మీ వ్యూస్

సాదా సీదా సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువతకు చక్కని సందేశం ఇచ్చే కథను ఎంచుకున్న బివిఎస్ రవి, ఎటువంటి పాత్రనైనా అవలీలగా పండించే సాయిధరమ్ తేజ్ లాంటి హీరో, కళ్ళల్లో సాఫ్ట్‌నెస్, క్రూరత్వం రెంటినీ క్షణాల్లో మార్చి చూపించగల ప్రసన్న లాంటి విలన్‌తో జత కట్టినా బలహీనమైన కథనం కారణంగా జవాన్‌ను ఒక సాదా సీదా సినిమాగా మిగల్చడం స్వయంకృతాపరాధమే! కుటుంబం కంటే దేశమే శ్రేష్టం అన్న కానె్సప్ట్‌ను బలంగా పండించినా, అందుకు అనుగుణంగా హత్తుకునే డైలాగులు గాని సన్నివేశాలు కాని లేకపోవడం పెద్ద లోపం. కీలక సన్నివేశాల వద్ద చూపిన అలసత్వం కారణంగా బ్లాక్‌బస్టర్ స్థాయి నుండి సగటు స్థాయి వద్ద ఆగిపోయింది. క్లైమాక్స్ కూడా రసవత్తరంగా లేదు. గుహన్ ఫొటోగ్రఫీ, తమన్ సంగీతం సినిమాకు బలమైన ఆకర్షణలు కాగా, హద్దులు దాటి అంగాంగ ప్రదర్శన హీరోయిన్ మెహ్రీన్ చేయడం జుగుప్స కలిగించింది.
-ఎం.కనకదుర్గ, తెనాలి
చాలా విషయాలు తెలియజేశారు
వెనె్నల 12 డిసెంబర్ సంచికలో ఫ్లాక్‌బ్యాక్ లో ప్రచురించిన ‘రహస్యం’ చిత్రం గురించి మాణిక్యేశ్వరి చాలా విషయాలు తెలియజేశారు. ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ‘రహస్యం’ చిత్రానికి పనిచేశారు. ఆ రోజుల్లో ఈ చిత్రం బాగా ప్రదర్శింపబడింది. బావుందని చెప్పుకొనేవారు. ‘రహస్యం’లో పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు బాగా పేరు వచ్చింది. బి.సరోజాదేవి, కృష్ణకుమారి, ఘంటసాలవారికి చిరస్థాయిగా గుర్తింపునిచ్చింది.
-పట్నాల సూర్యనారాయణ, రాజమండ్రి
ట్రిక్ ఉపయోగిస్తే..?
రుద్రమదేవికి ఒక్క నంది రాకపోవడంతో ఎంపికలో అవకతవకలు జరిగాయని, వాటిని పునఃపరిశీలించాలని రఘువీరారెడ్డి, రుద్రమకు నంది ఇవ్వాల్సిందేనని నారాయణమూర్తి సలహా ఇచ్చారు. దశాబ్దాల క్రితం దాసరి నారాయణరావు తాను తీసిన చారిత్రక చిత్రానికి ఒక్క అవార్డు ఇవ్వలేదని అవార్డు కమిటీని దుయ్యబట్టారు. అంతే, ఒక కొత్త సంస్థ పుట్టుకొచ్చింది. అన్ని ముఖ్యమైన అవార్డులూ దాసరి చిత్రాలకే ప్రకటించి ఆ తరువాత మాయమైంది. గుణశేఖర్ కూడా ఇలాంటి ట్రిక్ ఉపయోగిస్తే బాగుంటుంది.
-ఆర్.శాంతిచంద్రిక, సామార్లకోట
పేలవం అంటే ఇదే!
హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సినీ టెలివిజన్ దర్శకుల శిక్షణా శిబిరంలో నవంబర్ 5న కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ పాల్గొని ఏదైన కథ నుంచి స్ఫూర్తి పొందడానికి, కాపీ కొట్టడానికి తేడా వుందని చెప్పారని పత్రికల్లో వచ్చింది. పసివాడిప్రాణం నుంచి లభించిన స్ఫూర్తితో హిందీలో భజరంగీ భాయిజాన్ చేశానని చెప్పాడు. ఇది నిజం. దీనే్న అనుసరించడం అంటారు. అనుకరణ పేలవంగా వుంటుంది. పేలవం అనడమూ దండగే. ఇప్పుడు తెలుగు దర్శకులు వెనుతిరిగి చూసుకోవాలి. సమీక్షించుకోవాలి. ఇతర భాషలలో సినిమా విజయవంతం కావడం పాపం, అనుకరణ సినిమాలు డజను వస్తాయి తెలుగులో! అనుసరణ మంచిదే. మంచి ప్రమాణమై వుండాలి అన్నట్లు విజయేంద్ర ప్రసాద్ చిత్రం రాజవౌళి బాహుబలి-2లో ఇలాగే వరుసగా యువతులను తడుముతూ ప్రవేశింపజేయడం అనుసరణగా అనిపించలేదు. రాజన్నలో కూడా ఇలాంటి సన్నివేశాలే ఉన్నాయి. కాగా ఆ ఆలోచనే పేలవం. అదే పేలలేదు. పేలవం అంటే ఇదే!
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు,
హైదరాబాద్
తిరిగి పుష్పించింది
మాణిక్యేశ్వరిగారు తిరిగి పాత సినిమా సమీక్షలు మొదలుపెట్టడం పాఠకులకు ఆనందదాయకంగా ఉన్నది. ఒక్క సినిమాను మాత్రమే సమీక్షించక, ఆ సినిమాకు సంబంధించిన పూర్వాపరాలను కూడా తెలియపరుస్తున్నారు. పూర్వం ఒక్క సినిమా నటీనటులనే గుర్తుపెట్టుకునేవారు. ఈ సమీక్షలవల్ల సాంకేతిక వర్గం, వారి ప్రతిభలను కూడా చక్కగా వ్యక్తీకరించడంవల్ల ఇంకా చాలా సంగతులు తెలుస్తున్నాయి. పూలరంగడు సినిమా గురించి వ్యాసం చాలా బాగుంది. ఎందువల్లనో ఈ చిత్రం విడుదల సంవత్సరాన్ని రాయలేదు. ఎఎన్నార్, జమునలు సినిమాకెళ్లి నేల టిక్కెట్టు కొనుక్కొని ఆడవాళ్ళ, మగవా ళ్ళ వరుసలో తడిక ప్రక్కన కూర్చుని చూసే సన్నివేశం, వీరే తెరమీద మంచి దుస్తుల్లో ‘నీ జిలుగు పైట’ పాటకు పాడే యుగళగీతం అద్భుత చిత్రీకరణ.
-ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
ఆలోచింపజేసింది...
‘రుద్రమదేవి ఎవరు?’ వ్యాసం ఆలోచింపజేసింది. సామాన్య ప్రజలు కుల, ప్రాంతీయ భావనలు లేకుండా గొప్పవారందర్నీ సమాదరిస్తారు. ప్రాంతీయ రచ్చ నేతల పుణ్యమే. ఉద్యమ సమయంలో ఈ రచ్చ విజృంభించింది. మేధావి వర్గం అయిన రచయితలు, జర్నలిస్టులు ప్రభావితులై ఆంధ్రుల రచనలు చదవొద్దని కొందరు తీర్మానించారు. నన్నయ్య, తిక్కన్న లాంటి పురాతన కవులకు ప్రాంతీయతత్వం అంటగట్టారు. ఇప్పటికీ కోనసీమ కొబ్బరిబోండాలు, ఆంధ్ర కూరగాయలు వద్దని ఖరీదు ఎక్కువైనా బెంగుళూరు నుంచి తెప్పించే దళారులున్నారు. ఈ సెగ రుద్రమదేవికీ తగలడంలో ఆశ్చర్యం లేదు. నేతల ప్రభ తగ్గేవరకూ ఈ రచ్చ కొనసాగుతూనే వుంటుం ది. కొద్ది కాలం తర్వాత తగ్గవచ్చు.
-కె.సుధీర్, శ్రీనగర్, తూ.గో.