మహబూబ్‌నగర్

కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకువస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో పూర్వవైభవం తీసుకువస్తామని అందుకు అహర్నిశలు కష్టపడుతానని మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ అన్నారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో ఉబెదుల్లా కొత్వాల్‌ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా నియమాకం అయిన కొత్వాల్‌ను పలువురు నేతలు సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రానుందని ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పెర్కోన్నారు. ఇక నాయకులు, కార్యకర్తలంతా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా తాము ఆశీంచిన స్థాయికన్నా అధిక గ్రామపంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారన్నారు. పెద్ద పెద్ద గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే పంచాయతీ సర్పంచులుగా గెలుపొందారన్నారు. దినిని జీర్ణించుకోలేని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సర్పంచులను భయబ్రాంతులకు గురిచేసి టీఆర్‌ఎస్‌లో కలుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారని ఆరోపించారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సర్పంచులను బలవంతంగా టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుని గులాబీ కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వారంతా టీఆర్‌ఎస్‌కు ఎలా గుణపాఠం చెప్పాలో అలా చెప్పితీరుతారని హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావడం తధ్యమన్నారు. చాలామంది తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి క్షేత్రస్థాయిలో సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి వెంకటేష్, మాజీ డీసీసీ అధ్యక్షుడు రంగారావు, ముత్యాల ప్రకాష్, ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, ప్రచార కార్యదర్శి బెనహర్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్, నాయకులు అనంతరెడ్డి, రవికిషన్‌రెడ్డి, నరసింహ్మరెడ్డి, అలీం, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేవిధంగా కృషి చేయాలి
- జిల్లా కలెక్టర్ కె.శశాంక
అయిజ, ఫిబ్రవరి 8: ప్రసవాలన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేవిధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక వైద్యసిబ్బందిని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రసవానికై వెళ్లిన గర్భిణీలను అవసరం ఉన్నా లేకున్నా సీజేరియన్ల ద్వారానే అధిక సంఖ్యలోనే ప్రసవాలు చేసినట్లు తెలుస్తుందని, దీనిని నివారించాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు అయ్యేవిధంగా వైద్యసిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం అయిజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్‌కుమార్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అయిజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు చేయించడంలో జిల్లాలోనే మొదటి స్థానం ఉందని, ఒక నెలలో 116 ప్రసవాలు చేయించి రాష్ట్రంలోనే మొదటిస్థానం నిలిచినందుకు అక్కడి వైద్యసిబ్బందిని కలెక్టర్ అభినందించారు. 2017లో 914 ప్రసవాలు జరుగగా 914 సాధారణ ప్రసవాలు జరిగాయని, కేవలం 8 మాత్రమే సీజేరియన్ జరిగాయన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 780 జరుగగా 95శాతానికి సాధారణ ప్రసవాలు చేయించారన్నారు. గర్భిణీ స్ర్తిలందరికి కేసీఆర్ కిట్టు పోర్టర్లలో రిజిస్ట్రేషన్ చేయాలని, మొదటి త్రైమాసికంలో రిజిస్ట్రేషన్లు చేయించాలన్నారు. రిజిస్ట్రేషన్ జరిగితే గర్భిణీకి మొదటి నుంచి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ మెరుగైన వైద్యం అందించడం వల్ల సుఖప్రసవాలు జరగడానికి బాటలుపడుతాయన్నారు. దేశంలోనే వివిధ కారణాల వల్ల 35 నుంచి 40శాతం గర్భిణీలు రక్తహీనతతో ఉంటారని వారందరికి ఐరన్ మాత్రలు ఇచ్చి వైద్యం అందిస్తూ సాధారణ స్థితికి తీసుకురావాలన్నారు. 102 సేవలను విధిగా వినియోగించుకోవాలని, డ్రైవర్‌కు గాని, క్లీనర్‌కు గాని ఫోన్ చేయడం కాదని నేరుగా 102కే ఫోన్ చేయాలన్నారు. ప్రతిగర్భిణీకి మాతాశిశు సంరక్షణ కార్డులు ఇవ్వాలని, అవిలేకపోతే ఎఎన్‌ఎం, ఆశా వర్కర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆశా, ఎఎన్‌ఎం, అంగన్‌వాడి టీచర్లు సమన్వయం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తక్కువగా రిజిస్ట్రేషన్ చేయించిన మేడికొండ, టిటిదొడ్డి ఎఎన్‌ఎంలకు శ్రీముఖాలు ఇచ్చి వివరణ రాసి పంపాల్సిందిగా డీఎంహెచ్‌వో సూచించారు. అత్యధికంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఉత్తనూరు, సింధనూరు, పర్ధిపూర్ ఎఎన్‌ఎంలను కలెక్టర్ అభినందించారు. దాదాపు 93వేల మందికి ఈ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలన్నారు. 30 పడకల ఆసుపత్రికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, స్ట్ఫాకు బాత్రూంలు, విశ్రాంతి గదులు కల్పించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామి ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజేందర్‌కుమార్, మెడికల్ ఆఫీసర్ రామలింగాచారి, డాక్టర్ స్వరూపారాణి, ఎఎన్‌ఎంలు, స్ట్ఫా నర్సులు, ఆశావర్కర్లు తదితరులు ఉన్నారు.

* ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
లింగాల, ఫిబ్రవరి 8: గ్రామాల అభివృద్దికి ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలను రూపొందించి సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యమైన గ్రామీణ వికాసం సిద్దిస్తుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం ఎంపీపీ మంజుల అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఇటీవల ఎన్నికైన 23గ్రామాల సర్పంచ్‌లు తొలిసారిగా మండల సభకు హాజరుకావడంతో, ఆత్మీయ సమ్మేళనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ గ్రామాల అభివృద్దిలో సర్పంచ్‌ల పాత్ర ఎంతో కీలకమన్నారు. గ్రామాల అభివృద్దికి ప్రజల సహకారంతో రూపొందించిన ప్రణాళికల అమలుకు అవసరమైన నిధులు ప్రభుత్వం సకాలంలో సమకూరుస్తుందని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. సర్పంచ్‌లంతా ప్రజా సమస్యల పరిష్కారం, వౌళిక సదుపాయాల కల్పన, పారిశుద్ద్యం, పచ్చదనం, స్మశాన వాటిక నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ది చెందితేనే రాష్ట్రం తద్వారా దేశం పురోభివృద్ది చెందతుందన్నారు. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం స్థాపన ధ్యేయంగా ప్రభుత్వం పని చెస్తూ పటిష్టమైన నూతన పంచాయితీ చట్టాన్ని తీసుకొని వచ్చిందన్నారు. గ్రామపంచాయితీల బలొపేతానికి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నిరుపేదలకు అందేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మాకం పార్వతమ్మ, వైస్ ఎంపీపీ కిషన్‌నాయక్, సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, ఎంపీడీవో ఫయాజ్ పాషా, తహశీల్దార్ ముజఫర్ ఉస్సేన్‌లతోపాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు మాకం తిరుపతయ్య, కేటీ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌బి బ్రిడ్జికి ఎమ్మెల్యే శంకుస్థాపన
కేటీదొడ్డి, ఫిబ్రవరి 8: మండల పరిధిలోని నందినె్న గ్రామం వద్ద రూ.7.95 కోట్ల నిధులతో ఆర్‌అండ్‌బి బ్రిడ్జి నిర్మాణంకు శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి జరిగితేనే రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వం గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. పార్టీలకు అతీతంగా నూతనంగా ఎంపికైన సర్పంచులకు గ్రామాల అభివృద్ధి కోసం అన్నివిధాల సహకరిస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి అధికారులు, సర్పంచు భీమరాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సినిమా థియేటర్లలో పార్కింగ్ వసూళ్లు చేయోద్దు
* తినుబండరాలను ఎంఆర్‌పి ధరకే అందజేయాలి
* అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 8: సినిమా థియేటర్లలో పార్కింగ్ చార్జిలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని పలు థియేటర్లలో పార్కింగ్ చార్జిలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో మున్సిపల్ కమీషనర్ సురేందర్‌తో కలిసి స్వయంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కింగ్ వసూళ్లు చేసినట్లు ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని అందులో భాగంగా గత మూడురోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ముఖ్యంగా తినుబండరాలు ఎంఆర్‌పి రేట్‌కి ఇవ్వాలని అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 2018 ఏప్రిల్ 1 నుండి పార్కింగ్ వసూల్ చేయోద్దని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని థియేటర్ల యజమాన్యాలు గుర్తించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గిర్దావరి క్రాంతికుమార్‌గౌడ్, ఏసిపి విద్యాసాగర్, పిపిఓ ప్రతాప్‌లు పాల్గొన్నారు.

