మీ వ్యూస్

భలే మల్లేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ గొప్ప ఆవిష్కరణ అనేది బాధనుంచో, భారంనుంచో పుడుతుంది. మల్లేశం కనుక్కున్న ఆసు యంత్రం కూడా అలాంటిదే. తమ వృత్తికవసరమైన శారీరక శ్రమను తగ్గించే ఆవిష్కరణ కోసం ఓ వ్యక్తి సజీవ పరితపనకు తెర రూపమే -మల్లేశం. చాలాకాలం తరువాత ఓ స్ఫూర్తివంతమైన సినిమా చూశామన్న భావన కలిగింది. సమీక్షకులు ఎన్ని విధాలుగా సమీక్షించినా, కామన్ ఆడియన్‌గా ఈ చిత్రం సంతృప్తినిచ్చింది. అలాంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు రాజ్ ఆర్‌ను అభినందించి తీరాలి. ఇందులో నటించిన తారాగణం సైతం మనసుపెట్టి సినిమా చేశారనిపించింది. నిజ జీవితంలోని పాత్రల్ని తెరపై చూస్తున్నామా? అన్నంతగా నటించి సినిమాకు ప్రాణం పోసిన అందరికీ అభినందనలు. ఇలాంటి స్ఫూర్తిదాయక చిత్రాలు మరెన్నో రావాలి.
-కె సాయమాధవ్, బిక్కవోలు
నాడు -నేడు
కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందంటారు. కాని కాలానుగుణంగా మార్పు మాత్రం తథ్యం. నాడు సినిమాలు జనరంజకంగా ఉండేవి. సినిమా బాగుందంటే వందరోజులు ఆడేవి. ఇంకా బాగుంటే 175, 200, 365 రోజులు ఆడిన సినిమాలూ ఉన్నాయి. అప్పటి సినిమాలన్నీ జనామోదయోగ్యంగా ఉండి, ఒకటీ అరా సినిమాలు ఫ్లాప్ అయ్యేవి. నేడు వంద సినిమాలు వస్తే... ఒకటి రెండు సినిమాలు హిట్టవుతున్నాయి. మిగతా సినిమాలన్నీ అలావచ్చి అలా వెళ్లిపోతున్నవే. యూత్‌ని టార్గెట్‌నుచేసి తీస్తున్న బూతు సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మూడు ముద్దులు.. ఆరు హగ్గులుగా ఉంటున్నాయవి. ఈ పరిణామంపై దర్శక నిర్మాతలు కొంచెం ఆలోచించి దారితప్పుతున్న తెలుగు సినిమా వైభవాన్ని కాపాడాలి.
-కె శ్రీనివాసులు, హైదరాబాద్
పసందైన వెనె్నల
ఆంధ్రభూమి వెనె్నల వారంవారం చక్కని సినీ విశేషాలతో మా ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది. అలనాటి అపురూప చిత్రాలు వారంవారం వెనె్నల్లో ప్రచురిస్తున్నందుకు ధన్యవాదాలు. నాకు నచ్చిన పాట, నాకు నచ్చిన సినిమా శీర్షికలు, సినీ పజిల్స్ బావుంటున్నాయి. చిత్ర సమీక్షలు నిషాక్షికంగా చేయడంలో వెనె్నలకు వెనె్నలే సాటి. ప్రతివారం అందిస్తోన్న కవర్ కథనంలో ఏదొక కొత్తదనం చూపిస్తుండటం మమ్మల్ని ఆనందపరుస్తోంది. వెనె్నల సంపాదక బృందానికి అభినందనలు.
-ప్రపుల్లచంద్ర, ధర్మవరం
అదీ హీరోయిజం
బాలీవుడ్ నటుడు బాద్‌షా అమితాబ్ బచ్చన్ బీహారుకు చెందిన 2100 మంది రైతుల బ్యాంకు రుణాలు చెల్లించి ఉదాత్తత చాటుకున్నారట. భారతదేశంలో పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నారు, వడ్డి మాఫీ రూపంలో. అదే రైతు ప్రకృతిని నమ్ముకుని పంటవేస్తే, దిగుబడి రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. స్క్రీన్‌పై హీరోయిజం అంటే -డూప్‌లతో ఫైటింగ్‌లు, హీరోయిన్లతో డ్యాన్సింగులు అయి ఉండొచ్చు. కాని -రియల్ లైఫ్‌లో హీరోయిజం అంటే అమితాబ్ చేసింది. ఒక్కో స్టార్ హీరో 50 కోట్లు వరకూ పారితోషికం తీసుకుంటూ బయటా హీరో అని పిలిపించుకుంటున్నా, ప్రజాసేవ చేయకుండా భార్యా పిల్లలతో వేసవి సెలవులు గపపడం కోసమే టైం వెచ్చిస్తున్నారు. వేసవి తీవ్రత కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. ఇదిగో ఇది మీ కోసం అంటూ -ఎక్కడా బోర్ వెల్ వేయించిన హీరో లేడు. తెరపై నీతులు చెప్పడమేగాని, ఆచరణలో హీరోయిజం చూపిలేని హీరోలే మనకు ఎక్కువ. దాదాపు 2కోట్లు రైతుల అప్పులు తీర్చిన అమితాబ్, ఆయన కుమార్తెకు హ్యాట్సాఫ్ అనాలి.
