మహబూబ్‌నగర్

తెరాస నేతల్లో టెన్షన్..టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 15: శాసభసభ ఎన్నికలు ముగిసి మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో రావడం, దాంతో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు దాటినప్పటికి మంత్రి వర్గ విస్తరణ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ఆశావాహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఎట్టకేలకు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌తో కలిసి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుకోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసలు మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ జోరందుకుంది. అందులో భాగంగా తెరాస నేతల్లో టెన్షన్ నెలకొంది. అసలు కేసీఆర్ మనస్సులో ఎవరి పేరుందనే విషయం ఇంకా వెల్లడికాకపోవడంతో పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు కావాలని ఆశతో ఉన్నారు. అందులో ప్రధానంగా జడ్చర్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మళ్లీ మంత్రి పదవి చాన్స్ తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్న ఆయన గత మంత్రి వర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగి అందులో పలు మార్పులు తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శబాష్ అనిపించుకున్నారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా జిల్లాలో అందరిని కలుపుకుని అభివృద్ధి చేసిన ఘనత కూడా లక్ష్మారెడ్డి ఉంది. ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కేసీఆర్ వెంట ఉంటూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. అందుకే ఆయనకు తొలి సారిగా 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆయనకు మంత్రిగా కేసీఆర్ తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఇకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన నిరంజన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కొచ్చనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని తెరాస వర్గాలు బహిరంగంగానే చెబుతున్నారు. నిరంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి చేదోడువాదోడుగా ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ కార్యక్రమం చేసిన నిరంజన్‌రెడ్డితో కేసీఆర్ చర్చించాకే జిల్లా పర్యటన ఉండేది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయబోయే మంత్రి వర్గంలో నిరంజన్‌రెడ్డికి మంత్రి పదవి దుక్కుతుందోలేదో కానీ వనపర్తి నియోజకవర్గంలో మాత్రం తమ నేతకు కేసీఆర్ ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని చెబుతున్నారు. ఇకపోతే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సైతం మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఈయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటరీ కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పదవి పోయింది. కానీ ఈ ధఫా మాత్రం శ్రీనివాస్‌గౌడ్ మాత్రం తప్పకుండా మంత్రి పదవి వస్తుందని తెరాస వర్గాలు, ఆయన అనుచర గణం భావిస్తున్నారు. అయితే శ్రీనివాస్‌గౌడ్ కూడా మంత్రి పదవి కోసం తనవంతు ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసగంలో శ్రీనివాస్‌గౌడ్‌ను ఈ ధపా గెలిపిస్తే మంచి ఉన్నత స్థాయిలో ఉంచుతానని వెల్లడించారు. దాంతో అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీనివాస్‌గౌడ్‌కు ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ ఉన్న అందులో తప్పకుండా కేసీఆర్ చోటు కల్పిస్తారని అందరు భావిస్తున్నారు. కాగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారో కేసీఆర్ మనస్సులో ఎవరికి చోటు ఉందో మంత్రి వర్గ విస్తరణ జరిగితే తెలుస్తుంది. అయితే ఈ నెల 18 సాయంత్రం గానీ, 19వ తేదీ ఉదయం గానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఫోన్లు చేస్తారని తెలుస్తోంది. కేసీఆర్ ఫోన్ ఎవరికి చేస్తారోననే ఉత్కంఠ, టెన్షన్ మాత్రం తెరాస వర్గాల్లో నెలకొంది.

పాలమూరు ఎత్తిపోతల పనులు పూర్తి అయితే
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి సెంటుకీ సాగునీరు

