మీ వ్యూస్

చస్తున్నాంరా బాబూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచూకీ దొరకని మాఫియా డాన్. అతన్ని పట్టుకోవడంలో పోలీసు డిపార్టుమెంట్ వైఫల్యం. అలాంటి డాన్‌వల్ల హీరోయిన్ ఫ్యామిలీకి సమస్యలు రావడం. ఇటు హీరోయన్ ఫ్యామిలీని రక్షించడానికి, అటు పోలీస్ డిపార్ట్‌మెంట్ పరువు నిలపడానికి -దిగొచ్చిన దేవుడిలా హీరో ఎక్కడినుంచో ఊడిపడటం. విలన్ గ్యాంగ్‌ని అంతమొందించటం. కథ సుఖాంతం. -అర్థమయ్యే ఉంటుంది ఇదేదో స్టార్ హీరో సినిమా అని. ఏ స్టార్‌ని తీసుకున్నా ఏముంది కథనం, తెలుగు హీరోలదంతా తెచ్చిపెట్టకున్న మూసమార్గం అన్నట్టే ఉంటున్నాయ -ఇటీవల వస్తున్న సినిమాలు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే -బాలయ్య పైసా వసూల్ చూసినందుకు.
-జహీర్, పాలకుర్తి
ఇదో తరహా కాపీ
గోపీచంద్ హీరోగా ఇటీవలే వచ్చిన ‘గౌతమ్‌నంద’ చిత్రానికి ఆధారం అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ఇద్దరు మిత్రులు’ (బెంగాలీ చిత్రం ‘తాషేర్ ఘర్’కు ఆధారం). ఆ చిత్రానే్న ‘గౌతమ్‌నంద’ పేరిట కాస్త రిచ్‌గా తీసారు. కథ, కథనం అంతా అచ్చం ఇద్దరు మిత్రులు చిత్రం చూస్తున్నట్టే ఉంది.
-ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
నిర్మాతల నిజాయితీ
ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే అలాంటి కథాంశంతోనే మరొకరు సినిమా తీసి ముందుగా విడుదల చేస్తున్న ఘనులున్న రోజులివి. ఇద్దరు నిర్మాతలు ఒకే విదేశీ చిత్రాన్ని విడివిడిగా కాపీ కొట్టినా అలాగే జరుగుతుంది. కానీ 1961లో అక్కినేని ద్విపాత్రాభినయం హీరోలుగా ఇద్దరు మిత్రులు చిత్రాన్ని స్క్రిప్ట్ తయారుచేసుకుంటున్నపుడు జలరుహ సంస్థ ఎన్టీఆర్ హీరోగా ‘డ్యూయల్ రోల్’తో చిత్రం ప్లాన్ చేసింది. అగ్ర హీరోల కథలు ఒకేలా ఉండకూడదన్న ముందు జాగ్రత్తతో అన్నపూర్ణ వాళ్ళు ఆ సంస్థ దర్శకుడు కమలాకర కామేశ్వరరావును పిలిపించి తమ కథను వినిపించి, వాళ్ళ కథ విన్నారు. తర్వాత జలరుహ వారు తమ ప్రాజెక్టును విరమించుకున్నారు. ఆ కథే కొనే్నళ్ల తర్వాత వచ్చిన ‘రాముడు-్భముడు’. ఆ రోజుల్లో నిర్మాతల నిజాయితీ అంత ప్రశస్త్యంగా వుండేది.
-బికె రావు, కొనకంచివారిపాలెం
ఆనందోబ్రహ్మ
హర్రర్ చిత్రం ‘ఆనందోబ్రహ్మ’ కొద్దిపాటి కథతో ఫరవాలేదనిపించింది. కన్‌ఫ్యూజన్‌తో మొదలైనా, కథ తోవలో పడ్డాక ఓకే. తాప్సి పాత్ర ఆసక్తికరంగా సాగింది. క్లైమాక్స్‌లో రాజీవ్ కనకాలను విలన్‌గా చూపిచే సన్నివేశం కథకు కీలకం. వెనె్నల కిశోర్ సహా కమెడియన్లు తన పాత్రలను రక్తికట్టించారు. స్థితిమంతులైన తల్లిదండ్రులు సంతానం దూరమైన సందర్భంలో అనాధ పిల్లల్ని ఒకరిద్దర్ని తెచ్చుకొని పెంచుకొనే మనస్సు కలిగి ఉండటమన్న ఆలోచన బాగుంది. కన్ఫ్యూజన్‌తో మొదలుపెట్టి కథను క్రమంగా అర్థమయ్యేలా మలచే కొత్త టెక్నిక్ సినిమాకు పనికొచ్చినట్టే. చిన్న బడ్జెట్, హారర్ చిత్రాలకు సంబంధించి కొన్నాళ్లు ఈ స్టయల్ నడుస్తుందేమో.
-పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
వ్యాసాలు బావుంటున్నాయ
వెనె్నలలో గమనించదగ్గ వ్యాసాలు వచ్చాయి. తెలుగు ప్రేక్షకులు మరచిపోయిన అలనాటి లలిత, పద్మిని, రాగిణి సోదరీమణులు నాట్యతారలుగా వచ్చి ప్రముఖ పాత్రలలో నటించి వనె్నకెక్కిన వివరాలు, బిఎనె్కగారి విదేశాల్లో చిత్రీకరించిన తెలుగు సినిమాలు వాటిపట్ల నిర్మాతల వ్యామోహం, ఎనుగంటి వేణుగోపాల్ గ్రాఫిష్మతి, ముచ్చట్లు శీర్షికలో మచ్చుకు కొన్ని చెప్పదగినవి. సినిమా సమీక్షలుగాని, వ్యాసాలుగాని ఒక్క వెనె్నలకే సాధ్యమనిపిస్తుంది. సినీ నిర్మాతలకు, దర్శకులకు, నటీనటులకు మార్గదర్శకాలు కావాలి.
-బి.బసవరాజు, కాకినాడ
పడేరకం కాదు
సాయిపల్లవికి తెలివిలేదా? శీర్షికతో ఒక పత్రిక సినీ బిట్ ప్రచురించింది. ఫిదా హిట్ అవగానే ఆమె పారితోషికం 70 లక్షలకు పెంచేసినా నిర్మాతలు ఎగబడితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోక చాలామందికి నో చెప్పిందట. అదీ ఆమె తెలివితక్కువతనం! పెద్దగా అందగత్తె కాకపోయినా ప్రత్యేక వ్యక్తిత్వంతో పాత్రను తీర్చిదిద్ది కమలినీ ముఖర్జీని గ్లామరస్‌గా చూపించాడు శేఖర్ కమ్ముల. తర్వాత ఆమె చేసిన అల్లాటప్పా చిత్రాల్లో ఆమెను గ్లామరస్‌గా చూపించలేకపోయారు దర్శకులు. ఆమె తెరమరుగు అయింది. అందువల్ల చాలామందికి పల్లవి నో చెప్పడం సరైన నిర్ణయమే. ఆమె ఒప్పుకున్న చిత్రాల దర్శకులు ఆమెనెలా చూపుతారన్నది వేచి చూడాల్సిందే.
-చంద్ర, కాకినాడ
భలే భలే..
ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్ ధగద్ధాయమానంగా ఎంతో ఆర్భాటంగా ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఇటీవల దక్షిణాది అవార్డులకు సంబంధించి జరిగిన ఈవెంట్ చాలా నిస్సారంగా బోరింగ్‌గా సాగింది. వేదిక చిన్నది. దానిపై మంది నృత్యాలు సంతలో పగటి వేషగాళ్ల గంతుల్లాగా హాస్యాస్పదంగా అనిపించాయ. యాంకర్లు చెప్పేదిగాని అవార్డు గ్రహీతలు చెప్పిందిగాని సరిగా వినిపించలేదు. చాలామంది ఆంగ్లంలోనే మాట్లాడారు. హాస్యం పేరిట యాంకర్ల వికృతాలు శిరోవేదన కలిగించాయి. అవార్డు ఇవ్వడానికి స్టేజిమీద కొచ్చిన అల్లు అరవింద్ కొడుకు, యాంకర్ శిరీష్‌ని చూసి నీకు ఆడవాళ్లతో ఎక్స్‌ట్రాలు ఎక్కువైనాయి. పెళ్లిచేసేయాలి అంటాడు. అదో జోక్ అట. ఖర్మ ఖర్మ!
-ఆర్.సత్య, కరప
పాఠాలు బావున్నాయ..
‘వెనె్నల’ శీర్షికలో ప్రచురించిన ‘ఈ పాటలు పాఠాలే!’ సినిమాలలో దేశభక్తి గీతాల ప్రాధాన్యం గురించి చక్కగా వివరించింది. నేటి సినిమాలలో, చానళ్లలో అవి మృగ్యం. మంచి పాటలనుదహరించారు. చిత్రం పేరు, కవి పేరు ఇచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాటిని సేకరించి పిల్లలకు అందుబాటులో వుంచితే చాలా మంచిది. వీలుంటే వారానికొకసారి దేశభక్తి గేయం (సినిమాలలోనిది) వెనె్నల శీర్షికలో ప్రచురిస్తే బావుంటుందని నా అభిప్రాయం. మంచి వ్యాసం అందించినందుకు రచయితకు, మీకు అభినందనలు.
-గంగిశెట్టి శివకుమార్, నెల్లూరు