మీ వ్యూస్

శిరోభారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడిల్‌క్లాస్ మెంటాలిటీ నేపథ్యంగా నాని, సాయిపల్లవి జంటగా నటించిన ఎంసిఏ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొత్త దర్శకుడు ఎంచుకున్న కథ, క్యారెక్టర్ నేపథ్యం కొత్తగా వున్నా, దానిని అలరించేలా ముందుకు నడిపించి ప్రేక్షకులకు సంతృప్తినివ్వడంలో నిరాశే మిగిల్చింది. మంచి నటనతో, టైమింగ్ వున్న కామెడీతో, యాక్షన్ సీన్లలో నాని మెప్పించినా, నాని, సాయిపల్లవితో ప్రేమ దృశ్యాలు గిలిగింతలు పెట్టించేవిగా వున్నా, ద్వితీయార్థంలో పావుగంటలో అయిపోవాల్సిన సినిమాను గంటన్నరకు సాగదీయడం వలన ప్రేక్షకులకు శిరోభారమే మిగిలింది. వాసనకొట్టే స్క్రీన్‌ప్లేలాగే దేవిశ్రీ సంగీతం కూడా ప్రతీ పాటను ఒక్కొక్క సినిమా నుండి ఎత్తుకొచ్చి కొత్త రంగు అద్దినట్లు అనిపిస్తోంది. సంచలన విజయాలకు పేరున్న దిల్‌రాజు బ్యానర్ సరైన కసరత్తు లేకుండా ఇలాంటి మిడిల్ క్లాస్ సినిమాలను తీయడం నిజంగా బాధాకరం.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం
అచ్చిరాదా?
మహేష్‌బాబు బాల, సినీ హీరోగా ఒక పాతిక సినిమాలు మించి వుండవు. అదే స్టామినాగా పవన్ కళ్యాణ్ రాజకీయగా ఎదగాలని అనుకొంటున్నాడు. మరొక పక్క సమకాలీన నటుడుగా జూ.ఎన్టీఆర్ ఒక వెలుగు వెలిగేస్తున్నాడు. మహేష్‌తో రీమేక్ చిత్రాలు, పెద్ద దర్శకులతో నటించిన చిత్రాలు ఉన్నాయే తప్ప, తెలుగులో కథాబలం కలిగిన వాటికి ఆయన ఛాన్స్ ఇవ్వడంలేదు. ఒక్క శ్రీమంతుడులోనే ఆ మా ర్పుంది. హిట్ చిత్రాలాయనకు ఎన్ని ఉన్నాయో ఫ్లాపులు వాటిని మించి ఉన్నాయి. ఇది గమనించుకోకుండా ఆయన బరిలోనికి దిగితే మహేష్‌బాబు సినిమాల్ని మరిక ప్రేక్షకులు పట్టించుకోరేమో. నటనా కౌశలం పెంచుకుంటూ కథాబలం ఉన్న చిత్రాలు ఆయన చూసుకోకపోతే బిచ్చగాడు, అర్జున్‌రెడ్డి, మహానుభావుడు వంటి చిత్రాలు ఆయనను నెట్టివేస్తాయి. ఆయనకన్నా ఆయన జూనియర్లు ఆయన్ను దూసుకుపోవచ్చు. ఆయనకి సినిమా ఫీల్డు అచ్చిరాదా? ఆయనే తేల్చుకోవాలి మరి!
-పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
నవ్వులపాలు కాకూడదు...
నేడు టీవీల్లో, సినిమాల్లో నవ్వించటానికి వారు పడుతున్న పాట్లు ఎన్నని చెప్పగలం? నిజం చెప్పాలంటే వారు చేస్తున్న వికృత చేష్టలు.. వింత ప్రేలాపనలు చూడాలంటే భయం వేస్తుంది. నాడు సినిమాల్లో హాస్యం ఎంత సున్నితంగా సుమధురంగా వుండేదో మనకందరికీ తలిసిన విషయమే. ఈమధ్య టీవీల్లో యువతను టార్గెట్ చేసే ప్రోగ్రామ్స్ మరీ చెత్తగా.. ఛండాలంగా వుంటున్నాయి. అసలు అవి ఎందుకు చేస్తున్నారో.. ఎలా చేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కని చిదంబర రహస్యం. అర్థం చేసుకోవాలంటే అంతా ఆర్థిక లాభం కోసమేనన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాని అంతగా దిగజారి కార్యక్రమాలను రూపొందించడం మంచిది కాదని నా అభిప్రాయం. ఏదైనా హాస్యం రావాలంటే సీన్ చూస్తే ముఖం మల్లెపూవులా వికసించాలి. అందరూ ముఖాల్లో హాస్యపు జల్లులు కురవాలి కాని నవ్వు నవ్వులపాలు కాకూడదు. దర్శక నిర్మాతలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.
