మెయిన్ ఫీచర్

మానవత్వ సూచిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతలు, సంవాదాలు, ఆదేశాలు, సందేశాలు, ఉపదేశాలు ఇలా ఏవైనా లోకకల్యాణ కారకాలే.. భారతంలోని విష్ణుసహస్ర నామ పారాయణ, భగవద్గీత. రామాయణంలోని ఆదిత్య హృదయ స్తోత్రము, భాగవతంలోని నారాయణ కవచం, రుద్ర గీతాలు, హంస గీతాలు, ఉద్ధవ గీతాలు, విదుర- మైత్రి సంవాదం, కపిల- దేవహుతి సంవాదం- ఇట్లాంటివన్నీ మానవీయ విలువలు, నైతిక విలువలు, మానవ సంబంధాలు, సత్ప్రవర్తన, ధార్మికాచరణకు మార్గం చూపేవే.
ఋషుల చరిత్ర మహావిజ్ఞాన సంపద.వారు తపస్సులు ఆచరించి వారు చూసి అనుభవించి నేర్పిన పాఠాలన్నీ కూడా మానవాళికి ఉపయుక్తమైనవే. వారు లోకోపకారం కోసం ఎన్నో కఠిన సాధనలు చేశారు.
సప్తఋషులు ఒకరు గౌతమమహర్షి. ఈ మహర్షి వ్రాసిన ‘‘గౌతమ ధర్మ సూత్రములు’’ లోకంలో ప్రసిద్ధిచెందాయి. ఒకసారి గౌతముడు సుదీర్ఘంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మ ప్రత్యయం అయ్యాడు. ‘‘గౌతమా! ఎందుకు తపస్సు చేస్తున్నావ? ఏ వరాన్నైనా ఆపేక్షిస్తున్నావా?’’అని అడిగాడు.
గౌతముడు బ్రహ్మతో ‘‘నేను విత్తనం చల్లితే ఒక ఝాములో పంట పండాలి, వెంటనే దాని ఫలం ఇవ్వాలి’’అని కోరుకున్నాడు. బ్రహ్మ ‘తథాస్తు’అని దీవించాడు.
మహర్షులు ద్రష్టలు కనుక వచ్చే భవిష్యత్తుకాల భద్రతకు వారు ఆలోచిస్తారని ఈ సంఘటన మనకు తెలుపుతుంది. గౌతమునికి వరం లభ్యమైన తర్వాత కొద్దికాలానికి కరువువచ్చింది. పనె్నండు సంవత్సరాలు వానలు లేవు. ఆయన తపోబలంతో యజ్ఞంచేశాడు. గుప్పెడు ధాన్యం సృష్టించాడు. తన చుట్టూవున్న భూమిమీద చల్లేడు.అవి కొద్ది సమయంలోనే మొలకెత్తి పంటంతా చేతికొచ్చింది. అప్పటికప్పుడు ఆ ధాన్యం వండి వడ్డించారు. ఆహార సృష్టికి ఆద్యుడుగా గౌతమ మహర్షి లోకోపకారం చేశాడు. ఆరోజునుంచి భూలోకం స్వర్గమైంది. లోకానికి అన్నదానం చేసిన ఘనత గౌతమ మహర్షిదే.
కరువుకాలంలో గౌతముడు చేసిన భూలోకవాసులు మహోపకారం చేశాడు.
కొద్దికాలం క్రితం అజ్ఞానంతోను, అనుభవ రాహిత్యంతోను కులాలు మతాలు నెపంతో జనం సంఘర్షణకు లోనైనారు. ఆదిశంకరాచార్యులు సర్వమత సారాన్ని ఆకళింపుచేసుకున్నవారు. భగవం తుని పేరు చెప్పి కొట్లాడుకొనేవారినందరి హృదయ మాలిన్యాన్ని దూరం చేసి కొన్ని వందల గ్రంథాలు రచించి ఆధ్యాత్మిక, ధార్మిక, వేదాంత, భక్తిజ్ఞానాన్ని భారతీయులకు అందించి లోకోపకారం చేశారు.
ఆయన భౌతికంగా గతించి 1200 సంవత్సరములు అయినా ఇంకా సజీవుడు గానే, నిత్య నూతనచైతన్య స్వరూపుడుగా ఉన్నారంటే అది ఆయన చేసిన బోధామృతఫలితమే. ఆదిశంకరులు సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపమనే వారుఎందరో ఉన్నారు.
ఇలాంటివారందరి జీవిత చరిత్రలను నిత్యం తెలుసుకొంటూ ఉంటే మనమూ ధార్మిక సేవాదృక్పథం ఏర్పడుతుంది. గౌతమముని సదా స్మరిస్తూ ఉంటే మనకున్నంతలో సాటివారి ఆకలి తీర్చగలం. ఆదిశంకరులను మనసున స్మరిస్తూ ఉంటే మానవుల్లో కామక్రోధాదుల వల్ల కలిగే సహజమైన కోపాగ్నులను సులభంగా ఆర్పివేయవచ్చు. విద్వేషాలు మాని వివేకాన్ని కలిగించుకొని విశ్వజగత్తులో విలీనమైన భగవత్ స్వరూపాన్ని దర్శించుకునే నేర్పు కలుగుతుంది.

- చంద్రకళ