మీ వ్యూస్

ఏప్రిల్ ' పుల్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఏడాది ఆరంభం నుంచీ కుంటుకుంటూ నడుస్తున్న తెలుగు సినిమాకు -ఏప్రిల్ నెలలో పూనకం వచ్చినట్టే కనిపిస్తోంది. గత మూడు నెలల్లో చెప్పుకోడానికి ఎఫ్-2 తప్ప ఒక్క సినిమా కూడా లేదు. కానీ, ఏప్రిల్‌లో మాత్రం మూడు సినిమాలు గొప్ప విజయాలు సాధించి పరిశ్రమకు కొత్త ఊపునిచ్చాయి. ఏప్రిల్ తొలివారంలో చైతూ-సమంత జంటగా వచ్చిన మజిలీ సూపర్ అనిపించుకుంటే, రెండోవారంలో తేజు-కిషోర్ తిరుమల కాంబోలో వచ్చిన చిత్రలహరి ‘వావ్’ అనిపించుకుంది. అంతేకాదు, తేజు ఫ్లాపులకు బ్రేకువేసింది. ఇక మూడోవారంలో నాని, శ్రద్ధాశ్రీనాథ్‌లు జంటగా వచ్చిన ‘జెర్సీ’ -్థయేటర్లలో క్రికెట్ ఆడేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కట్టిపడేసిన సినిమా నాని కెరీర్‌కు బ్లాక్‌బస్టర్‌ని యాడ్ చేసింది. చివరివారంలో వచ్చిన చిన్నాచితకా సినిమాలు డింకీకొట్టినా -అవెంజర్స్ ఎండ్‌గేమ్ మాత్రం థియేటర్లను కళకళలాడించింది. మొత్తానికి ఈ ఏడాది పరిశ్రమను ఏప్రిల్ ‘్ఫల్’ చేసింది.
-ఎం రాఘవ, కీసర
సినిమా దారెటు!?
ఓనాటి తెలుగు సినిమా కీర్తిపతాక వైభవం. రానురాను మారుతున్న సినిమా మార్పు ఆశించదగ్గదే. కానీ నేటి సినిమాలు చూస్తుంటే పరమ చిరాగ్గా వెర్రెత్తిపోతోంది. యువతను టార్గెట్ చేసి వస్తున్న సినిమాలు బూతును సర్వాంగ సుందరంగా చూపిస్తున్నారు. ఇదెంత సమంజసం!? అలాంటి సినిమాలను సెన్సార్ అనుమతించకూడదు. సినిమా అంటే సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా వుండాలి. సినిమా అంటే పదిమందికి వినోదం పంచాలి. వీలైతే ఏదైనా సందేశం అందించాలి. అంతేకాని మూడు కిస్సులు- ఆరు కౌగిలింతలు అందించకూడదు. ఈ విషయంలో దర్శక నిర్మాతలే కాదు, నటీనటులూ బాధ్యత వహించాలి. మంచి సినిమాలు తీయాలి. మంచిని పంచాలి. దారి తప్పుతున్న తెలుగు సినిమా వైభవాన్ని దారిమళ్లించే బాధ్యత మనందరిది.
-కురువ శ్రీనివాసులు
దటీజ్ సామ్..
అమ్మ అన్నది కమ్మని మాట. కమ్మని కావ్యమంటూ స్క్రీన్‌మీద అమ్మ గొప్పదనం గురించి ఘోషించే తారలకే -అమ్మకావటం ఇష్టం ఉండటం లేదు. అందుకే పెళ్లిని వాయిదా వేస్తుంటారు. అమ్మ అయిపోతే ఛాన్సులురావు. వచ్చినా తల్లి, అత్త, వదిన లాంటివే వస్తాయి. అయితే, అమ్మ అవటం గురించి సమంతని ఆమధ్య ఓ విలేఖరి ప్రశ్నిస్తే ‘అందరు అమ్మల్లాగే ఉంటాను. నా టైమంతా పిల్లలకే కేటాయిస్తా. హీరోయిన్ పాత్రలకు గుడ్‌బై చెప్పేసి, పూర్తిస్థాయి గృహిణిగా మారిపోతా’ అన్నది, ఏమాత్రం సంకోచం లేకుండా, గ్రేట్ కదూ.
-చైతన్య, వాకలపూడి
ఏది కలుషితం?
