జాతీయ వార్తలు

సమస్యల పరిష్కారానికి పార్లమెంటే సరైన వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సద్వినియోగం చేసుకోవాలని పార్టీలకు ప్రధాని పిలుపు
హక్కుల రక్షణలో రాజ్యాంగం విజయవంతం అంటూ ప్రశంస

న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్రజా సమస్యలపై చర్చించటానికి పార్లమెంట్‌ను మించిన వేదిక ఇంకొకటి లేనందున పార్లమెంట్ శీతాకాలం సమావేశాలను సమస్యలపై చర్చించి పరిష్కరించుకునే వేదికగా సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు లేవదీసే ప్రతి అంశంపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన గురువారం పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు మొదలయ్యే ముందు విలేఖరులకు చెప్పారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకమైన చర్చ విస్తృత స్థాయిలో జరిగినప్పుడే ప్రజలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఏ విధమైన ఆటంకాలు లేకుండా సజావుగా జరిగిపోవటానికి సహకరించవలసిందిగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసినట్లు మోదీ చెప్పారు. తన అభ్యర్థనకు ప్రతిపక్షాల నుంచి సానుకూల స్పందన లభించిందని ప్రధాని తెలిపారు. ప్రతిపక్షాలతో ఎప్పటికప్పుడు కొంతమంది మంత్రులు మాట్లాడి, వారు ప్రస్తావించే అంశాలను పరిష్కరించే చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని గురు, శుక్రవారాలలో అంబేద్కర్‌కు నివాళులు అర్పిస్తూ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యాంగంపై ప్రజలలో అవగాహన పెరగవలసిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని ఒక ఆశాకిరణంగా ఆయన అభివర్ణించారు. సమాజంలో సామరస్యం, అభివృద్ధికి రాజ్యాంగం ఒక ప్రధాన ఆయుధంగా ఉపకరిస్తుందని ఆయన చెప్పారు. రాజ్యాగంలోని ప్రవేశికతోసహా ప్రతి అంశంపై విద్యార్థులు లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ దినోత్సవం నిర్వహణలో భాగంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. ప్రపంచ దేశాలలో మన రాజ్యాంగానికి ప్రత్యేక విశిష్టత ఉందని ఆయన చెప్పారు. ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడుతూ, ప్రజల హక్కులను కాపాడటంలో మన రాజ్యాంగం విజయం సాధిస్తోందని ప్రశంసించారు.
(చిత్రం) పార్లమెంటు వెలుపల విలేఖరులతో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