మీ వ్యూస్

మార్పు అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెకెండ్ ఇన్నింగ్స్‌లో కాస్త భిన్నమైన సినిమాలతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు సుమంత్ చేస్తున్నా, ఫలితమే దక్కడం లేదు. నాలుగేళ్ల గ్యాప్ తరువాత -వద్దవద్దనుకుంటూనే హారర్, థ్రిల్లర్ కథలపై పడిన సుమంత్, ఈమధ్యే చేసిన సుబ్రమణ్యపురం, ఇదం జగత్ చిత్రాలు కెరీర్‌కు కొత్త టర్న్ ఇవ్వలేకపోయాయ. నిజానికి సవాలుతో కూడుకున్న పాత్రలను సైతం అలవోకగా చేయగలిగే సుమంత్, తనవరకూ చిత్రాలకు న్యాయం చేస్తున్నా, మొత్తంగా ప్రాజెక్టులే నిరుత్సాహపరుస్తున్నాయ. కొత్త కొత్త హీరోయిన్‌లతో ప్రయోగాలు చేస్తున్నా -ఫలితమే కనిపించటం లేదు. సుమంత్ తన పాత స్టయల్లో సినిమాలు చేస్తేనైనా కెరీర్‌కు ఉపయోగపడే టర్న్ వస్తుందేమో. ఆలోచించాలి.
-సీఆర్ బొల్లిముంత, ఒంగోలు
ఆయన అదోటైపు
గతంలో రామ్‌గోపాల్‌వర్మను ఎందుకు ఎక్కువగా దెయ్యాల చిత్రాల్లో భయంకరమైన సన్నివేశాలు పెడతారని మీడియా అడిగినపుడు జవాబుగా -జనాన్ని భయపెట్టడం ఇష్టమని చెప్పాడు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో ఎన్నికలపై మీ అభిప్రాయమేంటి? అన్న ప్రశ్నకు -ఓటువేసే ప్రతీ ఒక్కరు బకరా అంటూ సమాధానమిచ్చాడు. అసలు రాంగోపాల్‌వర్మకు సొసైటీపై గాని, రాజకీయాలపై గాని ఏమాత్రం సదభిప్రాయం లేదు. అందుకేనేమో మీడియా ఎప్పుడూ అతన్ని హైలెట్ చేస్తూ ఉంటుంది. సైకియాట్రిస్టులు చొరవతీసుకుని వర్మకు కౌనె్సలింగ్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. మీడియా కూడా వర్మకు దూరంగా ఉండటం ఎంతైనా సమాజానికి శ్రేయస్కరం.
-బి కృష్ణ, హైదరాబాద్
ఆనాటి సినిమాలు
ఆదివారం వెనె్నల ఎప్పటిలాగే అలంకరించబడ్డ పుష్పమాలలా సుగంధం విరజిమ్మే వ్యాసాలతో అలరించింది. మాయమైనారమ్మా మహిళాభిమానులు, శంకర్ సీక్వెల్స్, ఎనె్నన్నో అందాలు -వ్యాసాలు పొద్దనే్న కమ్మని పెరుగన్నం తిన్న భావన కలిగించాయ. .. మహిళాభిమానుల కథనంలో వ్యాసకర్త నుడివినట్టు పాత సినిమాలు తెరమీద చూస్తున్నా, నిత్యజీవిత సంఘటనలేనన్న భావన కలిగిస్తాయ. అందుకే ఆ సినిమాలు, నవ్వించాయి. ఏడిపించాయి, ఈనాటికి నిత్యనూతనంగా వెలసిల్లుతున్నాయి. మాణిక్యేశ్వరి సారంగధర చిత్రం ఫ్లాష్‌బ్యాక్ చదువుతుంటే మరోసారి సినిమా చూస్తున్నట్లునిపించింది.
-ఎన్నారెల్, సికిందరాబాద్
ప్రియాంక ముందుచూపు
సల్మాన్‌ఖాన్ చిత్రం ‘్భరత్’ దర్శకుడు అలీ అబ్బాస్‌కి చాలాసార్లు ప్రియాంకాచోప్రా ఫోన్ చేసి తనకు సల్మాన్‌తో నటించాలని ఉంది అని చెప్పిందట. సల్మాన్ స్నేహితులకూ చెప్పింది. దుబాయ్‌లో నేరుగా సల్మాన్‌కే చెప్పడంతో ఆ చిత్రంలో ఆమెను తీసుకున్నారు. కొన్ని వారాలు గడిచాక ఆమె ఆ చిత్రంనుంచి తప్పుకుంది. అందుకు కారణం ఆమెకు పెళ్లి ఫిక్స్ కావడమేనన్న టాక్ వినిపించింది. అయతే, అసలు కారణం ఇప్పుడు బయటపడింది. ఆ చిత్రంలో తబు, దిశాపటానినీ తీసుకున్నారట. తన స్థాయికి తగినట్టు బాగా ప్రాముఖ్యంవున్న పాత్ర ఇస్తారని ప్రియాంక భావించిందిగాని ముగ్గురు హీరోయిన్లలో ఒక సాధారణ పాత్ర అని తెలిసి తప్పుకుందట.
