జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యం ఇష్టారాజ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు స్తంభనపై ప్రధాని ఆవేదన
ఆగిపోయింది జిఎస్‌టి బిల్లు ఒక్కటే కాదు
పేదలకు మేలు చేసే చట్టాలూ ఆగిపోయాయి
కాంగ్రెస్‌పై పరోక్ష దాడి

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పార్లమెంటు కార్యకలాపాలకు తరచూ అంతరాయం ఏన్పడడంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యం ఏ ఒక్కరి ఇష్టారాజ్యం కాదని స్పష్టం చేసారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లో కాంగ్రెస్ రభస సృష్టించడాన్ని పరోక్షంగా విమర్శిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసారనేది సుస్పష్టం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు, ప్రభుత్వం కాదని అంటూ ,ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న రెండు ప్రమాదాల్లో ఒకటి ‘మన్‌తంత్ర’ (కొంతమంది ఇష్టాయిష్టాల మేరకు నడవడం) కాగా, రెండవది ‘్ధన్‌తంత్ర’ (్ధనబలం) అని అన్నారు. పార్లమెంటు కార్యకలాపాలు స్తంభించడం వల్ల పేదలకు ప్రయోజనం చేకూర్చే చట్టాలు ఆగిపోవవడంతో వాళ్లు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆయన అన్నారు. ‘ఆగిపోయింది ఒక్క జిఎస్‌టి బిల్లే కాదు, పేదలకు మేలు చేసే అనేక బిల్లులు కూడా పార్లమెంటులో ఆగిపోయాయి’ అని మోదీ అన్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి తరచూ జరగడం మీరూ చూసే ఉంటారు. ‘ మేరీ మర్జీ’( నా ఇష్టం వచ్చింది చేస్తా), నా బుద్ధికి ఏమి తోస్తే అది చేస్తా అనే ధోరణి పెరిగిపోయింది. దేశం ఇలా నడుస్తుందా? ప్రజాస్వామ్యం అనేది ‘మన్‌తంత్ర’తో నడవదు. దాని ఆధారంగా దేశం నడవదు. మీరు ఆలోచన ఏమయినా కావచ్చు కానీ వ్యవస్థ మాత్రం ఇలా నడవదు’ అని మోదీ అన్నారు. ‘పార్లమెంటు పని చేయకపోవడం వల్ల పేదలు తమ హక్కులను పొందలేక పోవడం విచారకరం. ఇప్పుడు చర్చ అంతా జిఎస్‌టి, పార్లమెంటుపైనే జరుగుతోంది. జిఎస్‌టి విషయంలో ఏం జరిగినా దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి అందరితో చర్చించే చేసారు. అయితే పేదల మాటేమిటి? సామాన్య ప్రజల మాటేమిటి?’ అని ‘దైనిక్ జాగరణ్’పత్రికకు చెందిన జాగరణ్ మంచ్‌లో మాట్లాడుతూ ప్రధాని అన్నారు. ఈ సారి పార్లమెంటు పని చేయకపోవడం వల్ల ఉద్యోగాల్లో ఉన్న పేదల బోనస్‌ను 3,500 నుంచి 7 వేల రూపాయలకు పెంచడానికి ఉద్దేశించిన ఒక బిల్లు కూడా ఆగిపోయిందని అంటూ, %ఇది పేదలకు నేరుగా మేలు చేసేది కాదా?’ అని ప్రశ్నించారు.
అందుకే పార్లమెంటు పని చేసేందుకు అనుమతించమని ప్రభుత్వం ప్రతిపక్షాలను అభ్యర్థిస్తోందని ఆయన అంటూ, చర్చించడానికి, తమ అభిప్రాయాలను తెలియజేయడానికి పార్లమెంటుకన్నా పెద్ద వేదిక మరోటి లేదని అన్నారు. అయితే మనం పార్లమెంటును లెక్క చేయకపోతే ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకం అవుతుందని కూడా ఆయన అన్నారు. అందువల్ల పార్లమెంటు ప్రతిష్ఠను దృష్టిలో పెట్టుకుని అటు సామాన్యులకు ఇటు దేశానికి ప్రయోజనం చేకూర్చే చట్టాలను చేయాలని ప్రధాని అన్నారు. (చిత్రం) దైనిక్ జాగరణ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