మీ వ్యూస్

పాటలకే పరిమితమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక కొత్త సినిమా వస్తుందంటే ప్రేక్షకులలో వచ్చే సందేహం హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? ఇద్దరూ వారి అభిమానులైతే అభిమానుల్లో కొండంత సంతోషం. అయితే మన తెలుగు సినిమాలలో కథలన్నీ హీరో ప్రాధాన్యమున్న కథలే వస్తున్నాయి. ముందు హీరో, ఆ తరువాత అతని ఇమేజ్‌కు తగ్గ కథ. మరి హీరోయిన్ పాత్రమేమిటి? ఎంత పెద్ద హీరోయిన్‌ని తీసుకున్నా డ్యూయెట్లకోసమే. అంతే తప్ప కథలో హీరోయిన్ పాత్ర నామమాత్రమే. వెనుకటి సినిమాలలో విమల, మిస్సమ్మ, భాగ్యరేఖ వంటి చిత్రాలు కథానాయికకు ప్రాధాన్యమున్న చిత్రాలు వచ్చాయి. అగ్రనటులైన ఎన్టీఆర్ కథకే ప్రాముఖ్యతనిచ్చేవారు. నేటి చిత్రాలలోనూ కథానాయకులతో సమాన ప్రాధాన్యత వున్న కథలో కథానాయికలకూ ఇవ్వాలి. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు రావాలి. పెద్ద నటులైనా సరే కథలో భాగం కావాలి. కథను తమ చుట్టూ తిప్పుకోవాలని చూస్తే సరైన కథలు రావు.
-సరికొండ శ్రీనివాసరాజు,
వనస్థలిపురం
చిరువిషయాలు
అంతర్థానమైన అతిలోకసుందరి గురించి ఎందరు ఎన్ని చెప్పినా ఆమె గురించి కొద్దిమందికే తెలిసిన చిరువిషయాలు- జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో హీరోయిన్ ఉండదు. ఆ చిత్రంలో ఒక స్ర్తి పాత్రకు ఆమెను ఎంపిక చేసినా ఆమె తిరస్కరించింది. బీదలు, ధనికులమధ్య అంతరం తొలగించాలన్న కాంక్షతో ఆమె రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నా తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఎందుకంటే, తమిళనాట కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన తండ్రికి ప్రచారం చేసింది శ్రీదేవి. కాని ఆయన ఓడిపోయాడు. దాంతో శ్రీదేవి రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసింది. రాజకీయాల్లో జయసుధ, జయప్రద కాస్తంత పేరు సంపాదించినా ప్రజలకు వారివల్ల ఒరిగిందేమీ లేదు.
-సంపూర్ణ, సాంబమూర్తి, నగర్
ఇలా రాస్తే ఎలా?
బాలీవుడ్ చిత్రం ‘అయ్యారి’ని పాకిస్తాన్ నిషేధించింది. పాక్ ప్రజలు అయ్యరి చిత్రం చూసే భాగ్యం కోల్పోయారని ఒక పత్రిక రాసింది. సినిమా చూడగలగడం ఒక భాగ్యం. చూడలేకపోవడం ఒక దౌర్భాగ్యమనా? మన సంస్కృతిని కించపరిచే దృశ్యాల్ని పద్మావత్ చిత్రంనుంచి తొలగించారు. తొలగించిన భా గాలు చూడలేకపోయినందుకు మనం దౌర్భాగ్యులమా? ఆ దృశ్యాలు చూడగలిగిన పాకిస్తానీయులు భాగ్యవంతులు అనుకోవాలా? పదాలను ఆచి తూచి ఎంపిక చేసుకోవాల్సిన పత్రికలే ఇలా రాస్తే ఎలా?
-సత్య, కరప
అందరివాడు!
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘్ఛలో’ ఆడియో రిలీజ్‌కి విచ్చేసి తాను ఈ ఆడియోకి రావడానికి గల కారణాన్ని వివరించాడు. తాను సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో, తను నటించిన ఒక చిత్రానికి ఓ అగ్ర హీరోని ఆడియోకి ఆహ్వానించామని తెలిపాడు. కాకపోతే సదరు హీరోకి వీలుకాక తన ఆడియోకి రాలేదని, తర్వాత ఆ చిత్ర ఆడియోని తూతూ మంత్రంగా ముగించామని, అటువంటి చేదు అనుభవం హీరో నాగశౌర్యకు ఉండకుండా ఉండడానికే ఈ ఆడియోకి వచ్చానని ఛలో ఆడియోలో చిరు వివరించాడు. ఆ తర్వాత ఆ చిత్రం లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెప్పించింది. దీన్ని బట్టి చూస్తే చిరంజీవి నూతన టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుంటాడని మరోసారి రుజువైంది.
