మీ వ్యూస్

ఇంతేనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాది ఆరంభంలో పండుగ సీజన్. వచ్చేది వేసవి సీజన్. ఈ సీజన్లను పెద్ద చిత్రాలు ఆక్రమించటంతో -్ఫబ్రవరి, మార్చి నెలల్లో చిన్న సినిమాలు థియేటర్ల వద్ద వరుస పెడుతున్నాయి. అయితే, వీటిలో ఏ ఒక్క చిత్రమూ ప్రేక్షకుల సినిమా ఆకలిని సంతృప్తిపర్చలేకపోయింది. మార్చి నెలనే తీసుకుంటూ కల్యాణ్‌రామ్ 118 ఏదో ఫరవాలేదు అనిపిస్తే, బొట్టు, మ్యాగ్నెట్, వేరీజ్ వెంకటలక్ష్మి, బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్.. ఇలా రకరకాల పేర్లతో సినిమాలు వచ్చినా -ఏ ఒక్కటీ ‘యావరేజ్’ గేట్‌ను కూడా దాటలేకపోయాయి. చిన్న సినిమాల ప్రదర్శనకు అవకాశం రావడం లేదంటూ గగ్గోలు పెట్టడమే తప్ప, వచ్చే సినిమాలు ఏఒక్కటీ వినోదాత్మకంగా లేకపోవడం బాధాకరం. అట్టహాసంగా సినిమాలు తీయకపోయినా, అందమైన కథలు, మామూలు ఆర్టిస్టులతో సినిమా తీస్తే -కనీసం ఆడియన్స్ గౌరవించి చిన్న సినిమాను బతికిస్తారేమో.
-పి మోహన, కైకరం
అది తప్పు
మార్చి 3, 2019 వెనె్నల అనుబంధం నాకు నచ్చిన సినిమా శీర్షికకు గుడివాడ నుంచి జి బలరాముడు రాసిన లేఖలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ గురించి రాయడం బావుంది. కాకపోతే ఆ చిత్రానికి సంగీత దర్శకుడి పేరు రామానంద్ సాగర్ అని రాశారు. తప్పు, ఆ చిత్రానికి సంగీతం సమకూర్చినది రవీంద్ర జైన్. గమనించగలరు.
-టి తురాబుద్దీన్, ఎమ్మిగనూరు
హృదయానంద ముచ్చట్లు
వెనె్నల బ్యాక్‌పేజీ కథనాలు ఆసక్తికరంగా, ఆప్యాయంగా అనిపిస్తున్నాయి. ఓపక్క రచయిత ఇమంది రామారావు ‘ఆనాటి హృదయాల’ ముచ్చట్లు, మరోపక్క రచయిత సరయు శేఖర్ ‘తెరమరుగు తారల’ కథనాలు.. ఓహ్ బ్యాక్‌పేజీకి కొత్త సొబగులు అద్దుతున్నాయనే అనిపిస్తుంది. విడుదలవుతున్న చిత్రాల సమీక్షలు వెనె్నల నిష్పాక్షికతను తేటతెల్లం చేస్తుంది. ముఖచిత్రంగా ప్రచురిస్తున్న విమర్శల కథనాలూ బావుంటున్నాయి. మొత్తంగా ఆదివారం వెనె్నల పాఠకుల ప్రేమాభిమానాలు చూరగొంటోంది. నచ్చిన సినిమాలు, నచ్చిన పాటల్ని అందిస్తున్నట్టుగానే గొప్ప సినిమాలకు ప్రాణం పోసిన దర్శకులు, సాంకేతిక నిపుణుల పనితీరునూ కొత్త శీర్షికల రూపంలో అందిస్తే ఆనందిస్తాం. ధన్యవాదాలు.
-జి బ్రమరాంభ, మచిలీపట్నం
ప్రలోభం కాదా?
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా దర్శకుడు ఓమంగ్ కుమార్ తెరకెక్కించిన ‘పీఎం నరేంద్ర మోదీ’ విడుదలపై ఆసక్తి పెరుగుతోంది. మోదీ పాత్రలో నటుడు వివేక్ ఒబెరాయ్ అచ్చుగుద్దినట్టు లేకున్నా, ఈమధ్య విడుదలైన ట్రైలర్‌లో మోదీ హావభావాలను పలికించిన తీరుకు మెచ్చుకోలు ఇవ్వాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, ప్రధాని హోదాలోవున్న వ్యక్తి జీవితకథగా ఈ సినిమాను విడుదల చేస్తే -అది ఓటర్లపై ప్రభావం చూపదా? అలా ఓటర్లను ప్రలోభపెట్టినట్టు కాదా? ఇలా మొదలైన ప్రలోభ చర్య వచ్చే ఎన్నికల్లో శృతిమించి ప్రతి నాయకుడూ ఓ సినిమాతో ప్రజలపై పడితే పరిస్థితి ఏమిటి?