రోఢ్డు నియమాలతోనే ప్రమాదాలు దూరం
* జిల్లా అసిస్టేట్ మోటార్ అండ్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్‌కుమార్

చిన్నచింతకుంట, ఫిబ్రవరి 8: జిల్లాలో వాహనదారులు రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలు దరిచేరవని జిల్లా అసిస్టెంట్ మోటార్ అండ్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్‌కుమార్ అన్నారు. 30వ రోడ్డ్భుద్రత వారోత్సవాలలో భాగంగాశుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ధవఖానా ఆవరణలో వివిధ వాహన చోదకులకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పింస్తూ వాహనదారులు ట్రాపిక్ నిభందనలను పాటించడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చని అయన తెలిపారు.ద్విచక్రవాహనాదారులు హెల్మట్, సీట్‌బెల్ట్‌ను ధరించాలి, వేగాన్ని అదుపులో వుంచుకోవాలని అయన తెలిపారు.జిల్లాలో ఇ-చలాన్ వ్యవస్థ అమల్లోకివచ్చిందని, ప్రతి వాహనదారుడు త్రిబుల్‌రైడింగ్,రాంగ్‌పార్కింగ్,ర్యాష్ డ్రెవింగ్‌లు చేయరాదని అలా చేస్తే ప్రమాదాలను బారిన పడుతారని అయన తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ,డాక్యూమెంట్లు లేకుండా వాహనాలను నడిపే వారికి ఇ-చలాన్ ద్వారా జరిమానాలు వెయడం జరుగుతుందని అయన తెలిపారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తమ ఆటోలల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నట్లయైతే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని అయన హెచ్చరించారు.రోడ్డు భధ్రత నియమాలపై ప్రతి ఓక్కరు అవగాహన కల్గివుండాలని అయన సూచించారు. అంతకు ముందు మండలకేంద్రంలోని పురవీదుల గుండా రోడ్డ్భుధ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచు లక్ష్మణ్, హెడ్‌కానిస్టేబుల్ కతలప్ప,పోలీస్ సిబ్బంది కృష్ణయ్య,రాజేందర్,గిరయ్య తదితరులు పాల్గొన్నారు.

శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల కృషి అమోఘం
* ముందస్తు ప్రణాళికతో శాంతియుతంగా ఎన్నికలు
* మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 8: శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల కృషి ఎంతో అమోఘమని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల విధుల పట్ల ఎంతగానో అభినందించారని ఇటువంటి చురుకైన సిబ్బందికి నాయకత్వం వహించే అవకాశం తనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరి కృషి సిబ్బంది సమన్వయం అల్లరిముకల అదుపులో ప్రత్యేకతలను, లోటుపాట్లను ప్రత్యేకంగా చర్చించడం జరిగిందన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బందికి నగదు రివార్డులను అందజేశారు. ముఖ్యంగా కొందరు మహిళా సిబ్బంది కేసు పరిశోధన, ఎన్నికల బందోబస్తు, స్టేషన్ పనితీరులో చూపిన శ్రద్ద పట్ల ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఇటివల జరిగిన ఒక హత్యాయత్నం కేసులో మహిళా కానిస్టేబుల్ దేవి ధన్వాడ పిఎస్‌లో పనిచేస్తుందని వారం రోజుల పాటు నింధితుల వేటలో పాల్గొనడం ఎంతో విశేషమైందని వివరించారు. ఎన్నికల విధుల్లోను, స్థానిక సంస్థల పరిష్కారాల్లోను, కంప్యూటరికరణలోను తమదైన ప్రతిభ కనబర్చిన మహిళా పోలీసులు వరలక్ష్మీ, పద్మ, సాయినిర్మల, షీటీం సిబ్బందిని నగదు రివార్డులతో సత్కరిస్తూ మహిళా శాంతిని చాటేందుకు కష్టతరమైన విధులు నిర్వహించేందుకు ఏ మాత్రం వెనుకంజ వేయరాదని స్పూర్తిని ఇచ్చారు. ఖాకీ దుస్తులు దరించిన రోజునే మనమంత కఠినమైన విధులకు సంసిద్దంగా ఉండాలని ఆమె సిబ్బందికి పిలుపునిచ్చారు. కానున్న ఆరునెలల కాలం అప్రమత్తంగా ఉంటూ సవాళ్ల స్వీకరణకు సిద్దంగా ఉండాలని వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీలు భాస్కర్, గిరిబాబు, శ్రీ్ధర్, నరసింహులు, సిఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.