జాతీయ వార్తలు

అఖిలపక్షానికి వీరు దూరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఒకే దేశం- ఒకే ఎన్నికలు అనే నినాదంతో బీజేపీ నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి కొన్ని విపక్ష పార్టీలు దూరంగా ఉంటున్నాయి. ఈ పార్టీలకు చెందిన నేతలు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నారా చంద్రబాబు నాయుడు తాను సమావేశానికి హాజరుకావటం లేదని ప్రకటించారు. ఆయన ఈ మేరకు యూరప్ పర్యటన పెట్టుకున్నారు. చంద్రబాబు బాటలోనే మరికొన్ని పార్టీలు నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు ఈ సమావేశానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీ నేతృత్వంలో సమావేశమై అఖిలపక్ష భేటీకి హాజరుకాకూడదని నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకుంటే ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనేది బీజేపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నినాదం కాబట్టి విపక్షాలు ఈ భేటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నాయి.