జాతీయ వార్తలు

ఉపాధి, ఆరోగ్యానికే ఓటర్ల ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ప్రాధాన్యతలకు సంబంధించి జాతీయ స్థాయిలో జరిగిన ఒక సర్వే అనేక కీలకాంశాలను వెలుగులోకి తెచ్చింది. ఉద్యోగ అవకాశాలు, ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ, మంచినీటి లభ్యతకే ఈ ఎన్నికల్లో అఖిల భారత స్థాయిలో ఓటర్లు ప్రాధాన్యత ఇస్తున్నారని ఏడీఆర్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో 10 అంశాలను ఓటర్లు ప్రముఖంగా ప్రస్తావించారని, వీటిని నెరవేర్చడంలో ప్రభుత్వ పనితీరు సగటుకు దిగువనే ఉందని సర్వే తెలిపింది. ప్రధానంగా ఉపాధి అవకాశాలకే ఓటర్లు పెద్దపీట వేశారని, 56.67 శాతం మంది ఉపాధి అవకాశాలను గట్టిగా కోరారని ఈ సర్వే తెలిపింది. అలాగే ఈ అంశంపై ప్రభుత్వ పనితీరు పేలవంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. పాలనాపరమైన అంశాలు, ప్రభుత్వ పనితీరుపై రేటింగ్, ఓటర్ల ప్రవర్తనను మార్చే అంశాలు ఏమిటన్నదానిపైనే దృష్టిపెట్టి ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా కూడా ఉపాధి అవకాశాలు, ఆరోగ్యం, మంచినీటి అవసరాలకే ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చారని ఈ సర్వే తెలిపింది. అలాగే వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై కూడా ఈ సంస్థ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 534 లోక్‌సభ నియోజకవర్గాల్లో 2,73,487 మంది ఓటర్ల నుంచి అనేక అంశాలపై అభిప్రాయాలను సేకరించింది. సర్వే జరిపిన 32 రాష్ట్రాలు, యూటీల్లో 29 రాష్ట్రాల్లో ప్రభుత్వ పనితీరు అధ్వాన్నంగా ఉందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. రాష్టస్థ్రాయిలో కూడా ఈ మూడు ప్రధాన అంశాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమైంది