మీ వ్యూస్

భాగవతోత్తముడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ జగత్తులో పోతన చిత్రం ఓ అద్భుత కళాఖండం. నటీ నటులందరూ ఉద్దండ పిండాలే. సంగీత సాహిత్యాలు, సంభాషణలు ఏమా త్రం పక్కదారి పట్టకుండా నిండు కుండలా అన్నీ సమపాళ్లలో కుదిరాయి. ముఖ్యంగా పోతనగా నాగయ్య నటన, సంభాషణలు పలికిన తీరు, వదనంలో అత్యంత ప్రశాంతత, ఆటుపోట్లు వచ్చినా చెరగని చిరునవ్వు, రామభద్రుని మీద అచంచల విశ్వాసం వీటన్నిటిని ఏకకాలంలో వ్యక్తీకరించడం ఆ మహానటునికే చెల్లు. అంతటి గొప్ప నటుని స్థాయికి ఎదగగలనా? అని అక్కినేని అంతటి మహానటుడే అంటుండేవారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే అనేకమంది సంగీత దర్శకులుండగా, నిర్మాత కె.వి.రెడ్డి ఈ బాధ్యతను నాగయ్యకే అప్పగించడం ఆశ్చర్యం కలిగించినా సరైన నిర్ణయమనిపించింది. ఈ చిత్రాన్ని చూసిన ముమ్మిడివరం మనిషి బాలయోగిగా మారడం ఈ సినిమా ఎంత ప్రభావాన్ని కలిగించిందో తెలుస్తుంది. పోతన కూతురుగా నటించిన బాలనటి పేరు కూడా తెలిపివుంటే బాగుండేది. శ్రీనాథుడి పాత్రలో జంధ్యాల గౌరీనాధ శాస్ర్తీ చాలా హుందాగా ప్రదర్శిస్తూ పాత్రను సమర్ధవంతంగా పండించారు. పోతన చిత్రాన్ని మరలా గుమ్మడితో తీసినా విజయం సాధించలేకపోయింది.

-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్