మీ వ్యూస్

కలక్షన్ల యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల యుద్ధం ముగించి, సంక్రాంతి చిత్రాలు కలక్షన్ల యుద్ధం ప్రారంభించాయి. రెండు వారాలు గడిచాక 140 కోట్ల బడ్జెట్‌తో తయారైన సరిలేరు రెండు రాష్ట్రాల్లో దగ్గరదగ్గరగా 100 కోట్లు, ఓవర్సీస్‌లో 20 లక్షల డాలర్లుపైగా సాధించగా అలవైకుంఠపురం రెండు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా ఓవర్సీస్‌లో 2.13 కోట్లు సాధించింది. అయితే వైకుంఠపురం బడ్జెట్ 130 కోట్లు. అందువల్ల సరిలేరుకు సరిజోడుగా నిలబడడమే కాక ఒక మెట్టుపైనే ఉంది. కాలం గడిచేకొద్దీ మరిన్ని మెట్లు పైకి పోవచ్చు. తమాషా ఏంటంటే ఈ రెండు చిత్రాలకన్నా ప్రతిరోజు పండగ బాగుందనేవారూ ఉన్నారు!
- జె.పూర్ణారావు, కాకినాడ
ఇదేంటి రాజా?
ఇదివరలో నాగార్జున తర్వాత వెంకటేష్, ఆమధ్య బాలకృష్ణ, ఇప్పుడు ఈ రాజా (రవితేజ) వారి సినిమాలతో ఇచ్చిన సందేశం ‘మా పనైపోయింది ఇక మీదట తండ్రి, తాత పాత్రల్లో మిమ్మల్ని తరింప చేస్తాము అని’. అదే నిజమైతే మంచి ఉద్దేశమే. కాకపోతే ముఖం మీద పది మడతలతో 20 ఏళ్ల కుర్ర హీరోయిన్లతో గెంతులు చాలా అసహ్యంగా ఉన్నాయి. కనుక వీరందరూ స్వచ్ఛంద పదవీ విరమణ హీరోలుగా కనిపిస్తున్నారు. హీరోగా నటించకుండా ఇతర పాత్రలు చూసుకుంటే చాలా మంచిది.
-శిష్ట్లా నరసింహమూర్తి, హైదరాబాద్
గత జ్ఞాపకాలు
వెనె్నలలోనే హాయి ఏలనో అన్నట్టు ఆదివారం వెనె్నలలో ఆనందించే సంగతులు ఎన్నో ఉన్నాయి. సినిమా రివ్యూలు థియేటర్లో కన్నా సమీక్షలలో చూసేసి థియేటర్ల వైపు నడవవలసిన అవసరం ఉందో లేదో చెబుతున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ అలనాటి ప్రేక్షకులకు గత వైభవాలను గుర్తుచేస్తున్నాయి. ఈనాటి యువత అలనాటి సినిమాలు ఇలా ఉంటాయని ఆశ్చర్యపోతున్నారు చదివి. స్వరబాల రావు బాలసరస్వతి, సుశీల, లీల, జిక్కి, జానకీలకు సీనియర్. ఆమె జూనియర్లవల్ల వెనకబడ్డారా లేక కుటుంబ సమస్యలవల్ల పాడడం మానేశారా? అనేది తెలిసింది. తన గాత్ర స్వర పేటిక ఘంటసాల వారితో యుగళ గీతాలకు సరిపోదని ఆమె ఓసారి చెప్పినట్టు చదివాను. నటించే రాజేశ్వరరావు, పాడించే సంగీత సామ్రాట్ అయితే నటించిన సరస్వతి గాయని అయ్యారు. గత జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఝనక్ ఝనక్ జాను
శర్వానంద్, సమంత నటించిన జాను చిత్రం చాలా క్లాసికల్‌గా ఉంది. ముఖ్యంగా శర్వానంద్ నటన ఈ చిత్రానికి హైలెట్. కళ్లతోనే నటించాడు. అతనికి పోటీగా సమంత కూడా బాగా నటించింది. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాంటి సినిమాలు గుర్తుకు వచ్చాయి. తమిళంలో విజయవంతమైన 96 చిత్రాన్ని రీమేక్ చేయడం బాగానే ఉన్నా, ఒరిజినల్ ఏమాత్రం ఆవిష్కరించలేకపోయాడు అదే దర్శకుడు. తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి చిత్రాన్ని అందించాలన్న నిర్మాత ప్రయత్నం మెచ్చదగినదే.
-సూరపనేని విజయ,
మంగళగిరి
ఏకీభవిస్తా..
చంపక్, మాధవ్‌నగర్, పల్లి వరలక్ష్మి ఆదోని వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తా. కనె్నమనసులు, లక్ష్మీకటాక్షం రెండు ఫ్లాప్ చిత్రాలే. లక్ష్మీకటాక్షం బి,సి సెంటర్లలోను రిపీట్ రన్‌లోను కొంతవరకు నష్టాన్ని పూడ్చి ఉండవచ్చు. అలాగే రాజమకుటం కూడా బి.ఎన్.రెడ్డి పేరు ఉన్న గట్టెక్కలేకపోయింది. ఏ హీరోలైనా ఉన్నది ఉన్నట్లే చిత్ర విశేషాలు చెబితే అది ముందు తరాల వారికి మన చరిత్ర కచ్చితంగా అందించినట్లవుతుంది. లేకుంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఈమధ్య ఒక హీరో అన్నట్లు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీలు రాకున్నా మన వారిని మనం గౌరవించుకోవాలంటే రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు అన్నా ఇచ్చి గౌరవించుకోవాలి. అలనాటి సినీ రత్నాలు రావు బాలసరస్వతికి ఇప్పటివరకు రాలేదు. ఆ అవార్డుకు ఎందరో అర్హులున్నారు గమనించగలరు.
- టి.సదాశివరెడ్డి, తిరుపతి