జాతీయ వార్తలు

ప్రమాణ స్వీకారంలో పేరు మరచిపోయిన మంత్రి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మోదీ మంత్రివర్గంలో 19 మంది కొత్తవారు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఓ మంత్రి గాభరాలో తన పేరును మరచిపోయారు. తన పేరు చెప్పకుండానే ఆయన ప్రమాణ పత్రం చదువుతుండగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గమనించి తప్పును సరిదిద్దారు. మహారాష్ట్ర నుంచి బిజెపి భాగస్వామి పక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి చెందిన రామ్‌దాస్ అథవాలే (56) ప్రమాణ స్వీకారం చేస్తున్నపుడు తడబడిపోయి తన పేరును చదవడం మరిచారు. వెంటనే రాష్టప్రతి ప్రణబ్ ఆ విషయాన్ని గమనించి ‘పేరు చెప్పండి’ అన్నారు. దీంతో తేరుకున్న రామ్‌దాస్ తన పేరు చెబుతూ మరోసారి ప్రమాణ పత్రం చదివారు. గతంలో పదేళ్లపాటు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన రామ్‌దాస్ 2015లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.