మెయిన్ ఫీచర్

అనంతుని అర్చనం దివ్యానుభూతుల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతునికి ఆకారం లేదు. పేరు లేదు. కాని భక్తుడు ఏవిధంగా కోరుకుంటాడో ఆవిధంగానే తన్ను తాను సృజియంచుకోగల శక్తిసంపన్నుడు ఆ భగవంతుడు. సత్యధర్మాలకు ఆ భగవం తుడు వెన్నుదన్నుగా ఉంటాడు. ఎపుడైతే తాను సృష్టించిన లోకంలో అధర్మం పెచ్చుమీరుతుందో అన్యాయం ప్రబల రూపం పొందుతుందో అపుడే తన్ను తాను రూపున్న వానిగా రూపుదిద్దుకుని నామరూపాలతో అందరికీ అగుపడు తాడు. దుష్టులను దునుమాడుతాడు. సత్యాన్ని ధర్మాన్ని మళ్లీ సుస్థాపితం చేస్తాడు. లోకులందరిచేత భగవంతు డని, పరమేశ్వరుడని కొనియాడబడు తాడు. అటువంటి పరమాత్మను సాధార ణులు సైతం తమను ఉద్ధరించమని వేడు కుంటారు. తమను కల్యాణకారులను చేయమని ప్రార్థిస్తారు.
అట్లాంటి వారే శీలకౌండన్యులు. వారిద్దరూ ఆదర్శదంపతులు. కాని వీరు దారిద్య్రంతో బాధపడేవారు. ఒకనాడు సత్యదేవుని గూర్చి శీల వింటుంది. అనం త పద్మనాభుని వ్రతం చేస్తున్న వారిని చూచింది. వారిని అడిగి వివరాలు కనుక్కొంది. తమనుకూడా ఆ అనంతు డు కాపాడుతాడని అనుకొంది. ఈ సత్య దేవుడు తన్ను కరుణించాలని ప్రార్థిస్తుం ది. ఆ స్వామిని ప్రార్థిద్దామని తన భర్త ను కూడా ప్రేరేపిస్తుంది. శ్రీమన్నా రాయ ణుని భజన మాత్రమే చాలు అనే కౌండన్యునికి కూడా ఆ శ్రీమ న్నారాయ ణుడే అనంతుని అర్చించమని దారి చూపాడు. అలా వారిద్దరూ శ్రీమన్నారా యణుని చేత ప్రేరణపొంది తమ కష్టాలు తొలిగిపోవాలని అష్టైశ్వర్యాలతో తుల తూగేలా చేయమని అనంత పద్మనాభుని స్తుతిస్తారు. తాము నమ్మిన సత్యదేవుడే అనంత పద్మనాభునిగా అవతరించాడని ఈ అనంతపద్మ నాభుని అర్చించినవారికి ఇహలోకంలో కష్టాలు దూరవౌతాయని పరలోక సంపదలు కూడా ఒనగూడు తాయని పెద్దల ద్వారా కూడా తెలుసు కొంటారు. అనంత పద్మనాభుని వ్రతం చేయడానికి ఆరంభం చేస్తారు.
‘కృత్వా దర్భమయం దేవం శే్వత ద్వీపే స్థితమ్ హరిమ్ సమన్వితం సప్త ఫణె పింగళాక్షం చతుర్భుజమ్’ అంటూ ప్రార్థిస్తూ ఒక శుభ్రమైన ప్రదేశం లో అష్టదళ పద్మాన్ని చిత్రించాలి. దాని మీద తామర పూవు వంటి మండపం కట్టాలి. అందులో నీటితో నింపిన కలశాన్ని దక్షిణభాగంలో నిలిపాలి. వేదిక మధ్యలో అనంతపద్మనాభుని ఆవాహన చేయాలి. ఆసనం ఇచ్చి కూర్చోమనిప్రార్థించాలి. ఆ తరువాత ఆస్వామిని పూవులతోను అక్షింతలతోను పూజించాలి. షోడశోప చార పూజచేయాలి అని వ్రతాచరణను తెలుసుకొన్నారు. వెంటనే శీలకౌండన్యు లు అట్లానే చేసారు. అలా అనంత పద్మనాభుని పూజిస్తూ 14 ముళ్లు కలిగిన కుంకుమతో తడిసిన కొత్త తోరా న్ని స్వామి దగ్గర పెట్టి పూజించారు. తోరాన్ని కుడిచేతికి కట్టుకున్నారు. ఐదుపళ్ల గోధుమ పిండితో 28 అప్పాల ను చేశారు. అందులోనుంచి 14 అప్పాలను వాయనంగా బ్రాహ్మణునికి యిచ్చారు. తరువాత బ్రాహ్మణ సమారాధనను చేశారు. దక్షిణ తాంబూలములతో వారిని సంతృప్తి పరిచారు. ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించారు. వ్రతమహాత్వాన్ని తెలిపే కథను విన్నారు. ఇలా కొన్నాళ్లు గడిచాయ. కాని కొన్నాళ్ల తరువాత కౌండన్యమహర్షికి మాయ ఆవరించింది. తన భార్య చేతికి కట్టుకుని ఉన్న అనంతుని తోరాన్ని చూసి మండి పడ్డాడు. తన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్న తాయెత్తు అని కోపంతో తాయెత్తును తీసి మంటల్లో వేసేశాడు. ఇలాంటి అకృత్యం చేసినందున వారిని కష్టాలు చుట్టు ముట్టాయ.
