మీ వ్యూస్

నోట మాటలేదేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహా ఓహో అంటూ విజయ్‌ను ఆకాశానికి ఎత్తారు. ఎన్నికల మూడ్ వచ్చేసింది కనుక నోటా ఇరగదీదీస్తుందన్నారు. ఏమైంది? నోటాకు మాట లేదు. అర్జున్ రెడ్డి ఇమేజ్ మొత్తం ఆకాశానికి ఎగిరిపోయంది. అందుకే అంటారు పెద్దలు -ఎక్కడికక్కడే ఉండాలి తప్ప ఎగిరెగిరి పడకూడదు అని. ఏమైతేనేం.. విజయ్‌కు విషయం తెలిసొచ్చి ఉంటుంది. కొత్త అనుభవం అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఇమేజ్ అనేది ఒక సినిమాతో వస్తే మరో సినిమాతో పోవచ్చు. పర్మినెంట్ ఇమేజ్ అనేది వ్యక్తిత్వాన్ని, అతను ఎంపిక చేసుకునే కథలను బట్టి ఉంటుది.

-రాఘవేంద్ర, పెనుగొండ

నష్టపరిహారం అడుగరు!

సినిమాలలోని పోరాటాలలో ప్రక్కనే ఉన్న పండ్లబండ్లు, కూరగాయల బండ్లు, కుండలు పగిలిపోవటం, గాజు, పింగాణి సామాన్లు పగలటం వంటివి జరిగితే ఆయా స్వంతదార్లు పోట్లాటకి దిగరు. నష్టపరిహారం అడుగక పోవటం విచిత్రం! ఎవరెవరో కొట్లాటల వలన మరెవరివో వస్తువులు ధ్వంసం అయితే నష్టపరిహారం అడుగుతున్నట్లుకూడా చూపిస్తే బాగుంటుంది. లేకపోతే అరాచకత్వాన్ని సమర్ధించినట్లవుతుంది కదా. అసలుసిసలు మొత్తంగా వాస్తవ విరుద్ధంగా ఉంటే ఇక ఇలాంటివి ఎవరు పట్టించుకుంటారు? జనాలకి ‘అభిమాన హీరోలు’ చేసే వెకిలి తనాన్ని చూడటమే ముఖ్యం. ఎవరూ బాగుచేయలేనంత ‘హుసేన్‌సాగర్’ లాగా సినిమా రంగం ఏనాడో మారింది.

-ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్

అయోమయం

బయోపిక్ చూసి ఏది నిజం, ఏది కాదు అని చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. అనుమానం అక్కరలేదు. ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు సర్వశ్రేష్టుడు, చాణక్యుని అంతటివాడు. అతని వల్లనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. అతడు మామగారికి వెన్నుదన్నుగా నిలచి వెంట ఉండి సక్రమంగా ఆయన్ని నడిపించాడు అని చూపిస్తారు గాని వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్నట్టు చూపించరు. ఎందుకంటే ఎన్టీఆర్ తనయుడే చంద్రబాబుకి వియ్యంకుడు. ఇద్దరూ తెదేపాలోనే ఉన్నారు. ఎన్నికలు రాబోతున్నాయి. ఈ చిత్రం చంద్రబాబుకి మంచి ప్రచారం కల్పించి గెలిపించాలి కదా! చంద్రబాబుని దశమగ్రహం అన్న మామగారి మాట కూడా వినిపించదు. గ్యారంటీ!

-శాంతి చంద్రిక, సామర్లకోట

తెరకెక్కించలేనివి ఎన్నో

23 సెప్టెంబర్ 2018 వెనె్నల అనుబంధం ప్రధాన వ్యాసంలో బయోపిక్‌లపై మురహరి ఆనందరావు రాసిన వ్యాసం బాగుంది. సావిత్రి, ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని అంశాలను పాఠకుల ముందుకు తెచ్చారు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. మరి వాటి అన్నింటినీ తెరకెక్కిస్తారా, లేక తమకు అనుకూలమైన అంశాలనే చిత్రీకరించి జనంముందుకు ఈ సినిమాని తెస్తారా? నాదెండ్ల ఉదంతం చూపినపుడు, వైస్రాయి హోటల్‌లో జరిగిన దానికి ఏమని పేరుపెడతారో వేచి చూడాలి. నా వారసుడు బాలకృష్ణ అని ఎన్టీఆర్ మదనపల్లిలో ఒకసారి ప్రకటించారు. ఆ ప్రకటనను ఉపసంహరింపచేసేదాక కొన్ని శక్తులు నిద్రపోలేదు. ఇవన్నీ ఈ చిత్రంలో ఉంటాయనుకోవడం అత్యాశే అవుతుంది.

