వరంగల్

నోరుందని మాట్లాడితే నాలుక కోస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మానుకోటలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కట్టిస్తా
* మండిపడ్డ మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్
మహబూబాబాద్, మార్చి 7: ‘నోరు ఉంది కదా అని.. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు.. అడ్డంగా మాట్లాడే వారి నాలుక కొస్తా’ అని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మానుకోటలోని అంబేద్కర్ భవన్ కూల్చివేత అంశంపై సోమవారం మానుకోట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. విమర్శలు చేసిన అఖిలపక్ష నాయకులపై ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. నీతికి, నిజాయితీకి, సేవా గుణానికి తాను కట్టబడి పనిచేస్తున్నానని, అలాంటి ననే్న వేలెత్తి చూపే వాడు ఉన్నాడా? అంటూ ప్రశ్నించారు. శిథిలావస్థలో ఉన్న గాంధీపార్కులోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌ను కూల్చివేసిన అంశాన్ని అసరా చేసుకుని అది తాను చేసిన తప్పిందంగా ప్రతిపక్షాలు చిత్రించాలని చూస్తున్నాయన్నారు.