హైదరాబాద్

మరో ‘కొత్త’ ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూసీ పరివాహక ప్రాంతాల పరిశీలన
హైదరాబాద్, మార్చి 7: నాటి జీవనది నేడు నిర్జీవయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మూసీ నది ప్రక్షాళన పేరిట దశాబ్దాలుగా పాలకులు వందల కోట్ల రూపాయలు వెచ్చించినా, పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఎప్పటికపుడు పనులు ప్రకటిస్తూ నిధులు మింగేశారే తప్ప, నదిలోకి వ్యర్థాలు రాకుండా మాత్రం ఆపలేకపోయారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత స్వపరిపాలనలో మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు మరో సరికొత్త ప్రయత్నాన్ని ప్రారంభించారు మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్. ఈ మేరకు ఆయన సోమవారం మూసీ పరివాహక ప్రాంతాలైన నాగోల్, అంబర్‌పేట, చాదర్‌ఘాట్, ఉస్మానియా ఆసుపత్రి, అత్తాపూర్‌లలోని మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. 51 నాలాల ద్వారా 93 శాతం వ్యర్థాలు మూసీలో కలుస్తున్నా, అందుకు తగిన సంఖ్యలో ఎస్టీపిలు లేవేని, వీటి సంఖ్యను పెంచాల్సిన అవసరముందని ఆయన అధికారులకు సూచించారు. గ్రీన్ క్లైమెట్ ఫండ్ కింద రూ. 3వేల కోట్లు అవసరమని, ఈ మొత్తాన్ని నాబార్డ్ నుంచి మంజూరు చేయించుకుంటామని, ఇందుకు అవసరమైతే తానే నేరుగా వెళ్లి చైర్మన్‌ను కలుస్తామని కెటిఆర్ చెప్పారు. ప్రతి పనిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ పారదర్శకతతో చేపడుతామంటున్న మంత్రి కెటిఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.