-కురువ శ్రీనివాసులు, హైదరాబాద్-13
హృదయాలను తాకింది!
చిన్నతనంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు, పెరిగి పెద్దయ్యాక తిరిగి ఎలా కలుసుకున్నారనే ఒక సింపుల్ పాయింట్‌ను ఎంచుకుని, దానికి డెస్టినీ, మాఫియా లాంటి హంగులను జోడించి ఆద్యంతం అహ్లాదకరంగా ‘హలో’ సినిమాను తీర్చిదిద్దిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ అభినందనీయుడు. అఖిల్ సినిమా దారుణంగా పరాజయం చవిచూశాక చాలా కాలం గ్యాప్ తీసుకొని ఒక రీ లాంఛింగ్ మూవీలా హలోను తీర్చిదిద్దేందుకు దర్శకుడు, నిర్మాత నాగార్జున పడిన తాపత్రయం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఎలాంటి అరుపులు, వాయిద్యాల ఘోష, గందరగోళం లేకుండా అనూప్ రూబెన్స్ సంగీతం వేసవిలో మంచు వెనె్నలలా హృదయాలను తాకింది. ఉత్కంఠ రేపే స్టంట్‌లు నిజంగా హాలీవుడ్ స్థాయిలో వున్నాయి. దానితోపాటు ఫొటోగ్రఫి, ఎడిటింగ్ లాంటి అంశాలన్నీ అద్భుతంగా వున్నాయి. ఎక్కడా హద్దులు దాటకుం వినోదం, సెంటిమెంట్, యాక్షన్ సమపాళ్ళలో రంగరించి అఖిల్, కల్యాణి, రమ్యకృష్ణల చక్కని నటనతో కుటుంబమంతా కలిసి కూర్చుని ఆనందించగలిగే ఒక చక్కని సినిమా హలో!
-ఎం.కనకదుర్గ, తెనాలి
నిజమో కాదో..!
నిజమో కాదో తెలియదుగాని కృష్ణ నటించిన పద్మవ్యూహం చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించినందుకు కినుక వహించి కమలాకరునికి పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య లాంటి అవార్డులు రాకుండా ఎన్టీఆర్ చేశాడని ఒక పత్రిక ప్రచురించింది. నిజమో కాదో తెలీని అంశాన్ని ఆ పత్రిక ప్రచురించనేల? నేరుగా తన శీల హననం చేస్తూ తీసిన మండలాధీశుడులో కోట శ్రీనివాసరావు నటించినందుకు ఎన్టీఆర్ అభిమానులు కోటపై దాడి చేయగా వారిని ఆపి, కోట కెరియర్‌కి విఘాతం కలుగకుండా ఓర్చుకున్న ఎన్టీఆర్ కమలాకరునిపై కినుక వహించాడంటే నమ్మలేం.
-అభిలాష, సాంబమూర్తినగర్
మళ్లీ ఫామ్‌లోకి..!
అక్కినేని వంశానికి డిసెంబర్ సెంటిమెంట్ మరొక్కసారి హలో రూపంలో అక్కినేని అఖిల్‌కు సూపర్‌హిట్ సినిమా అందించింది. గతంలో నాగార్జున నటించిన ‘మన్మథుడు’ మాస్, రాజన్న చిత్రా లు నాగార్జునకు బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించినది డిసెంబర్ నెల. అలాగే ఫీల్ గుడ్ సినిమాగా హలో నిలిచింది. అఖిల్ నటన క్లాస్ ప్రేక్షకులను దగ్గర చేసింది. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్‌కు మంచి ఫ్లాట్‌ఫామ్ ఇచ్చింది. డాన్సులు చేయడంలో అఖిల్ ఇతర హీరోలకు తగ్గకుండా చేసి మెప్పించాడు. హలో చిత్ర విజయంతో అఖిల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
-పాణ్యం శ్రీనివాసరావు, కర్నూలు