జాతీయ వార్తలు

హిమదాస్‌కు ప్రధాని మోదీ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్ స్టార్ అథ్లెట్ హిమదాస్‌కు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ఆమె వరుసగా ఐదు స్వర్ణాలు సాధించారు. ఆమెను చూసి దేశం గర్విస్తుందని అన్నారు. హిమదాస్‌ నెల వ్యవధిలోనే ఐదు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించింది. దీనిపై భారత ప్రధాని స్పందిస్తూ ట్వీట్ చేశారు. దేశం తరఫున ఐదు అంతర్జాతీయ స్వర్ణాలను సాధించినందుకు ఆమెను చూసి అందరూ సంతోషిస్తున్నారు. ఆమెకు అభినందలు. భవిష్యత్తులో మరింత రాణించాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్‌ చేశారు. హిమదాస్‌ పాంజ్‌సన్‌ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌, కుట్నో అథ్లెటిక్‌ మీట్‌, క్లాడ్నో అథ్లెటిక్‌ మీట్‌, టాబోర్‌ అథ్లెటిక్‌ మీట్‌, చెక్‌ రిపబ్లిక్‌ అథ్లెటిక్స మీట్‌లలో స్వర్ణాలను సాధించింది. అయితే ఆమె సెప్టెంబర్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించలేకపోయింది.