మీ వ్యూస్

భయోపిక్కులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్భాటంగా నిర్మించిన బయోపిక్ కథానాయకుడు ఫ్లాప్ అయితే మహానాయకుడు డిజాస్టర్‌గా మిగిలింది. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ విమర్శకుల మెప్పు పొందినా కాసులు రాలలేదు. ఘంటసాల బయోపిక్ నిర్మాణం పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. తక్కువ బడ్జెట్‌తో తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయింది. ఆంధ్రలో విడుదల అయ్యాక కొద్దిపాటి లాభాలు రావచ్చేమో. గొప్ప హిట్ మాత్రం కాదు. చాలాకాలం క్రితం వచ్చిన ప్రకాశం పంతులు, అంబేద్కర్ బయోపిక్‌లు పెద్దగా ఆడలేదు. దీంతో టాలీవుడ్‌కు బయోపిక్‌లు కలిసి రావేమోననిపిస్తోంది.
- ధర్మతేజ, గొడారిగుంట
మహానుభావుడు ఎన్టీఆర్
మహా నటుడు ఎన్టీఆర్ ‘రావణాసురుడు’ పాత్రకు ప్రాణ ప్రతిష్టచేసి అద్భుతమైన నటనతో మెప్పించి, దర్శకుడు కెవి రెడ్డి, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ లాంటి వారి ప్రశంసలు పొందటంతోపాటు, కంచి కామకోటి పీఠాధిపతులు ఆశీస్సులు పొంది ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌము’నిగా ఖ్యాతిగడించారు. దర్శక ప్రతిభ, సాహిత్య, సంగీతాలు కలబోసిన తెలుగుజాతి సంస్కృతి, సంప్రదాయాలు గౌరవించినంత కాలం ‘సీతారామ కళ్యాణం’ దృశ్యకావ్యంగా నిలిచిపోతుంది అనటంలో సందేహం లేదు!
‘సీతారామకళ్యాణం’ చిత్ర విశేషాలతో తెలుగువారి లోగిళ్ళలో ‘సీతారామకళ్యాణం’ వైభోగం వీక్షించిన దివ్యానుభూతిని కల్గించిన 14-4-19నాటి వెనె్నలలోని ‘్ఫ్లష్‌బ్యాక్ ఎట్ 50’ శీర్షిక చాలా బావుంది. అభినందనలు.
-ఉప్పు సత్యనారాయణ, తెనాలి
చిన్న పొరబాట్లు
వెనె్నల ఏప్రిల్ 14నాటి సంచికలో సీవీఆర్ మాణిక్యేశ్వరి ఎన్‌ఏటివారి ‘సీతారామకల్యాణం’ చిత్రం గురించి విపులంగా వ్రాశారు. కాకపోతే మధ్యలో కొన్ని పొరపాట్లు దొర్లాయ. దశావతారాల వర్ణనలో జ్యోతి (నృత్యం), ఘంటసాల పాడిన ‘జయగోవింద మాధవ దామోదరా’ పాటను ‘జయజగదీశహరే’గా వ్రాశారు. రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణం, దర్శకత్వం వహించిన ‘లవకుశ’ అని ప్రస్తావించారు. కాని ‘లవకుశ’ చిత్రానికి పిఎల్ రాయ్ ఛాయాగ్రాహకులు. ఇక రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రాహకుడిగా ఎన్టీఆర్‌తో చివరి చిత్రం ‘వరకట్నం’. ‘కురుక్షేత్రం’ సినిమాకు ట్రిక్ ఫొటోగ్రాఫర్‌గా చేశారు. తర్వాత హిందీ చిత్రసీమలో ప్రవేశించి పలు చిత్రాలకు ఫొటోగ్రాఫర్‌గా, దర్శకునిగా రాణించారు. ఈ విషయాలను గమనించలగరు.
-ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
అర్థంకాని ఐరా
తొలిసారిగా నయనతార ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘ఐరా’. థ్రిల్లింగ్, హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయనుకుని థియేటర్‌కి వెళ్లినవాళ్లకు నిరాశే ఎదురయ్యింది. సినిమా అంతా పిచ్చిపిచ్చిగా వుంది. రెండో పాత్రయిన ‘్భవానీ’ ఆ రివైంజ్ తీర్చుకోవటమేమిటో ప్రేక్షకులకు బొత్తిగా అర్థంకాదు. అసలు పగ తీర్చుకోవటానికి సరైన కారణాలు లేక వెగటు పుట్టించింది ‘ఐరా’ సినిమా. సన్నివేశాలు మాత్రం అతుకుల బొంతలా వస్తుంటాయి, వెళ్తుంటాయిగానీ ఎక్కడా ఉత్సుకత అనేది కనిపించదు. మొత్తానికి ‘ఐరా’ బోర్ కొట్టించింది.
