మెయిన్ ఫీచర్

జ్ఞాన దీపమే దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంప్రదాయాలలో కాలచక్రంలోని తెలుగు మాసాలలో ఆశ్వయుజ మాసానికి పర్వదిన విశిష్ఠత పేర్కొన దగినది. అశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అంటారు. ఈ రోజున ప్రాతఃకాలమున లేచి కాలకృత్యాలాచరించి, ప్రజలందరు గడ్డితో చేసిన బాణసంచాలోపల వుంచిన నరకాసురుని బొమ్మను ఆనందోత్సాహాలతో కాల్చి సాయంత్రం దైవసన్నిధిలో దీపారాధన చేస్తారు. నరకుని బొమ్మను మంటల్లో తగలేస్తారు. అసలు ఈ నరకుడు ఎవరు? ఎందుకు ఇలా నరకుని బొమ్మను తగలేస్తారనే విషయంలో పురాణాల పరంగా గాధ ఒకటి ఉంది.
నరకుడు ఒక రాక్షసుడు. వరాహావతార కాలం అది. విష్ణుమూర్తికి, భూదేవికి ఈ నరకుడు జన్మించాడు. భూదేవి ఆ కాలంలో జనకరాజుకు తన పుత్రుని పెంచే బాధ్యతను అప్పగించి వెళ్లిపోయింది. భూదేవు కుమారుడుగాన భౌమునిగా పిలిచారు. భూకుమారుడని అర్ధం. జనకునికి అంతకుముందే ఒక కుమారుడున్నాడు. అతనితోపోటే భౌముని పెంచి పెద్ద చేసాడు. కానీ దుర్మార్గుడిగా పెరిగాడు భౌముడు. అకృత్యాలు, దౌర్జన్యాలు చేయడం ప్రారంభించాడు. జనకుని కొడుకును కూడా హింసించేవాడు. ఆ బాధలుపడలేని జనకుని పుత్రుడు ఇల్లు వదిలి పోతానన్నాడు. జనకుడు దిగులుపడి విధిలేక భౌముడిని తీసుకుని వెళ్లమని భూదేవికి తెలిపాడు. ఆమె విష్ణువును ఫ్రార్ధించింది. విష్ణువు భారతదేశం ఈశాన్య ప్రాంతంలో అసమప్రాంతాన్ని ప్రత్యేక రాజ్యంగా ఏర్పరిచి భౌమునికి పట్ట్భాషేకం చేసాడు. అది మొదలు గర్వితుడై భౌముడు నరులను హింసపెట్టాడు. క్రూరత్వంతో పాలన సాగించాడు. అందువలన ‘నరకాసురుడ’ని పేరు పొందాడు. నరకుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని అంతులేని హింసలను చేయడం ప్రారంభించాడు. నరకుని అకృత్యాలకు అంతులేకుండా పోయింది.
ఇంతలో ద్వాపర యుగ ఫ్రవేశం అయింది. జనుల ప్రార్ధన మేరకు ధర్మసంస్థాపనకై సత్యభామను తీసుకుని వచ్చాడు. నరకుడు వరాలను పొంది స్వర్గంపై దాడి చేసాడు. ఇంద్రుని ఓడించి దేవతా మాత అదితి కర్ణ్భారణాలను బలవంతంగా లాక్కుని వెళ్లాడు. దేవతా స్ర్తిలను చెరపట్టాడు. మహిళలను చెరపట్టడం వేదించడం తెలిసిన సత్యభామ శ్రీకృష్ణునితోపాటు నరకుని సంహరానికి వెళ్ళింది. ముందుగా కృష్ణుని అనుమతి తీసుకుంది.
శ్రీకృష్ణుని దివ్యశక్తికి తోడు కాగా భయంకర యుద్ధంలో నరకాసురుని వధించి అదితి కర్ణ్భారణాలను వెనక్కు తెచ్చి ఇచ్చింది. దేవతాస్ర్తిల చె రను వదిలించింది. నాటినుంచి అశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. నరక పాలన అంతా చీకటి మయం కదా. సత్యభామ ఈరోజున దుష్టశక్తిపై మంచి సాధించిన విజయంగా భావించి ఏదైనా నూతనంగా కొత్తపనిని ఆరంభానికి తగిన రోజుగా నిర్ణయించారు.
