జాతీయ వార్తలు

అయోధ్య వివాదంలో కొత్త మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: అయోధ్య రామజన్మభూమి వివాదం కేసులో మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్న కమిటీ తన కార్యకలాపాలను ఫైజాబాద్ నుంచి న్యూఢిల్లీ లేదా ఇతర ప్రదేశానికి నిర్వహించేవిధంగా చర్యలు తీసుకోవాలని తమ ప్రతిపాదనను పరిశీలించాలని ఈ కేసులో పార్టీ అయిన నిర్మోహీ అఖారా సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసు సున్నితమైనదని, ఈ కేసు ప్రాధాన్యత దృష్ట్యా తమ ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు. యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు, నిమోహీ అఖారా మధ్య నేరుగా సంప్రదింపులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటే ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని నిర్మోహీ అఖారా పేర్కొంది. మధ్యవర్తిత్వ కమిటీలో సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులను నియమించాలని కోరారు. ఈ నెల 8వ తేదీన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసును మధ్యవర్తిత్వ కమిటీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ అంశాలతో ఈ నెల 25వతేదీ సోమవారం ఆఖారా సంస్థ సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసింది. టైటిల్‌లో ప్రధానపార్టీలైన యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డుపంచ రామానంది , నిర్మోహీ అఖారా పార్టీల మధ్య సంప్రదింపులు జరిగే విధంగా ప్రోత్సహించాలని కోరారు. స్థానిక పరిస్థితులు, సున్నితమైన కేసును దృష్టిలో పెట్టుకుని ఫైజాబాద్ కాకుండా వేరే తటస్థ ప్రదేశానికి మధ్యవర్తుల కమిటీ సమావేశాలను తరలించాలని ఈ సంస్థ కోరింది. ఈ నెల 13వ తేదీన మధ్యవర్తుల కమిటీ సమావేశంలో తాము పాల్గొన్నామని, ఈ అంశంపై చాలా కసరత్తు చేయాల్సి ఉందని ఆ సంస్థ పేర్కొంది. ప్రొసీడింగ్స్‌ను ఈ నెల 27 నుంచి 29వరకు వాయిదా వేశారని ఆ సంస్థ పేర్కొంది. తాము మధ్యవర్తుల కమిటీ ప్రతిపాదనను తొలుత ఆహ్వానించామని ఆ సంస్థ పేర్కొంది.