మీ వ్యూస్

మరీ ఇంత దారుణమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో సీరియల్‌కంటే దారుణంగా తీసిన సినిమా అంధగాడు. కథకు ఓ ప్రాముఖ్యత లేకుండా, ఇష్టారీతిన ఏవేవో సన్నివేశాలు కలిపేసుకుంటూ, చివరకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ పాయంట్ తెచ్చేసిన బాపతు చిత్రంల అనిపించింది. ప్రేక్షకులు చూసేస్తున్నారు కదాని ఏదిబడితే అది సినిమా చేసెయ్యడం పరిశ్రమకే ముప్పు. హీరో గుడ్డివాడు కనుక ప్రేక్షకులు సైతం గుడ్డిగా సినిమా చూసేస్తారనుకోవడం పొరబాటు. ఏవేవో సినిమాల్లోని సన్నివేశాలు ఏరుకొచ్చి, లాజిక్ లేకుండా వాటిని గుదిగుచ్చి ఇదే సినిమా అంటూ జనం మీదకు వదలడం దారుణం, మహాపాపం కూడా.
రాఘవేంద్ర, మచిలీపట్నం
దాసరి ట్రెండ్
ఎంతో విలక్షణ దర్శకుడిగా ప్రఖ్యాతి గాంచిన దర్శకరత్న బిరుదును తన పేరుతో లిఖించుకున్న దాసరి నారాయణరావుతో చివరి దశలో మారుతున్న సినిమా ట్రెండ్‌ను పట్టుకోలేకపోయారు. అనుసరించలేకపోయారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమాలు ఘోర పరాజయాన్ని చూశాయి. తాను దర్శకునిగా ఫెయిలవుతున్న కారణంగా ఇక ఏ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనని చెప్పారు. ఈ పరిస్థితి దాసరికే కాదు ఆనాటి పేరొందిన దర్శకులు ఈ అనుభవాన్ని రుచి చూశారు. సాంకేతిక విప్లవంతో అర్ధం, పర్ధం లేని కథలతో సినిమాలు అల్లుతున్నారు. చూసి నేర్చుకోవలసింది ఏమీ లేకపోయినా ఇలాంటివే కావాలంటున్నారు నేటి యువతనం. కాల మహిమ కాకపోతే మరేమిటి?
- ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
సిగ్గుపడదాం
మే 30 వెనె్నలలో సినిమా వాళ్లు సిగ్గుపడండి అంటూ రాసిన రచయిత ఆవేదన అర్ధం చేసుకోతగింది. వాస్తవానికి గతంలో స్టేజి నాటకాలు, నటీనటుల అభినయ కౌశలం ప్రేక్షకులను ఆహ్లాదపరచడానికి నిర్వాహకులు అందించే పారితోషికం కుటుంబ పోషణకు ఉపయోగపడేవి. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు సినిమాలు వచ్చేశాయి. తెరకు అప్పుడే పరిచయవౌతున్న వృద్ధ నటుని వారసుడు కనపడగానే హాలులో వినిపించే ఈలలు, కూలీకి వేసేవే తప్ప కౌశలం చూసి కాదని చెప్పక్కర్లేదు. వాటికి ప్రభావితమయ్యే అమాయకులు ఆ ట్రాక్‌లో కొట్టుకుపోయారు. వినోదానికి వెళ్లే సినిమా తాలూకు పబ్లిసిటీ టీజర్లకు సమయం వెచ్చించడం మన అదుపులో ఉంచుకోలేని బలహీనత మాత్రమే.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
శాశ్వతమా?
బాహుబలి-2లో గొప్ప కథాకాకరకాయ లేకపోయినా, సంగీతం గొప్పగా లేకపోయినా, నటీనటుల నటన అంతంత మాత్రమే అయినా గొప్ప విజయం సాధించడానికి ప్రధాన కారణం అమోఘమైన గ్రాఫిక్స్ మాత్రమే కాక, ప్రచార హోరు, 9వేల థియేటర్లలో విడుదల చేసిన మార్కెటింగ్ వ్యూహం అన్న సంగతి అందరికీ అర్థమైంది. మరేదైనా చిత్రం పదివేల థియేటర్లలో విడుదల చేస్తే బ్రహ్మాండమైన ప్రచారం వస్తే బాహుబలి-2 పేరిట ఉన్న మొదటి రోజు వసూళ్లు రికార్డు చెదిరిపోతుంది. సత్తా ఉంటే బాహుబలి వసూళ్లను క్రమక్రమంగా మించిపోవచ్చు కూడా. ఇప్పటికే దంగల్ 1500 కోట్లతో బాహుబలికి దగ్గరగా వచ్చేసింది. అందువల్ల రికార్డులనేవి శాశ్వతం కాదు.
