శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేడు సిఎం చేతుల మీదుగా విద్యుత్ పవర్‌ప్లాంట్ జాతికి అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 26: జిల్లాలోని నేలటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన 1600 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాకు ముఖ్యమంత్రితోపాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, ప్రకాష్ జవదేకర్, పీయూష్‌గోయల్, సుజనాచౌదరి తదితరులు రానున్నారని తెలిపారు. రూ. 4,800 కోట్లతో జెన్‌కో రెండో దశ, మూడవ దశ, టిపిసిఎల్ థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సిఎం శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడని, మాట్లాడిన గంటలోనే నలుగురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారని, జగన్ మిగిలిన 62 మంది ఎమ్మెల్యేలకు హేట్స్ ఆఫ్ అని అనగానే బద్వేల్ ఎమ్మెల్యే పార్టీ మారారని ఎద్దేవా చేశారు. జగన్ అహంకారంగా వ్యవహరిస్తుండటంతోనే వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని చెప్పారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌కు రాజకీయాల్లో చలామణి అయ్యే హక్కు లేదన్నారు. ముందుగా కేసుల నుండి బయటపడి అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, కె వెంకటస్వామి నాయుడు, రమేష్‌రెడ్డి, హరియాదవ్, జి కన్నబాబు, సిహెచ్ వెంకటేశ్వర్లు, సి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సిఎం పర్యటనపై కలెక్టర్‌తో చర్చించిన టిఎస్‌ఆర్
ముత్తుకూరు, ఫిబ్రవరి 26: గాయత్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేయనున్న సందర్భంగా ఆ ప్రాజెక్టు అధినేత, మాజీ కేంద్ర మంత్రి తిక్కవరపు సుబ్బరామిరెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం జానకితో కలిసి పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. కలెక్టర్ ఈ ప్రాజెక్టును సాయంత్రం ఏడు గంటల సమయంలో సందర్శించారు. ఈక్రమంలో పలు విభాగాలను కలెక్టర్‌తో కలిసి మాజీ మంత్రి సుబ్బరామిరెడ్డి పరిశీలించారు. సిఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు.
రూ. 10వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం
గాయత్రి థర్మల్ పవర్ టెక్ ప్రాజెక్టును సుమారు రూ. 10 వేల కోట్లతో నిర్మించారు. 1320 మెగావాట్ల ప్రాజెక్టుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించనున్నారు. సుమారు 150 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. సింగపూర్‌కు చెందిన మంత్రి ఈశ్వర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు హాజరుకానున్నారు. సిఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. స్వాగత ఏర్పాట్లను ప్రాజెక్టు యాజమాన్యం ఘనంగా చేపడుతుంది. పోలీసు భద్రతా విభాగాలు ఈ ప్రాజెక్టును తమ ఆధీనంలోకి తీసుకొని బందోబస్తు చేపట్టారు.

