జాతీయ వార్తలు

కంధమాల్ త్రిముఖ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫూల్‌బంగ్ (ఒడిశా), ఏప్రిల్ 14: ఒడిశాలో గిరిజనుల ప్రాబల్యం అత్యధికంగా గల కంధమాల్ లోక్‌సభ స్థానానికి త్రిముఖ పోరు జరుగుతోంది. 2008లో వీహెచ్‌పీ నాయకుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి ఇక్కడ జరిగిన అల్లర్లలో హత్యకు గురికావడంతో ఒక్కసారి ఈ ప్రాంతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రెండో విడతగా జరిగే పోలింగ్‌లో భాగంగా ఈనెల 18న ఈ లోక్‌సభ స్థానానికి ఎన్నిక జరగనుంది. వాస్తవానికి కంధమాల్ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నా ప్రధానంగా బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు ఉంటుంది. బీజేడీ తరఫున అచ్యుత సమంతా, బీజేపీ తరఫున ఖరవేల స్వెయిన్, కాంగ్రెస్ అభ్యర్థిగా మనోజ్ ఆచార్య పోటీ పడుతున్నారు.
ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరైన సమంతా విద్యావంతుడైన పారిశ్రామికవేత్తగా కొనసాగుతునే మరోపక్క రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలుపు తనదే అన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజల్లో తనకున్న పలుకుబడి, పరపతి, వ్యక్తిగతంతా తనకు గల చరిస్మాతోపాటు బీజేడీ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయ్ ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉండడంతో గెలుపు తనకు నల్లేరుపై నడకగానే ఆయన భావిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ఖరవేల స్వెయిన్ ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా గెలిచిన అపార అనుభవం ఉండడంతోపాటు ప్రభాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకే తనను గెట్టెక్కిస్తాయనే గట్టి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న మనోజ్ ఆచార్య సైతం ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా విజయం తననే వరిస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకర నేపథ్యంలో ఫుల్‌బని పార్లమెంటు నియోజకవర్గం నుంచి కొత్తగా కంధమాల్ ఎంపీ నియోజకవర్గం ఆవిర్భవించింది. కంధమాల్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం స్థానిక గిరిజనులకే పట్టు ఉన్న నేపథ్యంలో కావడంపాటు పనోజ్ అనే షెడ్యూల్డ్ కులానికి చెందిన వారితోపాటు క్రిస్టియన్ల సంఖ్య కూడా నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపులో కీలక పాత్రను పోషించనున్నాయి. 2009 నుంచి బీజేడీకి పెట్టని కోటగా ఈ కంధమాల్ లోక్‌సభ స్థానం నిలుస్తోంది. 2014లో బీజేడీ తరఫున పోటీ చేసిన హేమేంద్ర చంద్ర సింగ్ 1,81,017 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అయితే, అకస్మాత్తుగా ఆయన మరణించడంతో బీజేపీ సింగ్ భార్య ప్రత్యూష రాజేశ్వరి సింగ్‌కు ఎంపీ సీటు కేటాయించడంతో ఆమె బీజేపీ అభ్యర్థి రుద్రమధాభ్ రాయ్‌పై 2,98,868 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆమెకు ఇదే స్థానం నుంచి టికెట్‌ను నిరాకరించడంతో ఆమె బీజేడీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం స్వీకరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరివారే గెలుపుపై గట్టి ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

చిత్రాలు.. అచ్యుత సమంతా *ఖరవేల స్వెయిన్ *మనోజ్ ఆచార్య