మీ వ్యూస్

ఎవరిష్టం వాళ్లది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడో చూసేసిన దేవదాసును ఇప్పటి కాలమాన పరిస్థితులు, ఆలోచనలకు అనుగణంగా మలకుంటే కనిపించే దృశ్యమే -అర్జున్ రెడ్డి. ఆధునిక దేవదాసును చూపించటంలో దర్శకుడు నిజాయితీగా నమ్మిన క్రియేటివిటీ వాడాడనిపించింది. ఇదొక బూతు సినిమా అనే వాళ్లను కాదనలేం. వైవిధ్యమైన సినిమా ప్రయోగంగా అభివర్ణించే వాళ్లను వద్దనలేం. అయితే, రెండు వర్గాలూ అతికిమించి అల్లరి చేస్తుండటంతో -చివరకు హిట్ టాక్ వచ్చేసింది. నిజానికి ఒక కోణంలో చూస్తే -సామాజిక వాతావరణ కాలుష్యాన్ని పెంచిపోషించే కంటెంట్ కావాల్సినంత ఉందనిపిస్తుంది. మరోకోణంలో -నమ్మిన కథను నిజాయితీగా తీసేందుకు దర్శకుడు తపన పడ్డాడన్న భావనా కలుగుతుంది. ఎవరేమనుకున్నా, ఎలా అర్థం చేసుకున్నా -అర్జున్ రెడ్డి హిట్. ఎంత ఎక్కువ సొమ్ము చేసిందో తెలీదుకానీ, వారంపాటు చిత్రం నిలబడటానికి వీలుగా థియేటర్లకు మంచి సినిమాలు రాకపోవడం కూడా ఆ బృందానికి కలిసొచ్చే విషయమే.
-రాగతి శ్రీనివాస్,
సికింద్రబాద్
మనమింతేనా?
ఏ సినిమా చూసినా ఏముంది ఎంటర్‌టైన్‌మెంట్. ప్రస్తుత తెలుగు సినిమా సమస్తం -పరభాషా కథల సమ్మేళనం అనిపిస్తోంది. చిన్న సినిమా నిర్లక్ష్యం చూస్తుంటేనే -పరిశ్రమ కొంపమునిగే పరిస్తితి వస్తుందా? అనిపిస్తుంది. మా సినిమా హిట్టు అని చెప్పుకోవడమే తప్ప, ప్రేక్షకుడు ఏమాత్రం సంతృప్తిపడలేకపోతున్నాడు. పైగా -రెండోరోజే సక్సెస్ మీట్ పెట్టేసి కొంత సంప్రదాయాన్ని కొనసాగించడమే తప్ప, అనుకున్నంత సరుకు ఏ సినిమాలోనూ కనిపించటం లేదు. వారంవారం వస్తున్న చిత్రాల్లో ఒకటైనా -ఇదీ తెలుగు సినిమా అని చెప్పుకునేంత స్థాయిలో ఒక్కటైనా ఉంటుందా? అని ప్రశ్నించుకుంటే తెల్లమొగం వేసుకోవాలి. తెలుగు సినిమా అనగానే 70ల దశకం వరకూ వచ్చిన చిత్రాలను చెప్పుకోవడమే తప్ప, ఆ స్థాయిని అందుకునే సినిమా.. ఏదీ? ఒక్కటీ రావడం లేదు.
-కమలాక్షి, విజయవాడ
హన్సిక ఏంచేసిందని..
ఈమధ్య ఓ చానెల్‌లో వివిధ విభాగాల్లో పేరుపొందిన మహిళలకు అవార్డులు లివ్వడం ప్రసారమైంది. అందులో ఒకటి బెస్ట్ సోషల్ దివా. ఆ మాటకు అర్థం ఏమిటో యాంకర్లుగని, అవార్డు అంకున్న హన్సికగాని చెప్పనే లేదు. బెస్ట్ సామాజిక కార్యకర్త అని చెప్పుకోవాలేమో. అయితే హన్సిక చేసిన సమాజ సేవ ఏమిటో ఎవ్వరూ చెప్పలేదు. అవార్డు పుచ్చుకుని సెక్సీ డ్యాన్స్ స్టెప్ వేసి వెళ్లిపోయింది. ఫంక్షన్ ఏదైనా సెక్సీ డ్యాన్స్‌లు, ఐటెం సాంగులు తప్పనిసరి అయిపోయాయి. ఈ హంగామా అవార్డుల గౌరవాన్ని, హూందాతనాన్ని మింగేస్తోంది.
