మీ వ్యూస్

వాళ్లంతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరో హీరోయిన్లు చెప్పే మాటలు ఒక్కోసారి ఫకాలున నవ్వు పుట్టిస్తుంటాయి. తాము నిజమని నమ్ముతారో లేక ఏంచెప్పినా జనం నమ్ముతారన్న నమ్మకమో తెలీదుగానీ, అబద్ధాలు మాత్రం అప్పటికప్పుడు చెప్పేస్తున్నట్టే అనిపిస్తుంటుంది. ‘కథ నచ్చితే చేయడమే నాకు తెలుసు. బోయపాటి చెప్పారు. నచ్చింది, చేశాను’ అంది హీరోయిన్ కైరా అద్వానీ. ‘ఈ కథమీద నాలుగేళ్లు కసరత్తు చేసి అన్నివిధాలా సంతృప్తి కలిగాకే సెట్స్ మీదకెళ్లాం. ప్రతి హీరో ఒక్కసారైనా బోయపాటితో పనిచేయాలి’ అన్నాడు చరణ్. ‘నేను నటించిన గ్యాంగ్‌లీడర్ జ్ఞాపకం వచ్చింది ఈ చిత్రం టీజర్ చూస్తే’ అన్నాడు చిరంజీవి. ఇందులో ఏ ఒక్కటీ నిజమనిపించదు. ఎందుకంటే -ఏ సినిమాకైనా కథలో తగినన్ని యాక్షన్ సీన్లు చొప్పిస్తారు ఎవరైనా. కాని ఈ సినిమాలో బోయపాటి యాక్షన్ సీన్లమధ్య కథను ఇరికించే ప్రయత్నం చేశాడు. దాంతో వినయ విధేయ రామ బోర్లాపడ్డాడు.
-చంపక్, మాధవనగర్
ఇంతే సినిమా
మాస్ సినిమా అంటేనే అతి. ఊర మాస్ అంటే -ఇక అతి శృతిమించినట్టే. ఒక్కోసారి అదే వెగటు పుట్టిస్తుంది. వినయ విధేయ రామకు అదే జరిగింది. టైటిల్ క్లాస్. సీన్లు ఊరమాస్ -ప్రేక్షకుడు భరించలేనంత. ఊరమాస్‌కు అచ్చమైన ఉదాహరణను సన్నివేశంగా మలిచాడు దర్శకుడు బోయపాటి. అదేంటంటే -వంతెనమీద నిలుచున్న హీరో కిందనుంచి పోతున్న రైలుమీదకు దూకేస్తాడు. వీరపోజులో నిలబడి బీహార్ వరకు వెళ్లిపోతాడు. ఇదీ సీన్. నెటిజన్లు ఏకేశారు. అది తట్టుకోలేక ఆ సన్నివేశాన్ని తొలగించేసింది చిత్రబృందం. ప్రేక్షకులు థ్రిల్ అవుతారని ఎంతో శ్రమపడి చిత్రించిన సన్నివేశం కత్తెరపాలైతే, నిర్మాత గొంతులో పచ్చి వెలక్కాయపడినట్టే. పైగా బ్యానర్‌కు ఎంత నామర్దా!
-శ్రీకాంత్ బులుసు, తుని
పొరబాటు
ఈమధ్య ఓ వ్యాసంలో -చారిత్రక, పౌరాణిక, కాశీమజిలీ కథల్నీ బయోపిక్‌లు అనొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఎవరో. అది ఎంతమాత్రం సమర్థించలేం. చిత్ర నిర్మాణం ప్రారంభమయ్యాక కొత్తగా పుట్టిన పదమే -బయోపిక్. గ్రీకులో బయోస్ అంటే ‘మానవ జీవిత గమన’మని అర్థం. సో, బయోపిక్‌ను గొప్ప వ్యక్తుల చరిత్రగానే చెప్పుకోవాలి. పురాణ పురుషులకు, కల్పిత మానవ పాత్రలు, జానపద హీరోలకు ఈ పదాన్ని అనువర్తించలేం. సో, రచయితలు ఆ పదాన్ని వినియోగించేటపుడు కాస్త ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే -వరుసపెట్టి బయోపిక్‌ల ఆడియన్స్ మీదకు దండెత్తబోతున్నాయి. వాటిల్లో పురాణ పురుషులు, జానపద హీరోల కథలుంటే వాటిని బయోపిక్‌లు అనొద్దు.
