జాతీయ వార్తలు

రిజర్వేషన్ల జోలికొస్తే తీవ్ర పరిణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రానికి మాయావతి హెచ్చరిక * అంబేద్కర్ ఆశయ సాధనకు చర్యల్లేవంటూ విమర్శలు

న్యూఢిల్లీ, నవంబర్ 30: రిజర్వేషన్ల విధానాన్ని మార్చటానికి ఏమాత్రం ప్రయత్నించినా తీవ్ర పరిణామాలు తప్పవని బీఎస్పీ అధినేత్రి మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల అమలులో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. అంబేద్కర్ 125వ జన్మదినోత్సవం సందర్భంగా రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆమె ప్రసంగించారు. దళితులు, బలహీన వర్గాలకు రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు కచ్చితంగా అమలు కాకపోవటంతో ఈ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆమె చెప్పారు. బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపడి వారు సుఖప్రదమైన జీవితం గడపాలని అంబేద్కర్ కలలు కన్నారని అన్నారు. ఈ ఆశయ సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, అదే తనకు సరైన జన్మదినోత్సవ కానుక అని అంబేద్కర్ చెప్పేవారని ఆమె గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వానికి ఇంతకాలంగా గుర్తుకురాని అంబేద్కర్, ఇప్పుడు అమాంతంగా జ్ఞప్తికి రావటం వెనుక రాజకీయం ప్రయోజనాలు తప్పించి వేరే కారణం లేదని ఆమె విమర్శించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్న మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల సాధనకు ఒక్క ప్రత్యేక చర్య కూడా తీసుకోలేదని ఆమె ఆరోపించారు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలను అదుపుచేయటానికి లేదా అత్యాచారం చేసిన వారిని దండించే బలమైన చట్టాన్నీ తీసుకురాలేదని ఆమె విమర్శించారు. దళితుల పిల్లలు సజీవ దహనం జరిగిన సంఘటనపై మంత్రి వి.కె.సింగ్ బాధ్యతా రహితమైన ప్రకటనలు చేసినప్పటికీ ఆయనను మందలించిన పాపాన పోలేదని ఆమె విమర్శించారు. సింగ్‌ను మంత్రివర్గం నుంచి తప్పించి దళితులపట్ల తన చిత్తశుద్ధిని ప్రధాని మోదీ రుజువు చేసుకోవాలని ఆమె సవాలు చేశారు. రిజర్వేషన్ల అమలు, దళితుల సంక్షేమం వ్యవహారంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల ఆలోచనలలో ఏమాత్రం తేడా లేదని ఆమె చెప్పారు. దేశంలో పెరిగిపోతున్న అసహనానికి భయపడి దేశం నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచనకు వచ్చినట్లు బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బిజెపి నేతలు చేసిన విమర్శలను ఆమె ఖండించారు. భారతదేశం హిందువులదేనని, ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని ప్రకటించిన అసోం గవర్నర్‌ను పదవి నుంచి తప్పించాలని మాయావతి డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కాంగ్రెస్ రాజకీయంగా వేధించిందని ఆమె చెప్పారు. రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించిన అంబేద్కర్ రాజ్యాంగ చట్టసభలో సభ్యునిగా ఎన్నిక కావటానికి నానాఅగచాట్లు పడాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. ఆయనను ఎన్నికతో సంబంధం లేకుండా సభ్యునిగా చేయాలన్న ఇంగితజ్ఞానం లోపించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు అంబేద్కర్ మావాడని చెప్పుకోవటం సిగ్గుచేటని మాయావతి విమర్శించారు.