నరకుడు శ్రీకృష్ణుని విష్ణురూపంగా తెలుసుకుని మరణం ముందు క్షమించమని ప్రార్ధిస్తాడు. తధాస్తు అని కృష్ణుడు దీవించాడు. నరకుడు కొత్త మార్గంలో పయనించే అవకాశం ఇమ్మని కోరగా కృష్ణుడు అనుమతించాడు. నారద పురాణంలో ఇలా వుంది.
నరకస్థాశ్చయే ప్రీతాఃతే
మార్గంతు వ్రతాత్సదా
పశ్యంత్యేవన సందేహః-కార్యో
అత్రముని పుంగవైః
చతుర్దశినాడు నరక సంహారం జరిగింది. గాన జనులందరు నరక పాలనలో చీకటి భయంతో జీవించారు. నరకుని మరణానంతరం శ్రీకృష్ణుని ఆజ్ఞతో ప్రజలు ప్రాతఃకాలంలో సుస్నాతులై నరకుని ఫ్రతిమను దగ్ధం చేసి, గృహాలను-ముంగిళ్లను శుభ్రంగావించుకుని ఆనందోత్సాహాలతో తైల దీపాలను వెలిగించి, బాణసంచా కాల్చి, ఆ రోజున లక్ష్మీ పూజలు, ఆరాధనలు చేసి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. దీపాలను తోరణాలుగా వరసలతో వెలిగించి సంబరాలు జరుపుకునే పర్వదినంగా ఆ అమావాస్యను దీపావళి అనీ, దీపావళి అమావాస్య అనీ ప్రసిద్ధి చెందినది. కాలచక్రంలో నాటినుండి దీపావళి పర్వదినాలలో ప్రశస్తి గాంచింది. జన హృదయాలు వెలుగునే కాంక్షిస్తాయి కదా! నరక చతుర్దశికి బలి చక్రవర్తి పరంగా జరుపుకునే ఆచారం వుంది. వామనావతారంలో విష్ణువు బలి చక్రవర్తిని మూడడుగుల దానం అడిగి పుచ్చుకుని, ఆయన గర్వమును అణచిన రోజు. పాతాళానికి పంపబడిన బలి చకవర్తి ఏడాదికి ఒకరోజు తిరిగి భూలోకానికి రావడానికి వీలుగా వరంకోరాడు. అలాగే అని వరం ప్రసాదించాడు వామనుడు. ఆ అమావాస్య రోజున బలి భూలోకం వచ్చి, దీపాలు వెలిగించి, చీకట్లను పారద్రోలినాడు. ఎంతవారైనా వినయంతో వుండాలనే సందేశాన్ని అందించాడు.
ఇంకనూ బలిచక్రవర్తి నేను దానమిచ్చిన భూమిని మూడు దినాలు మూడు పాదాలతో వామనుడివై ఛద్మ రూపంతో ఆక్రమించితివిగాన ఈ మూడు రోజులు నా రాజ్యమున దీపమొనర్చు వారి ఇంట నీ సతి లక్ష్మీదేవి శాశ్వతముగావుండుగాక. నా రాజ్యమున ఎవరి గృహంలో అంధకారం వుంటుందో జ్యేష్ఠాదేవితోపాటు వారికి కలకాలం చీకటి అగుగాక! చతుర్దశి నాడు నరకార్ధము దీప దానమొనర్చువారి పితృగణము నరకమునుండి స్వర్గమునకు పోవుగాక! అని మహావిష్ణువును కోరాడు. మహావిష్ణువు బలికి అభయం ఇచ్చాడు.
శ్లో: బలిరాజ్యం సమాసాద్య-యైర్న దీపావళిఃకృతి
తేషాం గృహే కధం దీపాః-ప్రజలిష్యంతి కేశవ
అని వామన పురాణ శ్లోకం.
ఇంక దీపావళి పర్వదినం అత్యుత్తమమైనది. ఈ రోజు లక్ష్మీ పూజ జరిపేరోజు. ఈ రోజు అమావాస్య అయినను ఎంతో విశిష్టమైన పర్వదినం. ఈ రోజున సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. తుల అనగా త్రాసు గాన అది ఎటూ మొగ్గక స్థిరంగా వుంటుంది. అంటే లాభనష్టాల ప్రస్తావన వుండని రోజు. ఈ రోజు ఎవరైనా, ఏదైనా నూతన వ్యాపారం ఆరంభిస్తే పలు రకాల లాభాలు సిద్ధిస్తాయని దృఢ విశ్వాసం.