- పి.శుభ, కాకినాడ
సీరియల్స్ ఘోరం!
నటుడు చలపతిరావు వాగుడుకి మహిళా సంఘాలు మండిపడడం సహజమే. ఆయన క్షమాపణ కోరడమూ జరిగింది. అయితే బూతులు మాట్లాడడం వాటిని ఆనందించడం అనాదిగా ఆంధ్రుల లక్షణమే. నటీనటులు తప్పుచేస్తే ప్రఖ్యాత దర్శకుడు పి.పుల్లయ్య బూతులు తిట్టేవాడు. తెరవెనుక బూతులతో రెచ్చిపోవడం చాలామందికి అనుభవమే. వృద్ధ నటీమణులు కూడా మగాళ్లతో సరిజోడిగా బూతులను ఆనందిస్తూ పేక ఆట ఆడేవారని విన్నాం. కానీ సభల్లో మాత్రం సభ్యతగా నోళ్లు మూసుకోవాలి. చలపతిరావు సంగతి పక్కనపెడితే టీవీ సీరియల్స్‌లోను, రియాల్టీషోలలోను స్ర్తిలను ఎంత వెకిలిగా, ఎంతో క్రూరంగా, అంతకన్నా నీచంగా చూపిస్తున్నారో మహిళా సంఘాలకు తెలియదా? వారిని ఎందుకు నిరసించరు?
-పి.శాండిల్య, సర్పవరం
దర్శకత్వ ప్రతిభ!
ఎన్నో విజయవంతమైన టీవి మెగా సీరియల్స్ అందించిన మంజులానాయుడివి ప్రస్తుతం రెండు సీరియల్స్ నడుస్తున్నాయి. ఇవి రెండు దరిద్రపుగొట్టు కథాకథనాలతో సాగుతున్నాయి. సీరియల్స్‌పై ఆమెకు శ్రద్ధ తగ్గిందా? లేక సృజనాత్మక ఎండిపోయిందా? ఆమె అగ్నిపూలు చూడడం మానేసి ప్రస్తుతం రెండో సీరియల్ అప్పుడప్పుడు చూస్తున్నాం. పోలీస్ నిఘా అంటే గేటుముందు బైక్‌వద్ద నిలబడి ఫొటోలు తీయడమా? ఒక్క కేసు కూడా ఓడిపోని గొప్ప లాయర్ అని బిల్డప్ ఇచ్చారు గానీ అతడు కేసులు వాదించిందే లేదు. కళాకాంతి లేని మొద్దు మొఖంతో నిస్తేజంగా ఉంటాడు. కారులో వెళుతుంటే రోడ్డుకి అడ్డంగా రాళ్లు వుంటే ఎవరైనా ప్రమాదం శంఖిస్తారు. ఇతగాడు కారుదిగి రాళ్లు పక్కకు జరుపుతూ రౌడీలచేత చావుదెబ్బలు తింటాడు. ఇలాంటి దర్శకత్వ ప్రతిభ, ఇలాంటి సీరియల్‌ల్లో ఎన్నో సన్నివేశాల్లో పండిపోయింది. ఆహా.. ఏమి దర్శకత్వ ప్రతిభ!
- జె.్ధర్మతేజ, గొడారిగుంట
రండి.. రండి..
హింస, అశ్లీలత, ద్వంద్వార్థాలు, అనైతికత హద్దులు మీరి సినిమాలు వికృతరూపం దాలుస్తూ కుటుంబ ప్రేక్షకులకు నరక ప్రాయవౌతున్న ప్రస్తుత రోజుల్లో ఎలాంటి మసాలాలు లేకుండా ఓ చిన్న కథకు అందమైన కథనం జోడించి, సరదా సరదాగా సినిమా చూడడానికి రండి.. రండి.. అంటూ తెరకెక్కించిన రా..రండోయ్.. సినిమా అలరించింది. బంగార్రాజు పాత్రలో ఓ సాధారణ కథను బ్లాక్‌బస్టర్‌గా మలచిన దర్శకుడు ఈసారి భ్రమరాంబ అనే ఒక పల్లెటూరు అమాయకపు అమ్మాయి పాత్ర చుట్టూ కథనం అల్లి, ఇంకొక హిట్ కొట్టాడు. అందమైన ప్రకృతి, స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్యం, మనమధ్యే తిరుగుతున్నాయా అనిపించే పాత్రలు, రోజూ మాట్లాడుకునే మాటలే సంభాషణలు. తెలుగువారి సంప్రదాయాలు, వేడుకలు అందరినీ ఆకట్టుకునే భావోద్వేగాలు.. ఇలా సహజసిద్ధమైన పద్ధతిలో నడిచింది ఈ సినిమా.
- ఎం.కనకదుర్గ, తెనాలి