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 15: పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి సెంటు భూమికి కృష్ణాజలాల ద్వారా సాగునీరు అందించడం జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జడ్పీ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. అందులో భాగంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు చైర్మన్, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు సమాధానం చెప్పారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతులు బాగుపడాలంటే అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావల్సిందేనని అన్నారు. ఇప్పటికే గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు దాదాపుగా పూర్తి కావచ్చాయని తెలిపారు. గత రెండు మూడేళ్ల నుండి దాదాపు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే కాలంలో జిల్లాలోని ప్రతి సెంటు సాగు భూమికి సాగునీరు అందాలంటే ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావల్సిన అవసరం ఉందని అందుకుగాను అందరూ సహకరించాలని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే జిల్లాలో మొత్తం మీద 20 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ రైతుబంధు పథకం జిల్లాలో పారదర్శకంగా జరిగిందని అయితే జిల్లాలో దాదాపు 25వేల మందికి సంబందించిన కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించామని తెలిపారు. కొందరు రైతులు తమ ఆధార్‌కార్డు ఇవ్వనందున ఆన్‌లైన్‌లో నమోదు కాలేకపోయిందని తెలిపారు. మార్చి చివరి వరకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతుందని తెలిపారు. భూ సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. మిషన్ భగరీథ పనులను సైతం మార్చి చివరి వరుక అన్ని గ్రామాల్లో పనులు పూర్తి చేసి ప్రతి (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)
ఆవాసానికి మంచినీరు ఇవ్వడం జరుగుతుందన్నారు.
సమావేశంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ ఆర్డీఎస్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా పొలాలకు నీరు రాక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు నీటిని ఆర్డీఎస్ ఆయకట్టుకు తీసుకురావడానికి ఫ్యాకేజీ-99 పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం తరహాలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రైతు సమ్మాన్ పథకంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసర ఉందని అన్నారు. ఇటు రాష్ట్రం, ఆటు కేంద్రం అందిస్తున్న పథకాలు రైతుల కోసం కాబట్టి ఇందులో రాజకీయాలు లేవని రైతులకు కేంద్రం ప్రకటించిన పథకంపై అవగాహన కల్పిస్తూ మర్గదర్శకాలను సైతం తెలపాలని ఆయన తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుండి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని కోరారు. సాగునీరు ఇవ్వకుంటే సాగుచేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆయన సభ దృష్టికి తెచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి దాదాపు రెండు టీఎంసీల నీటిని గుడిపల్లిగట్టు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జడ్పీ సీఇఓ వసంతకుమారి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వనపర్తి ఆర్డీఓ పద్మరాణి, వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆమర జవాన్లకు ఘన నివాళి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 15: కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ఆమరులైన జవాన్లకు జనం నివాళ్లు అర్పించారు. కాశ్మీర్‌లో జరిగిన ఘటనపై ఉమ్మడి పాలమూరు జిల్లా భగ్గుమంది. గ్రామగ్రామాన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన జవాన్లకు నివాళులు అర్పించి వౌనం పాటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, దేవరకద్ర,వనపర్తి, జడ్చర్ల, మహబూబ్‌నగర్ పట్టణాల్లో వేలాది మంది విద్యార్థులు, యువకులు రోడ్లపైకి వచ్చి జవాన్లు ఆమర్హ్రే అంటూ వారి త్యాగాలు వృథాకావంటూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను తగులబెట్టడమే కాకుండా పాకిస్తాన్ జెండాలను కూడా తగులబెట్టి నిరసనను వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బిజెవైఎం, భజరంగ్‌దళ్, విశ్వహిందూపరిషత్, ఏబీవీపీల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి వేలాది మంది యువకులు పాల్గొని ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి పాకిస్తాన్ జెండాలను తగులబెట్టారు.
తెలంగాణ చౌరస్తాలో బైటాయించి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 44వ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వివిధ గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా రాస్తారోకోలు చేసి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సాయంత్రం గ్రామగ్రామాన ఆమరజవాన్లకు నివాళ్లు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వివిధ పోలీస్‌స్టేషన్లలలో పోలీసు సిబ్బంది కూడా ఆమరజవాన్లను స్మరిస్తూ వౌనం పాటించారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఉద్యోగులు ఆమరులైన జవాన్లను స్మరిస్తూ వౌనం పాటించి నివాళ్లు అర్పించారు.
జడ్పీ సర్వసభ్య సమావేశంలో కూడా ఆమరజవాన్లకు నివాళ్లు అర్పించిన సభ్యులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జర్నలిస్టులు సైతం జిల్లా కేంద్రంలో ఆమరజవాన్లకు నివాళ్లు అర్పించారు.