-బాణాల కృష్ణ, హైదరాబాద్
శ్రీదేవి పేరిట అవార్డు
తెలుగు సినిమా రంగంలో నటిగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు పొందిన శ్రీదేవిని చలన చిత్ర రంగం భారతావని మరువలేదు. నటిగా ఆమె సాధించిన అవార్డులు అనేకం.. తెలుగు సినిమా పరిశ్రమ ఆమె పేరుతో అవార్డు ఏర్పాటుచేసి ప్రతి ఏటా ఆయా నటీమణులకు అవార్డులివ్వాలి. అదే శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూర్చగలదు. అంతేకాకుండా ఆమెకు భారత ప్రభుత్వం ‘్భరతరత్న’ అవార్డునివ్వాలి.
-ఎల్.ప్రపుల్ల చంద్ర, ధర్మవరం

కలచివేసింది!
‘గాయత్రి’ చిత్రం విడుదల రోజే పైరసీ బారిన పడటం మోహన్‌బాబు బాధపడడం మమ్మల్ని కలచివేసింది. కాని సునిశితంగా ఆలోచిస్తే పైరసీ ఇలా విజృంభించడానికి కారణం చిత్ర పరిశ్రమే. రెండు దశాబ్దాల క్రితం వరకు హీరోకి కొన్ని ప్రమాణాలు ఉండేవి. క్రమంగా ఆ ధోరణి మారింది. పోకిరిగాళ్లు, బేవార్స్‌గాళ్లు, లోఫర్లు చేసే పనుల్ని గ్లోరిఫై చేసి హీరో పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు. ఆ హీరోల మాదిరిగానే ప్రవర్తించే యువత పైరసీకి పాల్పడితే పైశాచిక ఆనందం అని తిట్టనేల? ఏ విత్తనం వేస్తే ఆ మొలకే మొలుస్తుంది.
-మైథిలి, సర్పవరం
ఇబ్బందులను
తొలగిస్తే బావుండు!
సినిమా నిర్మాతలు డిజిటల్ ప్రొవైడర్లకు వ్యతిరేకంగా సమ్మె చేస్తూ సినిమా థియేటర్లను వారం రోజులపాటు మూసివేయించారు. అయితే ఈ సందర్భంగా నాదో విన్నపం. సినిమా థియేటర్లలో ప్రేక్షకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారి ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తే బావుండు. బ్లాక్ టికెటింగ్, కొత్త సినిమా విడుదల రోజుల్లో టికెట్ల ఎక్కువ రేట్లు, త్రాగునీరు, అపరిశుభ్రంగా మరుగుదొడ్లు, అధిక క్యాంటీన్ రేట్లు, వాహన పార్కింగ్ ఫీజులు, తినుబండారాల ధరలు తలచుకుంటే సినిమా వీక్షణ ఖరీదైన వ్యవహారంగా మారింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉపయోగించకపోవడం, సినిమా మొదలయ్యాక ఏసి తీసేయడం లాంటి చర్యలకు థియేటర్ల యాజమాన్యాలు పాల్పడుతున్నాయి. ఇక కుర్చీల సంగతి సరేసరి. కుర్చీలలో నల్లులు, దోమలు, దుర్గంధం, కాళ్ళక్రింద చెత్త, ఎలుకలు ప్రేక్షకులను తీవ్ర చికాకు కలిగిస్తున్నాయి. ధ్వని పరిజ్ఞానం లేని ఆపరేటర్లు సౌండ్‌ను ఇష్టం వచ్చినట్లు పెంచడంవల్ల వీక్షకుల చెవులకు చిల్లులుపడేంత భయంకర వాతావరణం నెలకొంటోంది. ఇలా థియేటర్ లోపల, బయట ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇక గతంలో పైతరగతి సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఇది చాలా బాధాకరం. చాలా సినిమా థియేటర్లలో కింది తరగతి సీట్లు నామమాత్రంగా ఉన్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారు కాని సినిమాలకు కాదు. ఎటువంటి లోపాలు లేకుండా సరిగా నిర్వహించే థియేటర్ల కలెక్షన్లను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది.
-జి.అశోక్, గోధూర్, జగిత్యాల జిలా