మీ వ్యూస్

వివాదాస్పదం అవుతూనే వున్నాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలిం అవార్డులే కాదు సాహిత్య, సామాజిక అవార్డులు కూడా వివాదాస్పదం అవుతూనే వున్నాయి. నాగయ్య అష్టకష్టాలు పడి అప్పులపాలై నిర్మించి దర్శకత్వం వహించిన భక్తరామదాసుకి ఒక్క నందీ రాలేదు. రామదాసుకి రాగిచెంబు అయినా ఇచ్చారు కాదని అప్పట్లో విమర్శలొచ్చాయి. జాతీయ అవార్డుకు ఎంపికలో అల్లూరి సీతారామరాజు చిత్రానికి కంటితుడపు చర్యగా పాటకు అవార్డు ప్రకటించారుగాని ఉత్తమ చిత్రం, నటుడు, దర్శకుడులాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు రాకపోవడంతో విమర్శలు చెలరేగగా అవార్డు కమిటీలోని ఆంధ్రుడు ఆ చిత్రంలోని లోపాలు ఎత్తిచూపించాడు. రుద్రమదేవి విషయంలో అలా జరిగినా బాగుండేది.
-పి.శాండిల్య, కాకినాడ