-బీజీ కమలాకర, నిడదవోలు
ఏదీ సంస్కారం
తెలుగు సినిమాలు శ్రుతిమించుతున్నాయి. అశ్లీలతను చూపిస్తూనే -దానికి అందమైన పేర్లుపెట్టి అశ్లీలతకాదని నమ్మించేందుకు ప్రచారాస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. వ్యాపకాలు పెరిగిపోయి అధికశాతం జనం మానసిక వత్తిళ్లకు తలొగ్గుతున్న ఆధునిక రోజుల్లో -అశ్లీలతను ఆస్వాదించేందుకు వెంపర్లాడుతోన్న వైనమే కనిపిస్తోంది. ‘ముద్దు’ అన్న పదానే్న తెరపై ప్రస్తావించేందుకు వందసార్లు ఆలోచించేవారు ఒకప్పటి దర్శకులు. ఇప్పుడొస్తున్న చిత్రాల్లోనైతే మూతులు రెండూ ముడేసే ఉంచుతున్నారు. ఎక్కడి తెలుగు సినిమా ఎక్కడికి చేరింది? ఇంకెక్కడికి జర్నీ చేస్తుందన్న భయానక అనుమానాలు బలపడుతున్నాయి. ఈతరానికి ఇదేమీ పట్టే విషయం కాకపోవచ్చు. కాకపోతే, మాలాంటి ఒకప్పటి తరం ఇప్పటి సినిమా సన్నివేశాలను చూసి బాధపడటం వినా ఏం చేయలేని నిస్సహాయ స్థితి. కాలానుగుణంగా మార్పులు సహజమేకానీ, ఆ మార్పులు పెడధోరణులవైపు పరుగులు పెట్టడం నిజంగా బాధాకరం.
-కెఎన్ పెద్దిరాజు, పాలకొల్లు
సిగ్గుపడాలి
ఒక దేశాన్ని కించపరచడానికి లేదా ఒక దేశ రాజకీయ, సాంఘిక వ్యవస్థల్ని ఘోరంగా విమర్శిస్తూ నెగెటివ్‌గా ఉండే రచనలు, సినిమాలకే అవార్డులొస్తాయని ఆస్కార్, నోబెల్ శాంతి, సాహిత్య అవార్డులపై ఒక విమర్శ ఉంది. భారతీయ నిర్మాత ఇరాన్‌కు చెందిన మహిళ దర్శకత్వంలో నిర్మించిన ఒక చిన్న డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించగానే మన మీడియా ఉబ్బితబ్బిబ్బుఅయి చంకలు గుద్దుకుంది. భారతీయ గ్రామీణ బాలికలను ఇంటర్వ్యూచేస్తూ వారికి రుతుస్రావం అంటే తెలీదు. దాని గురించి మాట్లాడడానికి సిగ్గుపడతారు. చాలామంది అదొక రోగం అనుకుంటారు. వాళ్లకి ప్యాడ్‌లు అంటే తెలీదు. గుడ్డలు, దూది దోపుకొని నానాబాధలు పడుతుంటారు- ఇదీ ఆ డాక్యుమెంటరీ హైలైట్ చేసిన విషయం. అవార్డు వచ్చిందని సంబర పడడానికేముంది? తలలు దించుకోవాలి గాని!
- శాండోప్రచండ్, శ్రీనగర్
ఏచూరి గురించి
3.3.2019 వచ్చిన ‘ఏచూరి’గారిపై వ్యాసం బావుంది. ఆయన రాసిన సమీక్షలు అప్పట్లో మేము ఆసక్తిగా చదివేవాళ్ళం. ‘హరనాథ్’, ‘శోభన్‌బాబు’లపై ఆయన నమ్మకం, నటుడిగా మారటం చాలాబాగా వివరించారు. ‘కాగడా’ పక్షపత్రిక పదిహేను రోజులకొకసారి వచ్చేది. చివరగా చెప్పేదేమిటంటే ఇలాంటి నటీనటులు, టెక్నీషియన్స్ గురించి పరిచయం చేస్తే బావుంటుంది. - టి.సదా, తిరుపతి