మీ వ్యూస్

పోలిక బావుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వారం వెనె్నలలో ప్రచురితమైన ‘అప్పుడప్పుడు...’ వ్యాసం ఆలోచింపచేసేదిగా ఉంది. సినిమాపై ప్రేక్షకుడికి విరక్తిపుడుతున్న సమయంలో అప్పుడప్పుడు ఇలాంటి జీవిత చిత్రాలొచ్చి సినిమాపై మమకారాన్ని సజీవం చేస్తున్నాయన్న వ్యాసకర్త ఆలోచన బావుంది. సినిమా స్వర్ణయుగంలో అప్పుడప్పుడు చెత్త సినిమాలు వచ్చేవి. ఇప్పుడు అప్పుడప్పుడు మంచి సినిమాలొస్తున్నాయి. అంతే తేడా. సుయి-్ధగా చిత్రాన్ని బ్యాలెన్స్ తప్పకుండా, ప్రేరణాత్మకంగా తీసిన దర్శకుడి ప్రతిభ సినిమా అణువణువునా కనిపించింది. వరుణ్‌ధావన్, అనుష్క శర్మల అభినయంలో రచయిత చెప్పినట్టు నిజాయితీయే కనిపించింది. మెలోడ్రామావైపు పరుగులు తీయకుండా పేదింటి వృత్తిపనివాడి జీవితాన్ని చూపిస్తూనే, సంకల్పబలంతో ఉన్నతస్థాయికి ఎదిగిన సన్నివేశాలను దర్శకుడు తెరపై అద్భుతంగా చిత్రీకరించాడు. నిజంగానే అప్పుడప్పుడు వచ్చే సినిమాలివి.

-ఆర్ అఖిల్, మల్లవరం

క్షమించలేం..

నిజానికి తాజా దేవ-దాసులో కథేముందని? మీడియా హైప్ ఇచ్చేస్తోంది. ఇద్దరు పెద్ద హీరోలు ఉంటే ఆ సినిమా గొప్పదా? ఆర్టిస్టులబట్టి సినిమాను విశే్లషించాలా? కథనుబట్టా? ఇద్దరు హీరోలకు సీరియల్ ఎడిసోడ్ల మాదిరి సన్నివేశాలు రాసేసి, ఒకరి తరువాత ఒకరిని చూపించేస్తూ సినిమా నడిపించేస్తే -క్లైమాక్స్‌లో ‘అతుకుల బొంత’ను పరిచేస్తే ప్రేక్షకుడు దానిపై హాయిగా నిద్రపోవాలా? వరల్డ్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ఆ ‘దేవదాసు’ను, సినిమా విడుదలకు ముందు పదేపదే ప్రస్తావిస్తూ ఆ ఇమేజ్‌ను వాడుకోవాలని చూడటం ‘గొప్ప నటుడిని’ కించపర్చినట్టే కదా. సినిమా కళపై అభిమానమున్న వాళ్లు క్షమించగలరా? అందులో నాగార్జున సైతం పాలుపంచుకోవడం ఏతరహా గౌరవం. దేవదాసు టైటిల్‌ను రెండు క్యారెక్టర్లుగా విడగొట్టి కథ రాసేసుకుంటే సరిపోతుందా? పైగా ఆ కథతో పోలికే లేదు, మందు తప్ప? అని చెబుతారా? గొప్ప టైటిల్‌ను విడదీసి, వాటిని పాత్రలుచేసి ఏం సాధించినట్టు. ఈ దేవ-దాసు థియేటర్లలో ఉన్నంతకాలం ఆ దేవదాసు ఖ్యాతిని పంకిలపర్చినట్టు కాదా?

-మల్లీశ్వరి, రాజమండ్రి

టీజర్ బజర్

కొద్దిరోజుల క్రితం వెనె్నలలో వచ్చిన ‘ఊరిస్తున్న టీజర్లు’ వ్యాసం బావుంది. సామాజిక మాధ్యమాలు రావడంతో కొత్తరకం పబ్లిసిటీ జోరందుకుంది. ఫలానా టీజర్‌కు గంటలో మిలియన్ వ్యూస్ వచ్చాయి.. లక్ష లైకులొచ్చాయంటూ ఊదరగొడుతున్నారు. కోట్లాదిమంది చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉన్నపుడు, వారిలో లక్షలాదిగా సినీ అభిమానులూ ఉన్నపుడు కాలక్షేపానికి టీజర్ చూస్తే.. అదేదో ఘనతలా ప్రచారం చేసుకోవడం దారుణాతి దారుణం. పైగా సినిమా సక్సెస్‌కు అదే సూచనగానూ చెప్పేస్తున్నారు.
ఏ టీజర్ ప్రాముఖ్యమైనా మొదటి ఆటతో క్లోజ్. ఆ తరువాత సినిమాను నోటిమాటే కాపాడాలి. హిట్టుకైనా ఫట్టుకైనా మాటే ఫస్ట్‌మెట్టు. ఇక ఈ వ్యాసంలో మరో విషయం ప్రస్తావించి ఉంటే బావుండేదేమో. నటీనటుడు, దర్శకులు.. వారి కాంబినేషన్లు టీజర్ల మాదిరిగా ఊరిస్తున్నారు. కాంబినేషన్ల హైప్‌తో మొదలైన ఎన్ని సినిమాలు రెండోకంటికి తెలీకుండా క్లోజైపోలేదూ! నిజానికి ఈ ప్రచారం మరీ ప్రమాదం.