ప్రసన్న, పేర్రాజుపేట
అవే బావున్నాయి
ఈమధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో ‘్ఫదా’ ఒక్కటే ఏతరానికైనా నచ్చే సినిమా అనిపించింది. చాలా చిత్రాల్లో చూసేసినా కథే అయినా దర్శకుడు తన మేథస్సుతో చక్కగా మలచుకుని థియేటర్లలో కూర్చోబెట్టగలిగాడు. చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల -ఆ గ్యాప్‌నకు న్యాయం చేస్తూ తెచ్చిన ఫిదా నిజంగానే ఆడియన్స్‌ని ఫిదా చేసింది. తరువాత చెప్పుకోదగ్గ సినిమా -నేనే రాజు నేనే మంత్రి. పాత్రలన్నీ కాస్త పరిథి దాటి నటించినట్టు అనిపించినా, కాలక్షేపం వరకూ ఇబ్బందీ లేకుండా అలరించింది.
సిహెచ్‌ఎస్ మన్విత, హైదరాబాద్
బసవన్నగా హరికృష్ణ
శతాబ్దపు చారిత్రక పురుషుడు వీర శైవ సిద్ధాంతానికి ప్రాణంపోసిన దైవ స్వరూపుడు ‘బసవేశ్వరుడు’. పాల్కురికి సోమన బసవపురాణంలో ఇతని గురించి వివరంగా వుంది. ఆ వీరగాధను ‘బసవేశ్వరుడు’ పేరుతో తెలుగులో, ‘బసవప్పా’ పేరిట కన్నడంలో నిర్మిస్తే బాగుంటుంది. ఇందులో పాత్రలు నందమూరి కుటుంబం పోషిస్తే బాగుంటుంది.
-కె వెంకటేశ్వర్లు, కరీంనగర్
వీళ్లు మారరు..
పూర్వం రాజుల్ని సదా పొగిడే వాళ్లున్నట్టే ఇప్పుడు స్టార్లను పొగిడే వర్గం పుట్టుకొచ్చింది. బాహుబలి వల్ల ప్రభాస్, అనుష్కలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారని పొగిడేస్తున్నారు. నిజానికి టాలీవుడ్, కోలీవుడ్‌లలో తప్ప ఆ ముఖాలు, వారి పేర్లు మరెక్కడా తెలియవు! మహా అయితే బాహుబలిని చూసినవారు వాళ్ల ముఖాల్ని గుర్తుపట్టొచ్చు. అంతవరకే. వీళ్లు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందితే కనీసం బాలీవుడ్‌లోనైనా ఒకటి రెండు చిత్రాల్లో బుక్ అయ్యేవారు. బాహుబలి తర్వాత అనుష్కకు ఒక్క చిత్రమూ లేదు. ప్రభాస్ సొంత సినిమాలు చేసుకుంటున్నాడు.
-హితీక్ష, రమణయ్యపేట
వాటిని మరిచిపోయారు..
వెనె్నలలో మురహరి ఆనందరావు అందించిన ‘ఏం టైటిల్సో..ఏంటో’ కథనం ఆలోచించతగ్గదిగా ఉంది. అయతే, ప్రేక్షకులు ఆశించే కొన్ని సినిమా పేర్లను మర్చిపోయారు. ముఖ్యంగా ‘మనసే మందిరం’, ‘బీదలపాట్లు’, ‘మరుపురాని మనిషి’, ‘మహాత్ముడు’, ‘బహుదూరపు బాటసారి’, ‘జై జవాన్’, ‘కలిమి లేములు’, ‘రావణుడే రాముడైతే’, ‘ఆడపెత్తనం’, ‘హేమాహేమీలు’, ‘ఊరంతా సంక్రాంతి’, ‘సుమంగళి’, ‘మాధవయ్యగారి మనవడు’, ‘చుక్కల్లో చంద్రుడు’ చిత్రాలు మరిచిపోయారు పాపం!
-పి.రామకృష్ణ
మరీ అంత డ్రామానా...?
భిన్న రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళలకు అప్సర అవార్డులిచ్చిన ఫంక్షన్ చానెల్లో ప్రసారమైంది. అవార్డుకి, ఆపేరుకి లింకు ఏమిటో అర్థంకాలేదు. మహిళలకు అవార్డు కాబట్టి మహిళా యాంకర్లు నిర్వహిస్తే బాగుండేది. ఎప్పటిలానే ఇద్దరు మగాళ్లు వెకిలిజోకులు, వెగటు ప్రవర్తన చూపించేశారు. లావుపాటి విద్యుల్లతకు కామెడీ అవార్డు ఇచ్చారు. యాంకర్లతో ఆమె పానీ పూరీ తినే పోటీ వెగటు పుట్టించింది. చివరిగా గాళ్ చైల్డ్‌ని రక్షించడమనే కానె్సప్ట్‌తో చిన్నపిల్లలు చిన్న నాటిక ప్రదర్శించారు. అంతవరకూ కార్యక్రమాన్ని చూస్తూ నోళ్లు తెరిచి పిల్లికూతలు, విజిల్స్ వేసిన నటీమణులు, నాటికను గంభీరంగా చూస్తూ కన్నీరు కార్చే నటన భలే కామెడీగా అనిపించింది.
సుభాష్, శ్రీనగర్