-కెఆర్ శ్రీనివాస్, బోడుప్పల్
తెలుగు ఫైట్లు అంతేనా?
కొన్ని చిత్రాలు చూస్తుంటే ఆ ఫైట్లేంటి? అనిపించక మానదు. స్మార్ట్‌గా స్మూత్‌గా కనిపించే కుర్ర హీరో పర్వతంలాంటి విలన్‌ని తన్ని తన్ని ఓడించటం విడ్డూరమైతే, ఇప్పుడు హీరోలు ఎడమ చేతితో విలన్‌ని గాలిలోకి విసిరితే ఆ విలన్ గింగిరాలు తిరుగుతూ కిందపడి వెంటనే బంతిలాగ పైకి లేచి అంత దూరంలో పడటం ఏ సైన్సుకీ, ఏ సెన్స్‌కీ అందని మరో విడ్డూరం. అంత ఎత్తునుంచి పడినా ఎముకలు విరగకపోవటం మరో విచిత్రం. ఇలాంటి విన్యాసాలు ఎక్కువై బోరుకొట్టడంతో వినయ విధేయరాముడు బోర్లాపడినా, దర్శకుల మైండ్‌సెట్ మారడం లేదు. ఆంగ్ల చిత్రాల మాదిరిగా ఫైటింగుల్ని సహజంగా ఎందుకు డిజైన్ చేయలేరు. హీరోయిజాన్ని చూపించడానికి ఆడియన్స్‌ని ఫూల్స్ చేస్తామంటే ఎలా?
-సుబ్బక్క, జగన్నాయక్‌పూర్
కథనం బావుంది
ఉత్తమ చిత్రాలు నిర్మాంచాలన్న తపనతో అక్కినేని, ఆదుర్తి కలిసి చక్రవర్తి చిత్ర అనే సంస్థ ప్రారంభించి సుడిగుండాలు, మరోప్రపంచం చిత్రాలు నిర్మించి నష్టాలు భరించలేక సంస్థను ఎత్తేశారు. సుడిగుండాలు పేరు చెప్తే జ్ఞాపకం వచ్చే ఏకైక వ్యక్తి ప్రసన్నరాణి. చాలా గొప్పగా నటించారు. ఆమె గురించి ఎవరికీ తెలియని అనేక విషయాలు చెప్పిన రచయితకు అభినందనలు. కాని -వ్యాసంలో ఒక చిన్న పొరపాటు ఉంది. పుంభావ సరస్వతి అనే పదబంధం పురుషులకు సంబంధించి వాడతాం. పురుష రూపంలోని సరస్వతి అని అర్థం. ప్రసన్నరాణి స్ర్తి కనుక ఆమెను పుంభావ సరస్వతి అనకూడదు.
-ప్రేమజ్యోతి, శ్రీనగర్
అలనాటి ముచ్చట్లు
శోభన్‌బాబు సినిమాల్లో ప్రవేశించిన కొత్తలో ఏయన్నార్‌ని అనుకరిస్తున్నాడన్న పేరొచ్చింది. ‘శోభన్ నటనలో నన్ను తలపింపజేశాడు. నా వారసుడు శోభన్’ అని ఏయన్నార్ అనటం సహజమే కాని, ఆయన ప్రశంసవల్లే శోభన్ పుంజుకున్నాడని రచయిత ఇమంది భావించటం సరిగాదు. మొదట్లో ఏయన్నార్‌ని అనుకరించినా, తర్వాత గట్టిగా కృషిచేసి తన ప్రత్యేకత నిలపుకున్నాడు శోభన్. నాగార్జున, అఖిల్‌ల తొలి చిత్రాలు చూసి ఏయన్నార్ ప్రశంసించినా నాగార్జున పుంజుకోడానికి చాలాకాలం పట్టినా అఖిల్ ఇంకా పుంజుకోనే లేదు.
-లక్ష్మి, బృందావనం