సాహితి

అయ్యదేవర... ఎంత పని చేశారు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యదేవర పురుషోత్తమరావు హడావుడి మనిషి. నిరంతరం సాహిత్య కార్యక్రమాలో, నాటక సప్తాహాలో, పుస్తకావిష్కరణలో నిర్వహించాలని అతడి తాపత్రయం. ఇలాంటివి ఏర్పాట్లు చేయకపోతే ఆయనకు సంతృప్తిగా ఉండదు. ఒకసారి ఏమి ఉత్సాహం కలిగిందో డా.కె.ఎల్.రావుగారిని పెద్దఎత్తున సత్కరించాలని అతడు సంరంభించాడు. కార్యనిర్వహణ దక్షుడే. అందుకు సందేహం లేదు. కొన్ని వేల ప్రదర్శనలు, నాటకాలైతేనేం, భువన విజయ ప్రదర్శనలైతేనేమి నిర్వహించి ఉంటాడిప్పటికీ. ముప్ఫై ఏళ్ల కిందటి ముచ్చట ఇది.
డా. కానూరి లక్ష్మణరావుగారు స్వతంత్ర భారతదేశపు గొప్ప ఇంజనీర్. నీటిపారుదల సాంకేతిక విజ్ఞానంలో, నదుల అనుసంధానంలో భారతదేశ నదీ నదాల స్వరూపావగాహనలో ఈ మహనీయుడికి తెలీని విషయాలు లేవు. వీరి స్వీయ చరిత్ర ఇంగ్లీషులో ఉంది. దాని పేరు ‘క్యూసెక్స్ కేండిడేట్’. ఇది నీటిపారుదలకు సంబంధించిన సాంకేతిక గణాంక వివరణ పదం. ఈయన ప్రసంగాలలో ఆ పదం (క్యూసెక్స్) తప్ప ఇంకో పదం ఇన్నిమాట్లు పునరుక్తం కాదు. అందువల్ల ఆయన స్వీయ చరిత్రకు చలోక్తిగా ఈ పేరు పెట్టారు.
త్యాగరాజ గానసభలో ఈ సమ్మాన సభ ఏర్పాటు చేసాడు పురుషోత్తమరావు. డా.కె.ల్.రావంటే ఏమనుకున్నారో! కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి ఇల్లాలి సోదరుడు. తన చిన్నతనంలో శ్రీ లక్ష్మణరావు తనని మద్రాసు తీసుకునిపోయి కంటి ప్రమాదంనుంచి వైద్య చికిత్స చేయించిట్టు చెప్పుకున్నాడు డా కె.ఎల్.రావు స్వీయ చరిత్రలో. అయ్యదేవరవారికి కానూరు వారు బంధువులు. కాళేశ్వరరావుగారికి కానూరు లక్ష్మణరావుగారికి చాలా బంధుత్వ మమకారం ఉండేది. పురుషోత్తమరావు నాకప్పగించిన బాధ్యత ఏమంటే స్వతంత్ర భారతదేశ నీటి పారుదల రంగం అత్యంత ప్రతిభా సమగ్రుడైన లక్ష్మణరావు సమ్మాన పత్రం రాయడం. ఇది నేను చాలా చక్కగా రాశానని నా మురిపెం. సభ ప్రారంభానికి కొంచెం ముందుగానే వెళ్లాను. మరి వేదిక మీదికి పిలుస్తారు కదా అని మొదటి వరస కుర్చీలో కూర్చున్నాను. ఇంతలో కె.ఎల్.రావుగారు వచ్చి నా పక్క కుర్చీలో కూర్చున్నారు. నావంటి వాడు ఆయనకు తెలియటం కన్నా వింత ఏముంటుంది? ఒక రకంగా నమ్మలేని విషయం. కె.ఎల్.రావుగారు ‘నేను మీ కొమర్రాజు వారి జీవిత చరిత్ర’ చదివాను అని ఎంతో సంతోషంగా చెప్పారు. అంతేకాక కొమర్రాజు వారి మనవడు (వినాయక రావుగారి కుమారుడు తాతగారి పేరే పెట్టుకున్నాడు) కొమర్రాజు వారి ఇంకా కొన్ని భాషా సారస్వత, చారిత్రక రచనలు భద్రపరిచాడు. మీరు ఆసక్తి చూపండి అని కూడా కె.ఎల్.రావుగారు నాకు చెప్పారు.
డా.కె.ఎల్.రావు, లాల్‌బహదూర్ శాస్ర్తీ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసారు. లాల్‌బహదూర్ శాస్ర్తీ నిరాడంబరత, సాధు సజ్జన ప్రవత్తి, సౌజన్యం గురించి కొన్ని సన్నివేశాలు కె.ఎల్.రావు స్వీయచరిత్రలో చదివితే ఈ దేశపు గొప్ప అదృష్టమూ, అంతకన్నా భారతదేశ దురదృష్టమూ. మనసుకు చాలా కలత కలిగిస్తాయి.
ఈ సభకు మానవీయ శంకరదయాళ్ శర్మగారు గౌరవనీయ ముఖ్య అతిథి. ఆయనప్పడు ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వచ్చి రాజకీయ కల్మషాల అడుసును తొలగించి మళ్లీ తెలుగు వారికి విశ్వసనీయ రాజకీయ మనుగడను పునరుద్ధరించిన గొప్ప పండితుడు. ఉదార హృదయుడు. పి.వి.ఆర్.కె.ప్రసాద్ సమాచార పౌరసంబంధ కమిషనర్ (ఉన్నతోన్నధికారి) అనుకుంటాను. మీ సమ్మాన పత్రం త్వరత్వరత్వరగ ముగించాలి అంటారు. ఎందుకంటే నిష్కర్షతో, ఖచ్చితమైన సమయపాలనం పాటించక తప్పదు కదా అంటారాయన. అంటే పి.వి.ఆర్.కె.
శ్రీ కానూరి లక్ష్మణరావు మహా ప్రతిభా సమ్మాన పత్రం నేను చదివాను. శ్రీ శంకర్‌దయాళ్ శర్మగారు మధ్యమధ్యన నాకేసి చూస్తూ నవ్వు మొగంతో ఆనందించారు. బహుశా భగీరథ ప్రయత్నం, గంగా కావేరీ అనుసంధానం నా తెలుగు పదాలలో వచ్చి వుంటాయి.
అంతా బాగానే ఉంది. మా అయ్యదేవర పురుషోత్తమరావు నేను చదివిన ఆ సమ్మాన పత్రం భద్రపరిచారు కాదు. ఏదైనా పత్రికలో అచ్చువేశారు కాదు.

- అక్కిరాజు రమాపతిరావు