దేవాలయాలు కొల్లగొట్టే ముఠా అరెస్టు
రూ. 40వేల విలువచేసే ఆభరణాలు, 5సెల్‌ఫోన్‌లు స్వాధీనం
మనుబోలు, ఫిబ్రవరి 26: చెడు వ్యసనాలకు బానిసైన యువకులు దేవాలయం తలుపులు పగులకొట్టి హుండీలను ధ్వంసం చేసి వాటిలో ఉన్న నగదుతోపాటు అమ్మవారి మంగళసూత్రాలను అపహరించుకెళ్తున్న ముఠాను మనుబోలు ఎస్‌ఐ నాగరాజు తన సిబ్బందితో చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరుకు చెందిన పల్లెల దేవేంద్ర 11 సంవత్సరాల వయస్సులోనే గూడూరులోని బ్రాందీషాపు రేకులు పగులకొట్టి నగదు అపహరించుకుపోయాడు. ఆ కేసులో పోలీసులకు పట్టుబడటంతో తిరుపతి బోస్టన్ స్కూల్‌కు పంపించారు. గత 4 సంవత్సరాల క్రితం విడుదలయ్యాడు. అప్పటి నుండి గూడూరుకు చెందిన బాలాజీతో స్నేహం చేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. డబ్బుల కోసం ఇద్దరు దేవాలయాలను కొల్లగొట్టడానికి అలవాటుపడి పొదలకూరులో 4 దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డారు. వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లిలో దేవేంద్ర అక్క కుమారుడు వెంకటేష్‌తోపాటు అదే గ్రామానికి చెందిన చల్లా క్రిష్టయ్యలు తమ ముఠాలో చేర్చుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద రోజుకు రూ.500 అద్దెతో ఆటోను తీసుకున్నారు. అప్పటి నుండి గూడూరు 2వటౌన్‌లో ఒక దేవాలయం, రూరల్ పరిధిలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారి ఇంటిలో చొరబడి సెల్‌ఫోన్లు అపహరించారు. కోట, చిట్టమూరు మండలాల్లో పలు దేవాయలయాల్లో వెండి పాదాలు, అమ్మవారి తాళిబోట్లు దొంగిలించారు. ఇదే విధంగా దొరవారిసత్రం -1, నాయుడుపేట మండలంలో-1 దేవాలయాల్లో తాళిబొట్లు అపహరించారు. అటుతర్వాత మనుబోలులో ఈ నెల 15వతేది రాత్రి 6 దేవాలయాల తలుపులు పగులకొట్టారు. వీటిలో రామాలయంలో విలువైన శంకుచక్రాలు, కాసులదండలతోపాటు పలు వస్తువులను అపహరించుకెళ్లారు. అటుతర్వాత నెల్లూరు 5వటౌన్ పరిధిలో దేవాలయంలో దొంగతనం చేశారు. దీంతో మనుబోలు పోలీసులు ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని గాలింపులు జరుపుతుండగా పొదలకూరు రోడ్డు ప్లైఓవర్ బ్రిడ్జి కింద ఆటోలో అనుమానాస్పదంగా వెళుతున్న వీరిని పోలీసులు పట్టుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అన్ని విషయాలు బట్టబయలయ్యాయి. దీంతో వీరి వద్ద నుండి సుమారు 40వేల రూపాయలు విలువచేసే ఆభరణాలతోపాటు 5సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అరెస్టు చేసి గూడూరుకోర్టుకు తరలించారు. వీరిలో బాలాజి మైనర్ కావడంతో తిరుపతిలోని బోస్టన్ స్కూలుకు తరలించారు. మిగిలిన వారిని రిమాండ్‌కు పంపారు. ఈ కార్యక్రమంలో మనుబోలు ఎస్‌ఐ నాగరాజు, ఎఎస్‌ఐలు భాస్కర్‌రావు, శివప్రకాష్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీ్ధర్, క్రాంతికుమార్, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, వాసు, రాజేష్, మస్తాన్, డిఎస్‌పి ఐడి పార్టీ కానిస్టేబుళ్లు రాజు, మోహిద్దీన్ ఉన్నారు.

‘అందరికీ ఇల్లు’ కోసం ప్రత్యేక వెబ్‌సైట్
నెల్లూరు, ఫిబ్రవరి 26: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణాల్లోని నిరుపేదలకు శాశ్వత నివాసాలు ఏర్పరచాలనే ఉద్దేశంతో అందరికీ ఇల్లు కల్పించడం కోసం అర్హులైన పేదవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.జానకి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. సొంత స్థలం ఉండి కూడా సొంత ఇల్లు లేని వారు, ప్రభుత్వ స్థలాల్లో, రైల్వే స్థలాల్లో నివసిస్తున్నవారు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ ఏడాదికి రూ.6లక్షల లోపు ఆదాయం కలిగిన వారు కూడా అర్హులని తెలిపారు. వీరు తమ దరఖాస్తులను ఈనెల 27వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ లోగా మీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు.

బ్యాంకు బంగారం వేలంలో గోల్‌మాల్
* సిండికేట్ అయిన వ్యాపారులు
* పంపకాల తేడాతో పోలీసుల జోక్యం
గూడూరు, ఫిబ్రవరి 26: గూడూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాల గడువు పూర్తికావడంతో శుక్రవారం అధికారులు వేలం నిర్వహించారు. ముందుగా తెలుసుకున్న నెల్లూరు, చిత్తూరు జిల్లాల వ్యాపారస్తులు 11 మంది ఒక సిండికేట్‌గా ఏర్పడి వేలం ద్వారా తక్కువ మొత్తంలో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 167 సవర్ల బంగారాన్ని కేవలం రూ. మూడు లక్షల 30 వేలకే సొంతం చేసుకోడానికి గాను లోపాయికారి ఒప్పందంతో ఎనిమిది మంది వ్యాపారులు కలిసి సిండికేట్ అయ్యారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల బ్యాంకు అధికారులు వీరికి సహకరించినట్లు తెలుస్తోంది. వేలంపాటల అనంతరం బంగారం స్వాధీనం చేసుకున్న వ్యాపారులు బ్యాంకు సమీపంలోని రైల్వే పార్శిల్ వద్ద ఆ నగలకు సంబంధించి డబ్బుల పంపకంలో విభేదాలు చోటుచేసుకోవడంతో విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు వీరందరినీ స్టేషన్‌కు తరలించారు. వీరికి ఇంత బంగారం ఎక్కడ నుంచి వచ్చిందని, గూడూరు పట్టణంలో ఐదు చోరీలు జరిగాయని, ఆ చోరీలో గల్లంతైన నగలే ఇవి అయి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీనితో తాము స్టేట్‌బ్యాంక్‌లో వేలం ద్వారా నగలను దక్కించుకున్నామని, అవసరమైతే బ్యాంక్ మేనేజర్ వద్ద వివరణ తీసుకోవాలని వ్యాపారస్తులు ఎస్‌ఐని కోరారు. దీంతో ఎస్‌ఐ బ్యాంక్ మేనేజర్ మురళీకృష్ణను కలిసి ఆ నగల తాలూకా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసుల అదుపులో ఉన్న సిండికేట్ వ్యాపారస్తులను వదిలివేశారు. దీంతో బ్యాంక్ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లిందని పలువురు ఆరోపించారు.

