జాతీయ వార్తలు

జూన్‌లోనే రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నైరుతీ రుతుపవనాలు వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ 96 శాతం వర్ష పాతం నమోదుకానుందని పేర్కొంది. ఢిల్లీలో సోమవారం వాతావరణ శాఖ కార్యాలయంలో 2019 ఏడాదికి సంబంధించి వాతావరణ పరిస్థితుల అంచనాలను వెల్లడించింది. వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ మాట్లాడుతూ ఈ ఏడాది జూన్ మొదటి వారం కేరళను నైరుతీ రుతుపవనాలు తాకే అవకాశం ఉందని చెప్పారు. గత సంవత్సరం లాగానే ఈసారీ సాధారణ వర్షపాతం కురుస్తుందని వెల్లడించారు. గత ఏడాది లాగానే ఎండల తీవ్రత అధికంగానే ఉంటుందన్నారు. ఇప్పటికే ఎండల ప్రతాపం దేశ వ్యాప్తంగా చూపుతోందని చెప్పారు. గడిచిన మూడు సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆయన భరోసా ఇచ్చారు. రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపే ‘ఎల్‌నినో’ ఈసారి భారత్‌పై ఉండదన్నారు. ప్రస్తుతం బలహీనంగా ఉన్న ఎల్‌నినో రుతుపవనాలపై ప్రభావం చూపలేదని అంచానాకు వచ్చినట్టు తెలిపారు. హిందూమాహా సముద్రంలో కూడా ‘ఇండియాన్ ఓషన్ డైపోల్’ వృద్ధి చెందడం వల్ల ఎల్‌నినో రుతుపవనాలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలలో కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని రమేష్ స్పష్టం చేశారు. అలాగే పంటలకు ఎలాంటి ఇబ్బందులుండవని చెప్పారు. గత ఏడాది 91 శాతం వర్షాల వల్ల దేశంలో పంటల బాగాపండి మంచి దిగుబడి వచ్చిందని వెల్లడించారు. వాతవరణ శాఖ తదుపరి నివేదికను జూన్ మొదటి వారంలో వెల్లడిస్తుందని రమేష్ చెప్పారు.