమునందు నేనుకే జనన మరణములు, రాకపోకలు, గమనాగమనములు ఉంటాయి. కావున జనులు ఈ అప్రసక్తమైన వాటితో కాలమును వ్యర్థముచేయక, ఏకాత్మ భావనాబలముతో సత్కర్మలను విశ్వశాంతి కల్యాణమునకు ఎవరి సాధననువారే శ్రద్ధగా చేయాలి. ఈ విధంగా నేనును అవగాహన చేసుకొని సహజముగా గమనించినంతనే సూటిగా స్పష్టంగా స్వానందవౌనము అవగతమవుతుంది.
7. మన సంప్రదాయక నవీన సర్వమార్గములు, పద్ధతులలో అందరూ శాశ్వతానందమునకై (ఆత్మ) ప్రయత్నముచేయుట వాస్తవము. నిజానికి సర్వ వేదవేదాంగములు, దర్శనములు, శాస్తమ్రులు, పవిత్ర గ్రంథముల సారము, ముఖ్య లక్ష్యమేమనగా మానవుడు శాశ్వతానందమును (ఆత్మ) పొందుటమే. అసలు ఈ తెలివియే ఆనందమును పొందుటకు ఆలంబనం. అంటే స్వీయజ్ఞప్తితో తెలివికి స్వానందము అయి, ఆస్వానంద వౌనస్వీయ గమనికలో తెలివికి పరిపూర్ణ బోధ సూచన ఎరుకపరచినంతనే ఎరుక సహజముగానే వదులుతుంది. పిదప నీ స్వానంద స్వీయగమనికలో తెలివి వౌనమవుతుంది.
ఇక ఎరుక వృత్తులు పరిపూర్ణమునందు ఏ మాత్రము పైకి లేవలేవు. ఈ విధముగా తెలివి ఏమీకాక ఏమీలేక ఎరుకను ఎరుకతో గమనించుట జరుగును. అంటే ‘నాకృప’యే స్వానంద పరిపూర్ణ స్వీయస్మృతి గమనికేనని నీవు గ్రహిస్తావు. ‘‘నా కృప’’అనగా తెలివికి స్వీయ సహజ విశిష్ట లక్షణములు అవగాహన కలిగించి స్వానందమును జ్ఞప్తి చేయుటయే.
ఈ విధముగా స్వీయ స్మృతి గమనికలోనున్నవారు వాదతర్కయుక్తి సాధన విశ్వాసముల ఊసు ఎత్తరు. వారు స్వానంద వౌనమును పొంది సత్కర్మలను ఆచరించుచూ కాలమును సద్వినియోగం చేసుకొంటారు.
8. ఈ ఆనంద స్వానుభవ అవగాహన విధానమును ఏ సంప్రదాయక నవీన పద్ధతులతో పోల్చకూడదు. అంటే అప్రసక్త యుక్తితర్క సాధన విశ్వాసములతో కూడిన ఏ సాధనా పద్ధతులు స్వానుభవ అవగాహన ప్రబోధ విధానము కానేరదు. కారణము నేను కాని, నేను లేని, నేను విలక్షణ నేను రహిత పరమార్థ తత్వమునకు తెలివియే పరిపూర్ణమని, వౌనమని, సత్యమని, స్వాత్మయని కేవలాత్మనియు, తెలివియని, జ్ఞప్తియని, సంకల్పమని, నేను యినితనకు తానే సంజ్ఞలు (గుర్తులు) పెట్టుకున్నది.
ఇక పరిపూర్ణమునందు స్వకారణ ఎరుక ఆవిర్భావ తిరోభావములు ‘నా కృప’తో పరిపూర్ణముకనినింతనే, మూలములేని ఎరుక ఆవిర్భావ తిరోభావములన్నియు స్వయముగానే అదృశ్యమై, పరిపూర్ణమే స్వతఃసిద్ధవౌతుంది.
9. ఈ విధముగా స్వానంద పరిపూర్ణ స్వీయ గమనిక ప్రతి ఒక్కరికి స్వానుభవ ప్రమాణమే. కనుక ‘నా కృప’తో స్వీయ స్మృతిని కలిగించు బోధ సూచనాదులు మనల్ని విడువకుండా ఉంటే నిరతము ఆనందమేకదా!

- వేదాంతం ఉపేంద్రశర్మ