‘‘స్వామీ! ఈ తోరం వల్లనే అష్టైశ్వ ర్యాలు లభించాయ. ఆ పరంధాముని కృప కలిగింది’’ అని శీల ఎంత చెప్పినా కౌండన్యుడు వినలేదట. చివరకు నేను ఆ అనంతుని చూస్తానని, చూస్తే గాని నమ్మనని బయలుదేరి కౌండన్యుడు దేశాటన మొదలు పెట్టాడు. కాని చాలా దూరం తిరిగి అనంతుడు కనబడక ఆకలికి ఓర్వలేక సొమ్మసిల్లి పడి పోయాడు. దయాళువు అయనస్వామి కౌండన్యుని కలలో కనబడి నీవు నా వ్రతాన్ని 14 ఏళ్లు ఆచరించు. అపుడు నీకు దర్శనం ఇస్తాననిచెప్పాడట. కౌండన్యు నికి మెలుకువ వచ్చింది. కల జ్ఞాపకం వచ్చి తాను చేసిన పొరపాటు తెలుసు కొన్నాడు. తన తప్పుకు తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాడు. తిరిగి అనంతుని క్షమించమని ప్రార్థించాడు.
తిరిగి ఇంటికి వచ్చి తన ధర్మపత్ని తోకలసి 14 సంవత్సరాలు అనంతపద్మ నాభ వ్రతాన్ని ఆచరించి పుత్ర పౌత్రాభివృద్ధిని పొంది, అంత్యకాలమునందు నక్షత్రలోకంలో స్థానాన్ని పొందాడు అని అనం తపద్మనాభుని వ్రత కథ చెబుతుంది. ఈ కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పి ఆచరింప చేసాడట. అందుకేవారికి అన్నింటా విజయం కలిగిందని అంటా రు. ఆధ్యాత్మిక జ్ఞానాన్నిచ్చి, అంత్యాన మోక్షాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని ప్రతివారు ఆచరించాలి.
ఓసారి చిత్రకేతువు అనేమహారాజు స్వామిని దర్శించాలని కోరుకుని నారదు ని మార్గం చూపించమని కోరాడట. నారదుడు సంతోషపడి చిత్రకేతువుకు సంకర్షణ మంత్రాన్ని ఉపదేశించాడట. ఆ మంత్రాన్ని బాగా మననం చేసి చివరకు నీలాంబరాలతో కిరీట, కేయూర, కటి సూత్ర కంకణాలతో ప్రసన్న వదనుడై, సనత్కుమారాది సిద్ధులు సేవిస్తూ ఉండే అనంత పద్మనాభుని దర్శంచాడట చిత్ర కేతువు. అనంతుడు పరమానం దంతో తన్ను వీక్షించే చిత్రకేతువునును చూచి స్వామి దివ్య విమానాన్ని, విద్యాధరలోకాధిపత్యాన్నిచిత్రకేతువును అనుగ్రహించాడట. అందుకే మనమూ ఈ స్వామిని సేవిద్దాం. స్వామి అనుగ్రహాన్ని పొందు దాం.

- చోడిశెట్టి శ్రీనివాస్