లోకమాన్య, సికింద్రాబాద్

అదీ భాష అంటే..

సినిమాల్లో తెలుగు అష్టవంకరలు పోతోంది. అసందర్భంగానూ ఉర్దూ, ఆంగ్లపదాలు చొచ్చుకురావడం ఎప్పుడో మొదలైంది. జప్ఫాగాడు, ఇరగదీస్తా, రప్ఫాడిస్తాలాంటి అర్థంలేని వ్యర్థపదాలూ దూరుతున్నాయి. సందర్భాన్ని బట్టి అర్థం ఊహించుకోవడం ప్రేక్షకుడి వంతు.
దశాబ్దాల క్రితం సినిమా భాష గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవడం పాత సినిమాల్లో చూస్తుంటాం. భానుమతి మూడో చిత్రం ‘్ధర్మపత్ని’లో ‘అలా చెప్పమాకండీ’ అన్న డైలాగుని సాక్షాత్తూ ఆమె తండ్రే వ్యతిరేకించాడట. సినిమా భాష అన్ని ప్రాంతాలవారికీ అర్థమయ్యేలా ఉండాలని చెప్పి పట్టుబట్టి ‘అలా చెప్పకు’ అని మార్చారట. ఆ డైలాగు రాసింది చక్రపాణి. ఆయన ప్రఖ్యాత రచయిత. శరత్‌బాబు బెంగాలీ నవలల్ని తెలుగులోకి తర్జుమా చేసినవాడు. ఆయన డైలాగునే తప్పుబట్టారంటే -ఎలాంటి జాగ్రత్త తీసుకునేవారో అర్థమవుతుంది.
-అయోథ్యరామ్, పెద్దాపురం.

అవసరమా?

ఈమధ్య తరచూ ప్రకాష్‌రాజ్ వార్తల్లోకి వస్తున్నాడు. ఆయన పోషించే పాత్రలతో కాదు, ఆయన చేష్టలతో. కొన్ని పాత్రలు తాను తప్ప మరెవ్వరూ చేయలేరన్న అహం ఆయన చేష్టల్లో కనిపిస్తోంది. హలో గురూ ప్రేమ కోసమే.. చిత్రం సెట్స్‌లో మొదట అనుపమతో, తరువాత సినిమాటోగ్రాఫర్‌తో గొడవపెట్టుకున్నాడు. ఈమధ్య ఓ చిత్రం షూటింగ్‌లో కమెడియన్ సప్తగిరిని లెంపకాయ కొట్టాడన్న వార్తలూ పత్రికలకెక్కాయి.
లక్షలిచ్చి అతనని, బోనస్‌గా టెన్షన్లు తెచ్చుకోవాల్సిన కర్మ నిర్మాతలకు ఎందుకో? రాజేంద్రప్రసాద్, జగపతిబాబులాంటి ఆర్టిస్టులు తండ్రి పాత్రల్ని అద్భుతంగానే చేస్తున్నారుగా. మరీకాదంటే మలయాళం నుంచీ దిగుమతి చేసుకోవడం అలవాటేగా. ఎంతకాలం ప్రకాష్‌రాజ్‌తో తెలుగు పరిశ్రమకు తంటాలు?

-సౌందర్య, కాకినాడ

మరీ విడ్డూరం

తెలుగు వీక్లీల్లో సినీతారల ఇంటర్వ్యూలు చదువుతుంటే మరీ విడ్డూరం అనిపిస్తోంది. నిజానికి తేజస్వి ముదివాడ పేరు తెలీనివారే ఎక్కువ. కానీ, పరిచయం అక్కర్లేని పేరంటూ గ్యాస్ కొట్టిందో పత్రిక. ఓసారి వర్మ ఆమెను చూసి ‘నువ్వెప్పుడూ నీలాగే ఉండు. జీవితంలో పైకొస్తావు’ అని అన్నాడట. ఈ విషయాన్ని ఆమె చెప్పిందే. బిగ్‌బాస్ 2కి ఎంపికై వెంటనే ఎలిమినేట్ అవ్వడానికి కారణం -తను తనలాగే ఉండటమనీ చెప్పుకొచ్చింది. నిజానికి వర్మ తనలాగే తనువుంటూ వరుస ఫ్లాప్‌లు ఇస్తున్నాడు. ఆయన సలహా పాటిస్తే ఎంతోకొంతవున్న తేజస్వి కెరీర్ కూడా మసకబారడం ఖాయం. కాదంటారా?

-శాన్వి, కర్నూలు