మీ వ్యూస్

ఇదేం లాజిక్కో మరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి 28 ఏళ్లు రాగానే పరిపక్వత, పరిపూర్ణత వస్తాయని తన తండ్రి చెప్పాడని దర్శకుడు వర్మ అన్నాడు. ఆ పరిపక్వతతోనే తన 28వ ఏట ‘శివ’ చిత్రం తీసి హిట్ కొట్టానని చెప్పాడు. ఇప్పుడు మరో 28 ఏళ్లు గడిచాయి కాబట్టి డబుల్ పరిపూర్ణతతో శివ-2 తీసి డబుల్ హిట్ కొడతానని వర్మ విశ్వాసం అట. ఇదేం లాజిక్కో మరి! 28 ఏళ్లు దాటాక మరింత పరిపక్వతతో చిత్రాలు తీసి ఉండాలి! కాని రెండు మూడు చిత్రాలు తప్ప అన్నీ ఢాం అన్నాయి. మరి ఇప్పుడు డబుల్ పరిపక్వతతో తీయబోయే చిత్రం డబుల్ ఢాం అంటుందేమో! వెయిట్ అండ్ సీ!
-అభిలాష, సాంబూర్తినగర్, తూ.గో.జిల్లా