జాతీయ వార్తలు

రిజర్వేషన్లు పెంచాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ల శాతం పెంచాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు ముస్లిం రిజర్వేషన్లు కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ రెండోరోజు నిరసన కొనసాగించారు. అనంతరం ఎంపీ కవిత విలేఖరుతో మాట్లాడుతూ రాజ్యాంగంలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించకూడదని ఎక్కడ ప్రస్తావన లేదని, కేవలం సుప్రీం కోర్టు మాత్రమే సూచించిందని, అవసరమైన పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోనే అంశాన్ని పరిశీలించవచ్చునని తెలిపిందని అన్నారు. తెలంగాణలో స్థానిక పరిస్థితుల దృష్ట్యా రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని అమలుచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్లు మత ప్రతిపాదికన కాకుండా ఆర్థిక వెనుకబాటు ప్రతిపాదికన చూడాల్సివుందని, ఆ కోణంలోనే రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని, దాన్ని అమలు చేయాలని అన్నారు. ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీలు జీతేందర్ రెడ్డి, వినోద్ కుమార్, బూర నర్సయ్య గౌడ్, కొండ విశే్వశ్వరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, జీ నగేష్, బాల్క సుమన్, సీతారాం నాయక్ పాల్గొన్నారు.
chitram..
రిజర్వేషన్లు పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో నినాదాలిస్తున్న టీఆర్‌ఎస్ ఎంపీలు