మీ వ్యూస్

మెత్తని స్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీసినవి తక్కువే అయినా, చెక్కు చెదరని సినిమాలు తీశాడు రాజీవ్ మీనన్. ఆ విషయాన్ని ‘సర్వం తాళమయం’తో మరోసారి రుజువు చేశాడు. పదిహేడేళ్ల గ్యాప్ తరువాత మెగాఫోన్ పట్టుకున్నా, సన్నివేశాన్ని నడిపించటంలోని సున్నితత్వం ఏమాత్రం దెబ్బతినకుండా ‘సౌవర్ణ శోభిత సంగీతం.. వర్ణ వైషమ్యాలకు అతీతం’ అన్న పాయింట్‌ను అద్భుతమైన కథగా చెప్పటం అతని ప్రతిభకు తార్కాణం. కథ కొత్తది కాకున్నా, కథనంలో కొత్తదనంతో పట్టుచూపించటం బావుంది. అన్నీకాకున్నా ఇలాంటి చిత్రాలు దక్షిణాది పరిశ్రమలో అప్పుడప్పుడూ రావడం ఒకింత ఆనందం, అభినందనీయం. కమర్షియల్ చట్రంలో ఇరుక్కున్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు -సమాజానికి ఏమాత్రం ఉపయుక్తం కాని సినిమాలు వినోదం పేరిట ఆడియన్స్ మీదకు రుద్దుతున్న తరుణంలో మీనన్‌లాంటి దర్శకులు సంస్కృతీ, సంప్రదాయాన్ని కొద్దిగానైనా గుర్తు చేసే సినిమాలు తెస్తుండటం చాలా సంతోషం.
-తల్లావఝుల కిరణ్, పాలకొల్లు
వరుస హిట్ల
హీరోలు ఎక్కడ?
ఒక్క హిట్టు కోసం తహతహలాడుతున్న హీరోల సంఖ్య టాలీవుడ్‌లో తక్కువేంకాదంటూ గతవారం వెనె్నలలో ప్రచురించిన కథనం ఓకే. కాకపోతే, ప్రతిసారీ హిట్టుకొడుతూ వచ్చినోడే హీరో అన్న కోణంలోనే ఆడియన్స్ చూస్తున్నారు. ఒక సినిమా హిట్టుపడి, మరో సినిమా డిజాస్టరైతే ఆ హీరో కథ మళ్లీ మొదటికొచ్చినట్టే. హిట్టు ఫ్లాపుల్ని లెక్కలేసుకోకుండా ఆడియన్స్‌ని ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్ చేస్తూ కెరీర్ సాగించేవాడే సిసలైన హీరో అన్నది టాలీవుడ్ ఆడియన్స్ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే -రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్టైన తరువాత వినయ విధేయ రామ డిజాస్టర్‌గా మిలగడంతో రామ్‌చరణ్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. స్టార్ హీరో కనుక -సినిమాకేం కొదువుండక పోవచ్చు. డేట్స్ ఇవ్వాలేగానీ, మరో ప్రాజెక్టును నెత్తినేసుకోడానికి నిర్మాతా ముందుకు రావొచ్చు. కానీ, ప్రాజెక్టు పూరె్తైన తరువాత మార్కెట్‌కు వచ్చేముందు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. రంగస్థలం విడుదలకు ముందు టెన్షన్ పడిన రామ్‌చరణ్, వినయ విధేయరామ విడుదల టైంలో రిలాక్స్‌డ్‌గా ఉన్నాడు. ఎందుకంటే -రంగస్థలానికి ముందు బ్రూస్‌లీ డిజాస్టర్. ధ్రువ యావరేజ్. కానీ, వివిఆర్‌కు ముందు రంగస్థలం బ్లాక్‌బస్టర్. వాటి ఇంపాక్టే అదంతా. అర్జున్, నాని, సాయిధరమ్, రవితేజ, చైతూ.. హీరో ఎవ్వరైనా -ఈ ఇంపాక్ట్ ఆయా స్థాయిలను బట్టి అలానే ఉంటుంది. ఏమంటారు?
-కార్తీక, ముదినేపల్లి
గొప్పవాడు ఏచూరి
గతవారం వెనె్నలలో ‘ఆనాటి హృదయాల’ ‘నడిచే సినిమా’ పేరిట ప్రచురించిన వ్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. భారీవ్యయంతో చిత్రాల నిర్మాణంపై నాగిరెడ్డి, రామానాయుడు సంభాషణ ఆసక్తిగా చదువుకున్నాం. వెయ్యి సినిమాలతో అనుబంధమున్న ఏచూరి చలపతిరావు అంతరంగం ఆకట్టుకున్నది. యాభై, అరవైల్లో ఏచూరి, కాగడా శర్మల నిష్పాక్ష సమీక్షల కోసం సినీ పెద్దలు, వర్థమాన నటులు ఆత్రంగా ఎదురు చూసేవారు. తేడాకొడితే బెదిరింపులు ఏదుర్కొనే వారు. కాగడా పత్రిక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేది. ఆ పత్రిలో ప్రశ్నలు- సమాధానాల కోసం యువత ఎగబడేవారు. విజయబాపినీడు, పరుచూరి బ్రదర్స్ ప్రశ్నలు క్రేజ్‌నిచ్చేవి.
