జాతీయ వార్తలు

ఇక వైద్యుల కొరత ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశంలో డాక్టర్ల కొరత తీర్చి, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సంతృప్తికరమైన వైద్య అవసరాలు తీర్చాలని యోచిస్తున్నట్టు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులకు వైద్య కళాశాలల స్థాయికి పెంచనున్నట్టు మంగళవారం ఇక్కడ తెలిపారు. దేశంలో ప్రాథమిక వైద్య సేవలు మరింత అందుబాటులోకి తేవాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే దేశవ్యాప్తంగా 1.5 లక్షల ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందని కాంత్ అన్నారు. దేశంలో వైద్యుల కొరత ముఖ్యంగా గ్రామాల్లో అధికంగా ఉందని సీఈవో చెప్పారు. జిల్లా ఆసుపత్రులను మెడికల్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా దాన్ని అధిగమించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల్లో సంస్థాపరమైన మార్పులు చేయడం ద్వారా వైద్యుల కొరతను తీర్చాలనుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. మా దృష్టంతా దాన్ని అధిగమించడంపైనే కేంద్రీకరించాం’ అని నీతి ఆయోగ్ చీఫ్ స్పష్టం చేశారు. 2018-19 కేంద్ర బడ్జెట్‌లో రెండు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన అన్నారు. మొదటిది ప్రాధమిక ఆరోగ్య విధానం పటిష్టం చేయడం, దీన్లో భాగంగా 1.5 లక్షల పీహెచ్‌సీలను ఏర్పాటుచేయడం అన్నారు. రెండోది బడ్జెట్‌లో కేటాయింపులు పెంచి పది కోట్ల కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం అని కాంత్ పేర్కొన్నారు. 50 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఎన్‌హెచ్‌పీఎస్)ను గత నెల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.