భారతదేశంలో గుజరాత్-రాజస్థాన్-మహారాష్టల్రలో దీపావళితో కొత్త వ్యాపార సంవత్సరం ఆరంభమవుతుంది. ఉత్తర భారతంలో దీపావళినాడు మహలక్ష్మిని ప్రసన్నురాలిని చేసుకోవడానికి పూజలు చేస్తారు. నువ్వుల నూనెతో జనులందరు తలంటు స్నానం చేయాలి. దీపావళి రోజుల్లో లక్ష్మీదేవి తిల తైలంలో వుంటుంది గాన తిల తైలంతో తలస్నానం లక్ష్మీప్రదమని పురాణోక్తి.
శ్లో: కార్తిక కృష్ణ పక్షేతు
చతుర్దశ్యా మనోదయే
అవశ్య మేవ కర్తవ్యం
స్నానం నరక భీరుభిః
అని భవిష్యోత్తర పురాణం, జలపరంగా చతుర్దశి నాడు నీటిలో గంగాదేవి సమాహితమై ఉంటుంది.
ఇంక వంటకాల విషయంలో నువ్వులతో, మినుములతో చేసినవి తినాలి. అప్పాలు, కూరలు తినాలి. ఆరోగ్యం కాపాడుకునేందుకు దోహదం చేస్తాయి.
ఈ దీపావళిరోజు పితృదేవతల దినంగా పాటించడం ఆచారం. బ్రహ్మవచనం ప్రకారం
శ్లో: అమావాస్యా-చతుర్దశ్యోః ప్రదోషే దీప దానతః
యమ మార్గ్ధాకారే భ్యో-ముచ్చయతే కార్తీకే నరః
అనగా సాయంకాల ప్రదోషవేళ దేవాలయము- మఠములలో- ప్రాకారముల యందు-ఉద్యానవనములందు- మూడురోజులపాటు దీపమాలికలు పెట్టాలి. సూర్యుడు తులారాశి యందు ఉన్నప్పుడు కృష్ణపక్ష చతుదర్దశి- అమావాస్యల ప్రదోష సమయంలో ముందు కాగడాలు పట్టుకుని పితరులకు దారి చూపాలట. దీప దాన మొనర్చుట వలన మానవులు యమమార్గాది అధికారములనుండి ముక్తులౌతారని బ్రహ్మవచనం. భవిష్యోత్తర పురాణంలో దీపావళిని దీపాలికోత్సవం అంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ వధ గావించి సీతను అయోధ్యకు గొనివచ్చి విజయోత్సవంగా దీపావళిని జరిపారని తెలుస్తుంది. క్షీరసాగర మధన వేళ అగ్ని వచ్చి జీవకోటికి వెలుతురు శక్తి వచ్చిన రోజు గాన దీపావళిగా పురాణోక్తి. భూమిపై సంపద వృద్ధికి కారణం లక్ష్మీ జనించినది గాన లక్ష్మిని ధనలక్ష్మిగా భావించి దీపావళి రోజున పూజలు, ఆరాధనలు స్తోత్రాలు చేస్తారు. లక్ష్మీదేవి ఆరాధనలో అందరూ తరించాలి. ఇదే దివ్య దీపావళి. తమస్సును తరిమేసే జ్ఞానజ్యోతి.
నమస్తేస్తు మహామాయే
శ్రీపీఠే సుర పూజితే
శంఖ చఖ్ర గదా హస్తే
మహాలక్ష్మీ నమోస్తుతే.

‘‘కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిః
భవన్తి నిత్యాంశ్చ పచాహి విప్రాః’’
దీపారాధన చేసి కార్తికంలో దీపదానం చేయడం ఉత్తమమమైన క్రియ. తులసి చెట్టు దగ్గర, వాకిట్లో, దేవుని ముందు, దేవాలయంలో ఇలా దీపావళి పఠ్వదినాన ఎక్కడ దీపాల వరసలు పేర్చినా అధిక పుణ్యఫలం లభిస్తుంది.

‘‘అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ’’
అసత్యం నుండి సత్యం, చీకటి నుండి వెలుగును, అజ్ఞానము జ్ఞానమును మృత్యువునుండి అమృతమును నాకు కల్గించమని ప్రార్థిస్తాం. ఆ జ్ఞాన దీపమునే, ఈ విశ్వానికి మొదట యిచ్చింది- వేద శబ్దములు. కనుక ఆ వేద శబ్దావళియే ‘‘దీపావళి’’.

- పి.వి. సీతారామమూర్తి