మీ వ్యూస్

మత్తు వదిలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈవారం విడుదలైన మత్తు వదలరా చిత్రం మమ్మల్నెంతో ఆకట్టుకుంది. వెనె్నల రివ్యూ చదివే సినిమా చూశాం. ఓ కొత్త ప్రయోగంలా అన్పించింది. ఓ సన్నివేశాన్ని ఎక్కడ బిగి సడలకుండా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా నటీనటులందరూ కొత్తవాళ్లు అయినా పాత్రలకు తగ్గట్టుగా నటించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బాగుంది. రొటీన్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా చూస్తే మంచి సినిమా ఎలా వుంటుంది అన్న విషయం అర్థవౌతుంది. చెత్త చిత్రాల మత్తు వదులుతుంది.
-ఎన్.రామన్న, శ్రీనివాసపురం
మాంగల్యానికి బలమే
ఈవారం వచ్చిన ఫ్లాష్‌బ్యాక్‌లో మాంగల్యబలం గురించి చక్కగా రాశారు రచయిత్రి. ఓ మంచి కథకు అద్భుతమైన దర్శకుడు తోడై స్క్రిప్ట్‌ను చక్కగా రాసుకొస్తే ఎలా వుంటుంది? ఆ పాత్రలకు తగిన నటీనటులను ఎంపిక చేసుకుంటే ఆ సినిమా వుంటుంది అంటే మాంగల్యానికి బలం వచ్చినట్లే వుంటుంది. ఇవన్నీ ఒక ఎతె్తైతే ఈ చిత్రంలో వున్న పాటలన్నీ మధురాతి మధురాలే. వాడిన పూలే వికసించెలే అన్నపాట, హాయిగా ఆలుమగలై కాలం గడపాలి అన్న పాటలు రెండూ ఇప్పటికి వినిపిస్తూనే వుంటాయి. ఆ పాటలు వింటుంటే, సినిమా కళ్లముందు కదలాడుతుంది. వెనె్నలలో ఈ వారం మాంగల్యబలం గూర్చి చదివితే ఆ చిత్రం మా కళ్లముందు కదలాడింది. ఏఎన్నార్, సావిత్రి, ఎస్వీ రంగారావు, కన్నాంబ, సూర్యకాంతంలు ఎంత బాగా నటించారో రెండు సీన్లలో వున్న జి.వరలక్ష్మి అంత గొప్పగా నటించారు.
-కె.వి.చారి, లింగంగుంట
నిజమే!
టాలీవుడ్ ఎప్పటికప్పుడు నానాటికీ తీసికట్టు నాగంబొట్టులా తయారైంది అని స్టార్ పెరుగని టాలీవుడ్‌లో బాగా చెప్పారు. ఇంతమంది స్టార్లు ఉన్నా, గొప్ప గొప్ప దర్శకులున్నా గానీ టాలీవుడ్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది అనడం నిజం! కేవలం వ్యాపార ధోరణితో కమర్షియల్ చిత్రాలను తీసుకుంటూ పోతున్న టాలీవుడ్‌కు చెంపపెట్టులాంటిది ఈ మాట. కానీ ఎవరు ఎవరిని ఇక్కడ పట్టించుకుంటారు. ఎవరి ధనాశ వారిది. డబ్బుకోసం పరిగెడుతున్న టాలీవుడ్, మంచి చిత్రాలకోసం, కొన్ని మంచి అవార్డు చిత్రాలకోసం ఏనాడూ ప్రయత్నం చేయడంలేదు. ఏ గతీలేక అక్క మొగుడే గతి అన్నట్లుగా ఏ సినిమాలు లేనప్పుడే తెలుగు సినిమాలకు ఒకటో అరో అవార్డులు వస్తున్నాయన్నమాట నిజం.
-ఎం.చంద్రశేఖర్‌రావు, పార్వతీపురం
మార్చండి
వెనె్నలలో గత ఐదారేళ్లుగా వున్న శీర్షికలే వస్తున్నాయి. సినిమా సమీక్షలు కూడా ఒకటి రెండుకన్నా ఎక్కువ ఇవ్వడంలేదు. ఇందుకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. విడుదలవుతున్న సినిమాల గురించి రివ్యూ ఇవ్వకపోవడంవల్ల ఏ విషయం తెలియడంలేదు. విడుదలైన సినిమాల అన్నింటి గురించి కొద్దో గొప్పోసమాచారం వెనె్నల ఇవ్వాలని కోరుకుంటున్నాం. శీర్షికలు కూడా ఈ 2020కి ఏవైనా కొత్తవి నిర్వహిస్తే మరింత బాగుంటుందని మా మనవి. వెనె్నలను ఎప్పటికప్పుడు సర్వాంగ సుందరంగా రూపొందించాలని కోరుతూ...