-టిఎస్‌ఎన్ మూర్తి, వైజాగ్
కొంచెం విపులంగా..
రోజువారీ రాశిఫలాలు అందించటంలో ఎప్పటినుంచో ఆంధ్రభూమి పత్రికకు ఓ ప్రత్యేకత ఉంది. చిరకాల పాఠకులుగా ఆంధ్రభూమిలోని రాశిఫలాలే చదువుకుంటాం. అయితే, వెనె్నల సంపుటి ఇచ్చే ఆదివారం కూడా రాశిఫలాలను చాలా రొటీన్‌గా ఇస్తున్నారు. గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి అందిస్తున్న రాశిఫలాలలను ఆ ఒక్కరోజూ కాస్త విపులంగా అందించే ఏర్పాట్లు చేయగలరు. ఇక రచయిత్రి రాణీప్రసాద్ అందిస్తున్న సినిమా క్విజ్ బావుంటుంది. ఆసక్తికరమైన ప్రశ్నలు వేయడమే కాకుండా, సినిమా పరిజ్ఞానాన్ని ఇనుమడించే ప్రశ్నలతో క్విజ్ రూపొందించటం అభినందనీయం. పాఠకులకు ఆసక్తి కలిగించే మరిన్ని శీర్షికలు ప్రచురించగలరని మనవి.
-డి భ్రమరాంబ, ఐనవోలు
నాకు నచ్చని..
ప్రతి ఆదివారం అందిస్తున్న వెనె్నల సంపుటం సినిమా విశేషాలతో ఆనందాన్నిస్తోంది. అయితే, చాలాకాలంగా నడిపిస్తున్న నాకు నచ్చిన సినిమా, నాకు నచ్చిన పాట శీర్షికల్లో పాత చిత్రాలకే ఎక్కువ ప్రాముఖ్యత నిస్తున్నారు. గొప్ప చిత్రాలను ఒక్కసారి గుర్తు చేసుకునే అవకాశం కలుగుతున్నా, కొత్త చిత్రాలకూ ఒకింత ప్రాధాన్యత ఇస్తే బావుంటుందనేది మా అభిప్రాయం. నిజానికి స్వర్ణయుగపు సినీ సారాన్ని ‘నచ్చిన’ అంశాలుగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ కాలపు నచ్చని సినిమాలు ఒకటో రెండో ఉంటాయి తప్ప, అన్ని సినిమాలూ బావుంటాయి కనుక. అందుకే, కొత్త శీర్షికను మొదలుపెట్టి ఈ కాలంలో వస్తున్న ‘నాకు నచ్చని సినిమా’, ‘నాకు నచ్చని పాట’ శీర్షికను కొద్దికాలం నిర్వహిస్తే బావుంటుందేమో. ఏమంటారు?
-వి శ్రీనివాస్, పాలకొల్లు
నేములో’నేముంది!
పేరులో ఏముందిలే అనుకుంటాంగానీ -ఒక్కోసారి టైటిలే సినిమాకు ప్రాణం పోస్తుంది. ఆ సినిమాకు వెళ్లాలన్న ఆసక్తి ఆడియన్స్‌లో క్రియేట్ చేస్తుంది. కొద్దికాలం క్రితం వరకూ రెండక్షరాల టైటిళ్లు, ఇంగ్లీష్ టైటిళ్ల జాడ్యం టాలీవుడ్‌ని పట్టి పీడించింది. ఇటీవలి కాలంలో ధోరణి మారింది. గత ఏడాదిలో మంచి టైటిల్స్‌తో ఎన్నో చిత్రాలొచ్చాయి. వాటిలో బ్లాక్‌బస్టర్లూ, డిజాస్టర్లూ లేకపోలేదు. అయితే, టైటిల్స్ మాత్రం అచ్చ తెనుగుతో ఆనందాలు నింపాయి. అజ్ఞాతవాసి, భరత్ అను నేను, రంగస్థలం, అరవింద సమేత వీరరాఘవ, గీతగోవిందం, మహానటి, భాగమతి, తొలిప్రేమ, మనసుకు నచ్చింది, అమ్మమ్మగారిల్లు.. ఇత్యాధి టైటిల్స్ మనసుకు హాయిగొలిపేలా అనిపించాయి. అయితే వీటిలో అధికశాతం అనూహ్యంగా విజయాలు అందుకున్నవే ఎక్కువ. కొన్ని చిత్రాలు పోయినా, టైటిల్ ఇంపాక్ట్ మాత్రం చూపించాయని చెప్పక తప్పదు.
-మల్లెల సుబ్రహ్మణ్యం, పెనుగొండ