మీ వ్యూస్

గ్రేట్ కామెరూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైటానిక్‌ని అవెంజర్సే ముంచేశారంటూ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ఎంతో ప్రేమ, సినిమాపట్ల ఆప్యాయత కనిపిస్తుంది. మార్వెల్ సంస్థ నిర్మించిన ‘ఎండ్‌గేమ్’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల దుమారం రేపడంపై ఆయన చేసిన కామెంట్ అద్భుతం. ఓ సినిమా గొప్పతనాన్ని ప్రొఫెషనల్‌గా ప్రశంసించడమంటే ఇదే. అవతార్, టైటానిక్ సినిమా రికార్డులను దాటేసిన ఎండ్‌గేమ్ సక్సెస్‌ను ఆయన చాలా గొప్పగా చెప్పాడు. ‘లైట్‌స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రూ మీ విజయానికి లేచి నిలబడి శాల్యూట్ చేస్తోంది. సినీ పరిశ్రమ సజీవంగానే కాదు, బహు గొప్పగా ఉందన్న విషయాన్ని మీరంతా నిరూపించారు’ అంటూ కామెరూన్ ట్వీట్ చేశాడు. 2.188 బిలయన్ డాలర్లకు పైగా సినిమా వసూళ్లు ఉన్నాయంటే -దాని స్టామినాను అంచనా వేయొచ్చు.
కె పార్వతీ సుధాకర్, రేలంగి
వామన వీరుడే
ప్రతి ఆదివారం వస్తున్న ఆంధ్రభూమి వెనె్నల సంపుటంలో రచయత సరయుశేఖర్ పాత చిత్రాల ఆర్టిస్టులను గుర్తు చేయడం బావుంటుంది. 500 చిత్రాల్లో నటించి పొట్టివీరయ్యగా ప్రేక్షకులకు దగ్గరైన వీరయ్య సినిమా ప్రవేశం, ప్రయాణంపై రాసిన కథనం బావుంది. కత్తివీరుడు కాంతారావు, ఎన్టీఆర్‌తో చేసిన అనేక జానపదాలు, దెయ్యాలు, భూతాల సినిమాల్లోని ఓ తరహా హాస్యానికి వీరయ్య పెట్టింది పేరు. వామన వీరుడిగా పొట్టి వీరయ్యను కుటుంబ ఫొటోలతో గుర్తు చేయడం బాగా నచ్చింది. రచయతకు అభినందనలు. ఇమంది రామారావుగారి ఆర్టికల్స్ ఆనాటి హృదయాలు చాలా బావుంటున్నాయి. ముఖ చిత్ర కథనాలు మంచివి అందిస్తున్నారు. పాత హీరోలు వడ్డే నవీన్, ఆకాశ్, తరుణ్, వేణు తొట్టెంపూడి, నవదీప్ తెరమరుగైపోయారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన వేణు, తరుణ్‌లను కూడా అభిమానులు మరచిపోయారన్న కవర్ పేజీ కథనం బావుంది.
-పీఎస్ నారాయణ, రాజమండ్రి
మాకెంతో ఇష్టం
ఆంధ్రభూమి దినపత్రిక ప్రతి ఆదివారం అందిస్తున్న వెనె్నల పేజీ అంటే మాకెంతో ఇష్టం. 14 ఏప్రిల్ వెనె్నల్లో నటుడు చిరంజీవి గురించి ప్రచురించిన కథనం చదివాం. వ్యక్తిగా ఎదిగినా, ఎన్ని ఉన్నత పదవులు అధిరోహించినా అప్పటిలాగే ఉన్నారనేది తెలుసుకున్నాం. పునాది రాళ్ళు సినిమాకు దర్శకత్వం వహించిన రాజ్‌కుమార్ గురించి తెలుసుకున్నాం.
-వై ఈశ్వరరావు, విశాఖపట్నం
కోపమెందుకు..?
‘మజిలీ’ చిత్రం టీజర్‌లో ‘వెధవలకెప్పుడూ మంచి అమ్మాయిలే దొరుకుతారు’ అన్న డైలాగ్ నాగార్జునకు కోపం తెప్పించిందట. ఎందుకంటే తన కొడుకు చైతూ మంచోడు. అతనికి మంచి అమ్మాయి సమంత దొరికింది కదా అన్నాడు. అయితే గణితశాస్త్రంలో సిద్ధాంతం, విలోమ సిద్ధాంతం అని ఉంటాయి. ఒక్కోసారి సిద్ధాంతం, దాని విలోమం- రెండూ నిజమే అవుతాయి. కొన్ని సందర్భాల్లో సిద్ధాంతం నిజం, దాని విలోమం అబద్ధం అవుతూ ఉంటాయి కూడా. ‘వెధవలకే మంచి అమ్మాయిలు దొరుకుతారు’ అన్నది సిద్ధాంతం అయితే దాని విలోమం ‘మంచి అమ్మాయిలకు వెధవలే దొరుకుతారు’ అన్నది నిజం కాదు. అందువల్ల నాగార్జున కోపగించుకోనక్కరలేదు!