చరిత్రను కలుషితం చేయొద్దన్న లేఖ చదివాక- అసలు మనం స్కూళ్లలో చదివింది, నమ్మింది బ్రిటిష్‌వాళ్లు కలుషితం చేసిన చరిత్రనే అని గుర్తుకొస్తోంది. అలెగ్జాండర్‌ని విశ్వవిజేత, గ్రీకువీరుడు అని పొగడుతాం. కాని అతగాడు కేరళకన్నా చిన్నవైన 3, 4 అరబ్ దేశాల్ని, పెద్ద దేశమైన మనవద్దకొచ్చి ఓడిపోయాడు. అల్లూరి సీతారామరాజు అంటాం. కాని ఆయన జీవితంలో సీత లేదు. ఆయన అల్లూరి రామరాజు మాత్రమే. ఒకే సమయంలో దూరదూరంగా ఉన్న రెండు పోలీసు స్టేషన్లపై ఆయన దాడిచేసినట్టు నమ్ముతాం. కాని సాధ్యంకాదు కదా. కొమరం భీంగురించి ఎవరికీ పెద్దగా ఏమీతెలియదు. వారిని దిగజార్చకుండా ఉన్నతంగా చూపేందుకు కొంత కల్పన జోడించినా ఫర్వాలేదు. కలుషితం అన్న పెద్ద పదం వాడక్కర్లేదేమో.
-శాండో ప్రచండ్, శ్రీనగర్
తప్పేముంది..?
అప్పట్లో అలా -లేఖ చదివాక శతాబ్దాల క్రితం స్ర్తిలు అజ్ఞానం, అవిద్యలతో అలమటించే రోజుల్లో ఋతుస్రావాన్ని భయంకరంగా ఊహించుకునేవారు. పెద్దలువారిని వేరే గదిలో ఉంచి ఇతరులను తాకరాదు అనేవారు. కాని ఇప్పుడు స్ర్తిలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. చెమట, మూత్రంలాగానే ఋతుస్రావం విసర్జకం అని గ్రహించి ప్యాడ్‌లు ఉపయోగిస్తూ పనిపాటలు చేసుకుంటున్నారు. అది కళామతల్లిపట్ల అమర్యాదకర వ్యవహారం కాదు. అందరి దృష్టిలో సినిమా ఒక వ్యాపారం, ఋతుస్రావం కూడా ప్యాడ్ల వ్యాపారం. ఋతుశ్రావ కాలంలో సినిమాల్లో నటించడం తప్పుకాదు.
-స్నేహమాధురి, పెద్దాపురం
భలే గుర్తుచేశారు
పాత సినిమాలు, పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయనే నేను వెనె్నల చూసేది. అద్దంకి నుంచి పియల్ సజాత ‘మంచిని పెంచాలి’ సినిమా గురించి బాగా రాశారు. ‘తల్లాపెళ్లామా’ చిత్రం నుంచి శ్రీ్ధర్, ‘స్వర్గం- నరకం’ చిత్రంనుంచి ఈశ్వరరావు, హరిబాబు మొదటి చిత్రం తెలీదు కానీ ‘మా ఇంటి దేవుడు’ సినిమానుంచి ఆయన తెలుసు. హైదరాబాదులో ఎస్‌ఐగా వుంటూ హీరోగా సినిమా అవకాశాలు రావడంతో ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి వచ్చారు. వీరిలో శ్రీ్ధర్ ఇప్పుడు లేరు. ఈశ్వర్‌రావు కొన్ని టీవీ సీరియల్స్‌లో కనిపించారు. సూరిబాబు గురించి ఇప్పుడేమీ తెలియదు. ఒక మంచి సినిమా గురించి రాసిన సుజాతకు అభినందనలు.
-టి సదా, తిరుపతి
ఎంత నష్టం
షూటింగ్‌లు ఆగిపోయి తిరిగి రీషూట్ చేసి ఆలస్యంగా విడుదలై అపజయం పాలైన చిత్రాలు ఎన్నో. శోభన్‌బాబు -అగ్ని నక్షత్రం, చిరంజీవి -్ధర్యవంతుడు, సుమన్ మమ్ముటి- సూర్యపుత్రులు, మోహన్‌బాబు -నాంపల్లినాగు, ఎన్‌టిఆర్ -ఎవరు దేవుడు, హరనాథ్, కృష్ణ, పద్మనాభం, రామకృష్ణ నటించిన -మా ఇంటి దేవత, విజయలలిత -ఆడదాని సవాల్, రాజశేఖర్ -వేటగాడు, చిరంజీవి -అంజిలాంటివన్నీ ఆ కోవకు చెందినవే. దేవీపుత్రుడు, విజయశాంతి, సత్యభామన్, మృగరాజు, రామ్ సినిమా శివం, నితిన్ కొరియర్ బాయ్, రవితేజ నిప్పు, పవన్‌కళ్యాణ్ జానీ, పోసాని శ్రావణమాసం, సుధీర్ మోసగాళ్లకు మోసగాడు, రామ్‌చరణ్ ఆరెంజ్, మనోజ్ ఒక్కడు మిగిలాడు లాంటి చిత్రాలూ ఈ కోవలోనివే. ఈ చిత్రాలన్నీ నిర్మాతలకు నష్టం మిగిల్చినవే.
-ఎ రఘురామారావు, ఖమ్మం