జిల్లాకు పలువురు కేంద్రమంత్రుల రాక
నెల్లూరు, ఫిబ్రవరి 26: పలువురు కేంద్రమంత్రులు శనివారం జిల్లాకు రానున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, అటవీ శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్, విద్యుత్ శాఖా మంత్రి పీయూష్‌గోయల్, సాంకేతిక శాఖా సహాయ మంత్రి సుజనాచౌదరి శనివారం జిల్లాకు వస్తున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం 2వ యూనిట్ ప్రారంభం, 3వ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమాల్లో వీరు పాల్గొననున్నారు. నగరంలోని జయభారత్ ఆసుపత్రిలో పలు నూతన బ్లాక్‌ల ప్రారంభ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు.

ముస్తాబైన ముఖ్యమంత్రి సభావేదిక ప్రాంగణం
* అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
ముత్తుకూరు, ఫిబ్రవరి 26: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఎపి జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవం చేయుచున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభావేదిక ముస్తాబైంది. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం జానకి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు సభావేదిక ఏర్పాట్లను, పైలాన్, పరిపాలనా భవనం, హెలిప్యాడ్, కంట్రోల్‌రూమ్ తదితర విభాగాలను పరిశీలించారు. జెన్‌కో పరిపాలన భవనంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సిఎం పర్యటనలో అధికారులు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎపి జెన్‌కో సిఎండి విజయానంద్‌తో కలెక్టర్ సిఎం పర్యటనలో ఏర్పాట్లపై చర్చించారు. 20 వేల మంది ప్రజలకు అనువుగా ఉండే విధంగా బహిరంగ సభ వేదికను అధికారులు సిద్ధం చేశారు. బాంబు స్క్వాడ్, డాగ్స్ స్క్వాడ్‌లు క్షుణ్ణంగా ప్రాజెక్టు భూభాగంలో తనిఖీ చేపట్టాయి. సిఎం పర్యటించే విభాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలతో ఎపి జెన్‌కో, గాయత్రి పవర్ ప్రాజెక్టులు నిండిపోయాయి. పరిపాలన భవనం, కంట్రోల్ రూమ్, పైలాన్ ఏర్పాట్లు ప్రారంభోత్సవానికి అధికారులు సన్నద్ధం చేశారు. ఇన్‌చార్జి ఎస్‌పి శ్రీకాంత్ పోలీసు అధికారులకు భద్రతపై పలు సూచనలు ఇచ్చారు. పోలీసులంతా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని కోరారు. ఎఎంసి చైర్మన్ మునుకూరు రవికుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ, రోడ్లుకు ఇరువైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డిఎస్‌పి తిరుమలేశ్వరరెడ్డి, ఎపి జెన్‌కో సిఇ సత్యనారాయణ, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

ప్రభుత్వంపై వామపక్షాల కుట్ర
* జిల్లా బిజెపి అధ్యక్షుడు సురేంద్రరెడ్డి విమర్శ
వెంకటాచలం, ఫిబ్రవరి 26: కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇతర పార్టీలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని జిల్లా బిజెపి అధ్యక్షుడు సురేంద్రరెడ్డి విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రమైన వెంకటాచలంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాజమండ్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలకు సంబంధం లేని విషయాలను చర్చకు తెచ్చి దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఈ విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం దృఢమైన సంకల్పంతో ఉందన్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో బిజెపి ఇచ్చిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా అమలు చేస్తుందన్నారు. దక్షణాది రాష్ట్రాల్లో బిజెపిని అభివృద్ధి చేసేందుకు అమిత్‌షా తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. మార్చి 6న రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.