-ఎం అజయ్‌కుమార్, రామచంద్రాపురం

వాళ్ల మాటలన్నీ గ్యాసే

ప్రతి వార పత్రికలోనూ సినీ తారల ఇంటర్వ్యూ తప్పనిసరి. పేజీ నిండితే చాలు అన్నట్టు గ్యాస్ కొడుతున్నారు. తెలుగమ్మాయిని కనుక టాలీవుడ్‌లో చాన్స్‌లు రావడంలేదన్నది చాందిని చౌదరి మాట. సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారని విలేఖరి అడగడంలో ఔచిత్యం ఉందా? ‘బ్రహ్మోత్సవం’లో చాలా మోసపోయాను. మంచి పాత్ర అంటూ చెల్లి పాత్ర ఇచ్చారు. ఆ సినిమాలో తనకు మహేష్‌తో ఫొటో తప్ప గుర్తింపు రాలేదు. అందుకని కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నందువల్ల గ్యాప్ వస్తోందని చెప్పింది. అవకాశాలు ఇవ్వడంలేదంటూ ఆఫర్‌లు ఉన్నట్టు చెప్పడంలో అర్థం ఉందా?

-పైడిపంతులు, శ్రీనగర్

ఆ పేరులోనే ఫైరుంది

అర్జున్ అనగానే ఆ పేరులో ఓ ఫైరుంది. వెండితెరపై ఆ ఫైరును అందుకోవాలని ఆయన అభిమానులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. యాక్షన్‌కింగ్ అర్జున్ నటించిన 150వ చిత్రం ‘కురుక్షేత్రం’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో కథ కథనాలకు పెద్దపీట వేశాడు దర్శకుడు వైద్యనాథన్. పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ అదరగొట్టాడు. ఈ చిత్రంలో జరిగే వరుస హత్యలు చివరివరకూ థ్రిల్‌ను కలిగించాయి. టీనేజ్ పిల్లలను తల్లిదండ్రులు ఒంటరిగా వదిలివేస్తే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో క్యాథరీన్ పాత్ర ద్వారా ఈ చిత్రంలో చక్కని సందేశం ఇవ్వటం జరిగింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ కురుక్షేత్రం చిత్రం అర్జున్ స్థాయిని మరింత పెంచింది. చిత్రంలో అర్జున్‌కు సబార్జినేట్‌గా నటించిన ఆఫీసర్స్ నటన ఆకట్టుకున్నది. ఎప్పటిలాగా అర్జున్ తనయొక్క మార్క్ ఫైట్స్‌తో మరిన్ని చిత్రాలతో రావాలని ఆయన అభిమానులుగా మేము ఆశిస్తున్నాము.

-వెలిశాల దుర్గాప్రసాదు, ఆత్కూరు

ఘంటసాల వస్తున్నాడు..

రాజకీయ నేతల బయోపిక్స్ అటుంచితే ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల బయోపిక్ సైలెంట్‌గా ఆర్భాటాలు లేకుండా షూటింగ్ ముగించుకొని డిసెంబర్‌లో విడుదల కాబోతోంది. ఆయన గురించి బాగా పరిశోదనచేసి ‘ఘంటసాల పాటశాల’అనే పుస్తకం రాసిన సిహెచ్.రామారావు దర్శకుడు. లక్ష్మినీరజ నిర్మాత.
ఘంటసాల అత్యున్నత స్థానంకి చేరుకున్న క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు, లక్ష్యాన్ని సాధించిన వైనం చూపిస్తారట. సాలూరు తనయుడు వాసురావు మ్యూజిక్ అందిస్తుండగా టివీలో స్వరాభిషేకం లాంటి పాటల కార్యక్రమాల్లో పాల్గొనే కృష్ణచైతన్య ఘంటసాలగా నటిస్తుండగా ఆయన భార్య మృదుల ఘంటసాల భార్యగా నటిస్తున్నదట.

-అయోధ్యరామ్, పెద్దాపురం