- వి వెంకటరమణ, గొల్లలవలస
వ్యాసం బావుంది
‘హీరోలకే హీరోలు’వ్యాసం బాగుంది. ప్రేక్షకులు నానుండి ఎలాంటి సినిమాలు ఆశిస్తారో అవే చేస్తానని నాగచైతన్య చెప్పాడు. కాని తమకేం కావాలో ప్రేక్షకులకే తెలీదు. ఒక్కోసారి సెంటిమెంట్‌కి పెద్దపీట వేస్తారు. ఒక్కోసారి ఫైటింగులు విరగబడి చూస్తారు. బాహుబలిలా గ్రాండియర్‌గా ఉంటే మెచ్చుకుంటారు కొంతకాలం. వట్టి పోరంబోకు బాధ్యతారహితుని హీరోగా చలామణి చేశారు కొంతకాలం. ఆ మోజు కొంతకాలమే. మరికొంత కాలం యాంటీ సెంటిమెంట్ రాజ్యం ఏలింది. కొంతకాలం కామెడీ చిత్రాలదే హవా. ఎప్పుడు ప్రేక్షకుడికి ఏం నచ్చుతుందో ఆ బ్రహ్మదేవుడూ చెప్పలేడు.
-గిరిధర్, కాకినాడ
మంచి మజిలీ
‘శివ నిర్వాణ’ దర్శకత్వంలో వచ్చిన ‘మజిలీ’చిత్రం చాలా నచ్చింది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, పోసాని, రాధ రమేష్‌లు అత్యద్భుతంగా నటించి మెప్పించారు. ప్రేక్షకాభిమానులను ఎస్.ఎస్.తమన్ నేపథ్య గీతం గోపీసుందర్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచాయి. ప్రియతమా పాట సూపర్. మాటలు లొకేషన్స్ ముచ్చట గొల్పాయి. ఈ వారం రిలీజైన చిత్రాల్లో మంచి చిత్రమని చెప్పుకోవచ్చును.
-సిహెచ్ సాయిమన్విత, హైదరాబాద్
నచ్చనవి ఇస్తే..
నాకు నచ్చిన సినిమా, నాకు నచ్చిన పాట స్థానంలో నాకు నచ్చని సినిమా, నాకు నచ్చని పాట అన్న సూచన బాగుంది. వీలైతే నాకు నచ్చిన, నచ్చని అన్నవి రెండూ ప్రక్కప్రక్కన ప్రచురిస్తే ఎలాగుంటుంది? వెనె్నల సంచికలో వస్తున్న శీర్షికలు బావుంటున్నాయ. అయతే ప్రస్తుతమున్న శీర్షికలు చాలాకాలంగా రన్ చేస్తున్నవే. అందుకే, కొత్త శీర్షికలు ప్రవేశపెట్టి పాఠకులకి అవకాశం కలిగిస్తే బావుంటుందేమో.
-త్రివిక్రముడు, వక్కలంక
ఎన్టీఆర్ మెచ్చిన అందగాడు
ఫ్లాష్‌బ్యాక్ ఎట్ 50 శ్రీ సీతారామకళ్యాణం గురించి వ్యాసం బావుంది. ఆ చిత్ర శ్రీరామ పాత్రధారి హరనాథ్ అప్పటికే ముక్కామల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఋష్యశృంగ’లో నటించిన విడుదలైంది మాత్రం ‘నవశక్తి’వారి మా యింటి మహాలక్ష్మి చిత్రాల్లో నటించారు.
ఆరడుగుల ఎత్తు, పైగా అందగాడు చూడగానే ఇట్టే ఆకర్షించగల ముఖవర్చస్సు ఎన్టీఆర్ గారిని ఆకర్షించి శ్రీరాముని పాత్ర ఇచ్చారు. ఆ తరువాత ఆయన వెనుదిరిగి చూడలేదు. కానీ కొన్ని స్వయందోషాలవలన మాత్రమే ఆయన వెనుకబడిపోయారు. అవకాశాలు అప్పటికీ వస్తున్నప్పటికీ అప్పటికీ చాలా ఆలస్యమైపోయింది. ఆయన మనకు దూరమైపోయారు.
- టి.సదా, తిరుపతి