-సత్య, కరప
వినోదముంటే చాలు
‘ఏవీ చైతన్య ఊపిరులు?’ కథనం బావుంది. సమాజాన్ని చైతన్యపరిచేవి, ఉపయోగపడేవి అయిన చిత్రాలు రావాలని రచయిత ఆకాంక్ష సరైనదే. కాని ప్రజలు కోరుకునేవి కాస్తంత వినోదం, రెండు గంటల కాలక్షేపం మాత్రమే. కథలు కాస్తంత ఆలోచింపజేస్తే చాలు. నిజానికి సినిమాలు చూడటం, నవలలు చదవటంవల్ల సమాజం మారిపోదు. స్వాతంత్య్రోద్యమ దేశభక్తి సినిమా చూసి కాసేపు బ్రిటిష్‌వారిని తిట్టుకున్నా ఇంటికి వెళ్లాక బ్రిటిష్, అమెరికా సంస్కృతికి మానసిక బానిసలుగానే వ్యవహరిస్తున్నాం. మాలపిల్ల సినిమా చూసిన కాసేపు ప్రభావితమైనా కులవ్యవస్థ చెక్కుచెదరలేదు. ఎన్నికలు కులపునాదుల మీదనే జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో సినిమా వినోదం మాత్రమే. సంఘ సంస్కరణ కానేకాదు.
-చంపక్, మాధవనగర్
ఆ మాట నమ్మాలా?
దయ్యం చిత్రాలు చేసేవారు, చూసేవారూ దయ్యాలు లేవని చెప్తూనే థ్రిల్‌కోసం అలాంటి చిత్రాలు తీశాం, చూశాం అంటూ ఉంటారు. కాని జంబలకిడి పంబ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి ప్రేమకథా చిత్రమ్-2లో నటిస్తున్న సిద్ధిఇద్నాని దయ్యాన్ని చూశానని చెప్తోంది! ముంబాయిలో ఓ రాత్రి ఫ్రెండ్‌తో కారులో వెళ్తూంటే ఫ్రెండ్‌కి ఫోన్ రావటంతో కారుని ఒక పక్కగా ఆపి ఫోన్ మాట్లాడుతుండగా సిద్ధి ఒక భవనం పైనున్న నీళ్లట్యాంక్‌కి పైభాగంలో తెల్లచీర దయ్యం కనిపించిందట. ఇటు తిరిగి మళ్లీ అటు చూడగా ఆ దయ్యం మాయమైందట. నమ్మేదేనా?
-పూర్ణారావు, కాకినాడ
ఇమంది వ్యాసాలు ఇబ్బందే!
వెనె్నలలో ప్రతి వారం వస్తున్న ఇమందిగారి ఆనాటి హృదయాల పేరిట వ్యాసాలలో పొరబాట్లు చోటుచేసుకుంటున్నాయ. ఈ వారంలో వచ్చిన ‘నందమూరి సోదరులకు షాక్’ కథనమైతే బాగుంది కాని, దాన వీర శూరకర్ణ చిత్రానికి సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు, రాజేశ్వరరావు కాదని గ్రహించాలి. ఈయన రామారావు సొంత చిత్రం ‘తాతమ్మకల’ చిత్రానికి సంగీతం అందించారు. ‘తాతమ్మకల’ గురించి వ్రాయబోయి పొరపాటున దాన వీర శూర కర్ణ గురించి వ్రాసారేమో. లోగడ సర్కస్‌రాముడు చిత్రం వ్యాసంలో ఆ టైంలో పూర్తిగా ఫీల్డ్‌లోకిరాని బాలకృష్ణ, యింకా పరిచయమే కాని విజయశాంతిల జంట ఇరగదీస్తుందని రాశారు. కనుక మీరు పాఠకుల అభిప్రాయాన్ని వారికి తెలియచేసి, వ్యాస రచనలో జాగ్రత్తపడేలా చేయగలరు. వీరు వ్యాసంలో చలోక్తులకన్నా విషయాలు కరెక్ట్‌గా ఉదహరిస్తే బాగుంటుంది.
-పి.లక్ష్మీసుజాత, అద్దంకి