వరంగల్

మేడారం జాతర పనులు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*నాణ్యత ప్రమాణాలు కొరవడితే చర్యలు తప్పవు *జనవరి 31కల్లా పనులు పూర్తి
వరంగల్, డిసెంబర్ 11: మేడారం జాతరను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసి శాఖల వారీగా ఇప్పటికే చేపట్టిన పనులు, చేపడుతున్న పనుల వివరాలతో పాటు సంపూర్ణ, సమగ్ర సమాచారంతో మ్యాపింగ్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు మేడారంలో పూర్తి స్థాయిలో సమాచారం ఉండే విధంగా దిశలు, దిక్సూచీలు ఏర్పాటు చేయాలన్నారు. మేడారం జాతర సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2016 ఫిబ్రవరిలో జరుగు మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర సమీపిస్తున్నందున జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్ధం మంజూరు చేసిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయుటకు కావలసిన సామాగ్రి, మ్యాన్ పవర్‌ను రేయింబవళ్లు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దాదాపు 90 శాతం పనులు గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు. గ్రౌండింగ్ చేసిన పనులన్ని జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల వారీగా ఒక్కొక్క పనిపై ఆరు సార్లు ఇతర శాఖల క్వాలిటీ కంట్రోల్ అధికారులతో నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన పిమ్మట చెల్లింపులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ప్రతి పని వంద శాతం నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా కిందిస్థాయి అధికారులు ప్రతి రోజు పనులను పర్యవేక్షిస్తున్నారన్నారు. నూతనంగా మంజూరైన పనులు గత జాతరలో చేసిన పనుల ప్రత్యేక మరమ్మతులు, ప్రధాన రహదారులు, సిసి రోడ్లు, అంతర్గత రోడ్లకు సంబంధించి ప్యాచ్‌వర్క్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రత్యేకంగా కాజ్‌వే, కల్వర్ట్సు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించాలని ఆదేశించారు. గతంలో నిర్మించిన స్నానఘట్టాల మరమ్మతులను అవసరం మేర పూర్తి చేయాలని సూచించారు. నీటి పారుదల శాఖ ద్వారా భక్తులకు రక్షిత మంచినీటి సరఫరా చేయడానికి గతంలో ఉన్న 10 మంచినీటి సోర్స్‌లతో పాటు, నాలుగు సోర్సులు అధనంగా మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా వంద శాశ్వత మరుగుదొడ్లు, 4వేల ఆర్‌సి షీట్ల మరుగుదొడ్లు, 12వేలు తాత్కాళిక మరుగుదొడ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. పస్రా, తాడ్వాయి, మేడారం పరిసరాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి పాయింట్లు గుర్తించి పనులను వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారీగా సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు స్థానికంగా నివాసం ఉండి పనులను చేపట్టే విధంగా సంబంధిత శాఖల అధికారులు రోజువారీగా పర్యవేక్షిస్తుండాలన్నారు. ప్రధానంగా దేవాదాయ శాఖ, రోడ్లు భవనాలు, గ్రామీణ మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, నీటిపారుదల, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న పనులే కాకుండా జాతర ప్రారంభానికి ముందుగా జాతర సందర్భంగా చేపట్టే, కల్పించే సౌకర్యాలకు సంబంధించి ఆయా శాఖలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఐటిడిఏ పిఓ అమొయ్‌కుమార్, ఆర్ అండ్ బి ఎస్‌ఇ నర్సింహ, ఇరిగేషన్ ఎస్‌ఇ పద్మారావు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ సత్తయ్య, డిఎం అండ్ హెచ్‌ఓ సాంబశివరావు, ఎండోమెంట్ డిసి రమేష్, డిఎఫ్‌ఓ వెంకటేశ్వర్లు, ములుగు ఆర్డిఓ మహేందర్‌జీ తదితరులు పాల్గొన్నారు.