జాతీయ వార్తలు

99.8 శాతం బాండ్లు పెద్ద డినామినేషన్లవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఏప్రిల్ 14: రాజకీయ పార్టీలు 2018 మార్చి నుంచి 2019 జనవరి 24వ తేది వరకు ఎన్నికల బాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాలలో 99.8 శాతం విరాళాలు అధిక డినామినేషన్లయిన రూ. 10 లక్షలు, రూ. ఒక కోటివి ఉన్నాయని సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద పొందిన గణాంకాలు వెల్లడించాయి. దాతలు రూ. 1,407.09 కోట్ల విలువయిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయగా, అందులో రూ. 1,403.90 కోట్ల విలువయిన బాండ్లు అధిక డినామినేషన్లయిన రూ. 10 లక్షలు, రూ. ఒక కోటివి ఉన్నాయి. చంద్రశేఖర్ గౌడ్ అనే సామాజిక కార్యకర్త ఆర్‌టీఐ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి పొందిన ఈ గణాంకాలను మీడియాకు విడుదల చేశారు. దాతలు రూ. 10 లక్షల విలువ గల 1,459 ఎన్నికల బాండ్లను, రూ. ఒక కోటి విలువ గల 1,258 ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశారు. వారు రూ. ఒక లక్ష విలువ గల 318 బాండ్లను, రూ. 10వేల విలువ గల 12 బాండ్లను, రూ. వెయ్యి డినామినేషన్ గల 24 బాండ్లను కొనుగోలు చేసినట్టు గౌడ్ ఆర్‌టీఐ కింద సమాచారాన్ని కోరుతూ చేసిన దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో ఎస్‌బీఐ తెలిపింది. రాజకీయ పార్టీలు రూ. 1,395.89 కోట్ల విలువయిన ఎన్నికల బాండ్లను తిరిగి నగదుగా మార్చుకున్నాయి. ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్లను తిరిగి నగదుగా మార్చుకున్నాయి? ఏ పార్టీకి ఎన్ని నిధులు వచ్చాయి? అనే వివరాలు కూడా తెలపాలని చంద్రశేఖర్ గౌడ్ తన దరఖాస్తులో కోరారు. అయితే, ఎస్‌బీఐ ఆ వివరాలను వెల్లడించలేదు.