సాహితి

మనిషిగా పిలుచుకోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరచాలనాల కాలమా ఇది?
హస్త లాఘవాల కాలం కదా!
కాని, కేకుని చాకుతో కోసినంత తేలిగ్గా
కాలానికి ఎదురీదే వాళ్లు
ఉంటూనే ఉంటారు మన మధ్యే
అలాంటివాడే అతను
పేరేదైతేనేం
మనిషిగా పిల్చుకోవచ్చు
కారిడార్లోనో, క్యాంటీన్లోనో, సెక్షన్లోనో
నవ్వుల కరచాలనమై ఎదురొస్తాడు
చేతులు కలిపి మనలోకి అనురాగ ప్రసారం కావిస్తాడు
అతని కరచాలనం మరేం కాదు
మానవత్వానికి అంటుకట్టడం..!
భోజనాల వేళ మా పళ్లాలలో
ప్రేమని చపాతీలుగా పంచుతాడు
మిట్టమధ్యాహ్నం చంద్రోదయం!
ఆదరాన్ని ఆధరవులుగా పలికిస్తాడు
అవి దక్కనీ రుచుల ఖవ్వాలీలు!
పనివేళల అడక్కుండానే
బాధ్యతలు పంచుకుంటాడు
కృతజ్ఞత చూపితే
చిరునవ్వుని బోనస్‌గా మనకే ఇస్తాడు
సదా సాదాపాన్ వేసుకునే
ఆమ్‌ఆద్మీ అతను
అయితేనేం వేరే విశేషణాలెందుకు?
నిఖార్సైన మనిషి!

- ఎస్.హనుమంతరావు 8897815656