-ప్రసన్న, పేర్రాజుపేట
అదంతే..
పాత పేరుతో కొత్త సినిమాలు రావడం తెలిసిందే. ఇది చిత్రసీమ కదా. చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. పాత సినిమా కథకు రంగులు, మెరుగులుదిద్ది కొత్త సినిమా అని భ్రమింపజేయడం కమర్షియల్ సూత్రమే. ఇటీవలి బహిరంగ ఉదాహరణ పాత మీనా చిత్రం ‘అఆ’గా మారడం! అలాగే ‘బంగారుపిచుక’ చిత్రం ‘పెళ్లికొడుకు’గా మారింది. ఆ రెండు చిత్రాలకూ దర్శకుడు బాపూనే. అంతేకాదు ఆయనే ముత్యాలముగ్గును సుందరకాండగా తీర్చిదిద్దాడు. దశాబ్దాల క్రితం బ్రతుకుతెరువు చిత్రం సూపర్‌హిట్ అయింది. దానినే కొడుకు కోడలుగా పునర్నిర్మించారు. రెండింటిలోనూ నాగేశ్వరరావే హీరో! అలాగే సన్నాఫ్ ఇండియా హిందీ చిత్రం మన బాలనాగమ్మకు రీమేక్! అయితే అవి రీమేక్‌లని చెప్పరు!
-సుధీర్, శ్రీనగర్
అక్కడే ఎక్కువ
మన దేశంలో ఆడవారిపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందిస్తూ అమ్మాయిలు దేశం విడిచివెళ్లిపోతే మంచిది అంది ప్రియమణి. అందుకు ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నది. కొంతకాలం క్రితం అమీర్‌ఖాన్ కూడా దేశంలో అసహనం పెరిగిపోతున్నది. నా భార్య మరో దేశానికి పోదాం అంటున్నది అని చెప్పగానే ‘అలాగే వెళ్లిపొండి’అని విమర్శలు వెల్లువెత్తాయి. నేను భారతీయుడిని. నేనెందుకు వెళ్లిపోతాను అని సర్దుకున్నాడు అమీర్. మన దేశ జనాభా 120కోట్లు దాటేసింది కనుకనే వార్తలు ఎక్కువ సంఖ్యాపరంగా. విదేశాలు స్వర్గ్ధామాలేమీకావు. అక్కడా అత్యాచారాలు, రేప్‌లు, హత్యలు జరుగుతున్నాయి. జనాభాతో నేరసంఖ్యని పోల్చితే అమెరికాలోనే నేరాల శాతం మనకంటే ఎక్కువ. ఆ విషయం తెలిసినా మనకు మోజు తగ్గదు.
-సుభాష్, శ్రీనగర్
అదీ తొలి బయోపిక్
ఒక భారతీయుని జీవితంపై చిత్రం తీసి ప్రపంచానే్న ఊపేసి ఆస్కార్ అవార్డుల్ని కొల్లగొట్టిన ‘గాంధీ’ చిత్రాన్ని భారతీయ తొలి బయోపిక్‌గా భావించవచ్చు. అందులోనూ అసత్యాలు, అర్థసత్యాలూ ఉన్నాయి. స్క్రిప్ట్‌ని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీకి చూపించి ఆమె సూచనలను పాటించి తీసిన చిత్రం ఇది. స్వార్థం, దురాశ, నిప్పురగిలించి తమాషా చూసే నైజం, విభజించి పాలించే ఎత్తుగడ, బహుక్రూరంగా వ్యతిరేకతను అణచివేయడం లాంటి ఆంగ్లేయుల గుణాలను వైట్‌వాష్ చేసి వారిని పక్కా జంటిల్మన్‌లు లాగ చూపించారు. వంటింటి కుందేలు లాగ బతికిన కస్తూర్బాను చకచకా అందరితో మాట్లాడే మాడర్న్ ఉమన్‌గా చూపించడం మరో లోపం.
-లంబకర్ల, రాజేంద్రనగర్