-పి.సురేఖ, విజయవాడ
గుర్తుచేశారు
ముగ్గురు మహానటులు ఎన్టీఆర్, ఎఎన్నార్, శివాజీ గణేశన్‌ల అద్భుతమైన కలయికలో రూపొందిన చాణక్య చంద్రగుప్త. మాంత్రికుడిగా సత్యనారాయణ, విషకన్యగా జయప్రదల నటన, నవనందుల కామెడీ ఈ చిత్రానికి హైలెట్. ఎస్.వరలక్ష్మి రాజమాత మురాదేవిగా నటన ముగ్గురు మహానటులకు పోటీగా సాగింది. ఒకటా రెండా తొమ్మిది, చిరునవ్వుల తొలకరిలో, ఎవరో ఎవరో ఆ చంద్రుడెవరో అన్న పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే వుంటాయి. ఈ వారం క్విజ్‌లో చాణక్య చంద్రగుప్త గురించి గుర్తుచేశారు. అలాంటి పాత చిత్రాల గురించి అప్పుడప్పుడు గుర్తుచేస్తారని కోరుకుంటున్నాం.
-ఎం.డి.మిత్ర బృందం,
పాత కోడూరు
సినీ పెద్ద
అలనాటి నటి నాయిక నిర్మాత స్టూడియో అధినేత శిరంశెట్టి కృష్ణవేణమ్మ గురించి రెండు వారాలు అందించిన ముచ్చట్లు మమ్ము అలరించాయి. ముఖ్యంగా ఆ కాలంలో వారు రూపొందించిన అద్భుతమైన చిత్రాలు విజయఢంకా మ్రోగించాయి. వ్యాసంలో కీలుగుఱ్ఱం గూర్చి రాయడం మర్చిపోయారు. కీలుగుఱ్ఱంతోనే అక్కినేని నాగేశ్వరరావు జానపద కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఓరకంగా ఎన్టీఆర్‌ను, ఎఎన్నార్‌ను కూడా ఆమె పరిచయం చేశారని చెప్పవచ్చేమో. ఏది ఏమైనా ఆ కళామతల్లి ఇంకా మనమధ్య ఉండడం మనందరికీ ఆనందదాయకం. ఆమె గురించి రాసిన వ్యాసం కూడా మమ్మల్ని అలరించింది.
-కె.సుధారాణి, జగ్గయ్యపేట
విజయావారికి ఆప్తుడు!
బాలక్రిష్ణ (అంజి) హాస్య నటుడు. విజయావారి పాతాళభైరవి (1951) చిత్రం నుండి అనేక చిత్రాల్లో (1957) మాయాబజార్ చిత్రంలో రేలంగి లక్ష్మణ కుమారుని సహచరునిగా నటించాడు. మిస్సమ్మ చిత్రం (1955)లో డిటెక్టివ్ అసిస్టెంటుగా ఏమాత్రం డైలాగ్స్‌లేకుండా ప్రేక్షకులను నవ్వులతో ముంచేస్తాడు. (1962) గుండమ్మకథలో హోటల్ సర్వర్ పాత్రలో ఎంతో హాస్యాన్ని పండిస్తాడు. ఇంకా అనేక చిత్రాల్లో ముఖ్యంగా యన్.టి.ఆర్. స్వంత చిత్రాల్లో గుళేబకావళి కథ (1962), వరకట్నం (1969) మొదలగు చిత్రాల్లో బాలక్రిష్ణ వివిధ రకాలైన పాత్రలను పోషించి హస్యచక్రవర్తిగా ప్రేక్షకులకు అత్యంత హాస్యబంధువుగా కొనియాడబడిన నటుడు. చివరి దశలో విజయా సంస్థవారు ఆదుకొని తమ ఋణం తీర్చుకొంటారు.
-కేవీ ప్రసాదరావు, కందుకూరు