జాతీయ వార్తలు

నాగాలాండ్‌ సీఎంగా రియో ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా: నాగాలాండ్‌లో భాజపా సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ‘నేషనల్‌ డెమోక్రటిక్‌-ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ)’ సీనియర్‌ నేత నెయిఫియు రియో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కోహిమాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ పి.బి. ఆచార్య ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌, హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌లతో పాటు మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీరెన్‌ సింగ్‌, పెమా ఖండూ, శర్వానంద సోనోవల్‌, కాన్రాడ్‌ సంగ్మా కూడా హాజరయ్యారు.