-ప్రపూర్ణ, హైదరాబాద్
అల్లుళ్ల అల్లరే
ఆడియన్స్‌ని గురిపెట్టి సినిమాని వదలగల నిర్మాత దిల్ రాజు తెగ ఆనందపడిపోతున్నాడు. సంక్రాంతికి అల్లుళ్లను తీసుకొచ్చి అల్లరి చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం సూపర్ సక్సెస్ అవ్వడమే అందుకు కారణం. విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల కాంబోలో వచ్చిన ఎఫ్-2 వందకోట్ల క్లబ్‌కు చేరిపోతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి బాగా తెరకెక్కించాడు. మొగుడు పెళ్లాల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలను ఏవిధంగా పరిష్కరించుకోవచ్చో ఈ చిత్రం ద్వారా ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు. జనానికి ఈ పాయింట్ బాగా కనెక్టవ్వడం, చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లు తమ టాలెంట్‌ను చూపటంతో ‘సినిమా అంటే ఇదిరా’ అనిపించింది. ఏ సినిమాను చూడాలో, ఏ సినిమాను తిప్పికొట్టాలో ఆడియన్స్‌కి బాగా తెలుసు మరి.
-బికె చారి, హైదరాబాద్
ఇదేంటండీ.. బాబూ
రచయిత రాసిన సన్నివేశానికి అనుగుణంగా -హీరో పాటేసుకుంటాడు. హీరోయిన్ రెచ్చిపోయి డ్యాన్స్ చేసేస్తూ పరవశురాలైపోతుంది. అంతే -ఎక్కడనుంచో మంద ప్రత్యక్షమైపోతుంది. గ్రాండియర్. కొద్దిసేపటికే హీరో వందల మందిని గాల్లోకి ఎగరేసి తంతాడు. విలన్ల తాట తీస్తాడు. ఆ క్రమంలో పర్వతాలు పిండైపోవచ్చు. ఈఫిల్ టవర్లు సైతం పిడిగుద్దుకు కూలిపోవచ్చు. ఇదీ సూపర్ ఫైట్ ఎపిసోడ్. ఈ అసహజం లేకుండా తెలుగు సినిమాలు రావా? తీయలేమా? పాత చిత్రం పేరు చెబితే కథ గుర్తుకురావడానికి, కొత్త సినిమా వంద టైటిల్స్ స్మరించుకుంటే ఒకే సినిమాలా అనిపించడానికి కారణంమదే.
-త్రిపురారి, వక్కలంక
ఆయన నాగరాజు
కె సుబ్రహ్మణ్యం ‘సంపూర్ణ రామాయణం’ గురించి రాస్తూ ‘సౌమిత్రి’గా రామకృష్ణ నటించినట్టు రాశారు. కానీ లక్ష్మణుడి పాత్ర వేసింది నాగరాజు. ‘లవకుశ’ చిత్రంలోని బాల నటుల్లో ఒకరు. తరువాత ఆయన ఒకట్రెండు చిత్రాల్లో కనిపించారంతే. బయోపిక్‌ల గురించి ఎక్కువ కథనాలు ప్రచురితమవుతున్నాయి. మంచి సమాచారమే అందుతుంది. నరేష్‌తో ఆమధ్య రఘుపతి వెంకయ్య బయోపిక్ తీశారు. అదీ త్వరలో విడుదలకానున్నట్టు తెలిసింది. కన్నడ, మలయాళం, ఒరియా, భోజ్‌పురిల్లోనూ బయోపిక్‌లు మొదలైతే సినిమా తీసే అన్నీ భాషల్లోనూ బయోపిక్‌లు వచ్చినట్టే అవుతుంది.
-టిఎస్ ఎడ్డి, తిరుపతి
రొటీన్ స్టయల్
సినిమా ఛాన్సులు తగ్గగానే ఎవ్వరికైనా చూపుమళ్లేది రాజకీయాలవైపే. హాస్య నటులూ అందుకు తక్కువేం కాదు. సినిమాలు తగ్గుముఖం పట్టగానే బాబూమోహన్ తెదేపాలో చేరి ఎమ్మెల్యే అయ్యాడు. ప్రజలకు ఎంత సేవ చేశారో తెలీదుగానీ, చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఆయన పేరు అప్పుడప్పుడూ వినిపిస్తోంది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వి కూడా రాజకీయాల్లో పదవులు కోరనుగానీ, వైకాపా తరఫున ప్రచారం చేస్తానంటున్నాడు. మరో హాస్యనటుడు వేణుమాధవ్ రాజకీయాలపై ఆశలు పెట్టుకున్నా ఏ పార్టీ అతనికి టిక్కెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆలీ మాట వినిపిస్తోంది. మొదట జగన్‌ని, తర్వాత చంద్రబాబు, పవన్‌లను కలిశాడు. మైనారిటీ కోటాలో టిక్కెట్టిచ్చే పార్టీలో చేరుతానన్నాడు. ఆలీకి సినిమాలు తగ్గినా టీవీ షోస్‌లో బిజీగానే ఉన్నాడు. తరువాత అవీ తగ్గొచ్చు కనుక రాజకీయాలవైపు చూస్తున్నాడు. మైనారిటీ కోటాలో మంత్రి కావాలన్నది ఆలో ఆశ.
-పైడిపంతులు, శ్రీనగర్