జాతీయ వార్తలు

రాజ్యాంగం విచ్ఛిన్నానికి యత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిల్‌చార్ (అస్సాం), ఏప్రిల్ 14: దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు, ఆరోపణలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి తన సహజమైన ధోరణిలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆదివారం అస్సాం రాష్ట్రంలోని సిల్‌చార్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి సుష్మితా దేవ్‌కు మద్దతు జరిగిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదని, రాజ్యాంగ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పర్యటనలు చేశారని, కానీ తనను గెలిపించిన సొంత నియోజవర్గం వారణాసి ప్రజల కోసం సమయాన్ని వెచ్చించలేకపోతున్నారని విమర్శించారు. ‘ఈరోజు మహాపురుషుడు బీఆర్ అంబేద్కర్‌జీ జయంతి. దేశ రాజ్యాంగానికి ఆయన పునాదిరాయి వేశారు. అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉంది. కానీ ఇపుడు మీరు చూస్తున్నారు..రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు సరికదా..దానిని నాశనం చేసేందుకు యత్నిస్తున్నారు’ అంటూ పరోక్షంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇదిలావుండగా, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రియాంక గాంధీ మాట్లాడుతూ రాజ్యాంగంపై గౌరవం లేనట్టుగానే ఆ మేనిఫెస్టోలో భిన్న సంస్కృతులు, మతాల వారికి చోటులేదని వ్యాఖ్యానించారు. తాము గెలిపించిన వారణాసిలో తమతో ఐదు నిమిషాలైనా గడిపేందుకు ప్రధాని మోదీకి సమయం లేదని తాను ఇటీవల జరిపిన ఎన్నికల ప్రచారంలో అక్కడి ప్రజలు చెప్పి వాపోయినట్టు ఆమె పేర్కొన్నారు. ‘ఆలింగనం కోసం ఆయన అమెరికా వెళ్లారు, చైనాలో ఆలింగనం కోసం వెళ్లారు. అదేవిధంగా రష్యా, ఆఫ్రికా కూడా ఆలింగానల కోసమే వెళ్లారు. జపాన్ వెళ్లిన ఆయన అక్కడ డ్రమ్ వాయించారు. పాకిస్తాన్‌లో బిర్యానీ తిన్నారు. కానీ తన సొంత నియోజకవర్గంలోని ప్రజల పరిస్థితి ఎలా ఉందోనన్న ఆలోచన ఒక్కసారి కూడా ఆయనకు లేకపోయింది’ అని ఆమె పరోక్షంగా మోదీపై ఆరోపణలు చేశారు. ఇదిలావుండగా, సిల్‌చార్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న సుష్మితా దేవి నిజాయితీపరురాలు, అందరితో మమేకం అయ్యే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని, ప్రజల మేలు కోసం ఆమె గట్టిగా పనిచేస్తారని కనుక ఈ ఎన్నికల్లో ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రియాంక గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.